
ఐఫోన్@రూ.15 వేలు?
ఆపిల్ ఐ ఫోన్.. దీనికి ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
ఆపిల్ ఐ ఫోన్.. దీనికి ఇండియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫోన్‌ను ఫీచర్స్ కోసం వినియోగించేవారి కంటే అదో హోదాగా ఉపయోగించేవారే ఎక్కువ. కొంతకాలంగా భారత్‌లో మొబైల్ మార్కెట్‌పై కన్నేసిన ఆపిల్.. వినియోగదారులను ఆకర్షించేందుకు ధరలను కొద్దిగా తగ్గించింది. తాజగా ఐ ఫోన్ 5ఎస్ ధరను మరింత తగ్గించబోతోందని మార్కెట్ వర్గాల టాక్.
ప్రస్తుతం రూ.18 వేలకు అందుబాటులో ఉన్న 5ఎస్ ధరను రూ.15 వేలకు తగ్గించాలని ఆపిల్ యోచిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు ఐఫోన్ ఎస్‌ఈ మోడల్ ధరను రూ.20 వేలకు తగ్గించి విక్రయిస్తారని అంటున్నారు. మధ్య స్ధాయి ధరల మొబైల్స్ మార్కెట్‌ను పెంచుకునేందుకు ఆపిల్ ఈ యోచన చేస్తున్నట్లు అర్ధమవుతోంది.