
అమీర్‌పేట: ఉన్నత చదువులకు అమెరికాలో పుష్కలమై అవకాశాలు ఉన్నాయని బార్బొడస్ బ్రిడ్జిటౌన్ అంతర్జాతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, మాజీ విధ్యాశాఖ మంత్రి రొనాల్డ్ జోన్స్ అన్నారు. విదేశాల్లో విద్యావకాశాలపై ఆదివారం అమీర్‌పేట ఆదిత్యపార్క్ ట్రేడ్ సెంటర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులకు ఎంత దూరమైన వెళ్లేవారు నాణ్యమైన విద్యతో పాటు భద్రతకు ప్రాధాన్యతనిచ్చే సంస్థలను ఎంచుకుకోవాలన్నారు. బ్రిడ్జిటౌన్ అంతర్జాతీయ యూనివర్సిటీ ఆఫ్ బార్బొడస్‌లో మెడిసిన్ ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.