
అమెరికా వెళ్లాల్సిన వృద్ధుడు అదృశ్యం
అమెరికా వెళ్లడానికి నగరానికి వచ్చిన ఓ వృద్ధుడు కనిపించకుండా పోయిన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన సూర్యారావు(65) అమెరికాలో ఉంటున్న కుమారుడు, కూతురు దగ్గరికి వెళ్లడానికి ఈనెల 6 తేదీ ఉదయం శాలివాహననగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చాడు.
సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి వెళాల్సి ఉండగా.. 4 గంటల సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన బంధువులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకుండా పోయింది. సూర్యారావుకు మతిమరుపు ఉన్నట్లు బంధువు రామకృష్ణ పోలీసులకు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.