ప్రతీకాత్మకచిత్రం
బెంగళూర్ : ఐఫోన్ 11 ప్రొ ఆర్డర్ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు నకిలీ ఫోన్ అందడంతో విస్తుపోయిన ఘటన ఐటీ సిటీ బెంగళూర్‌లో చోటుచేసుకుంది. రూ 93,900 విలువైన ఐఫోన్ 11 ప్రొను తాను ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేస్తే నకిలీ ఐఫోన్‌ను పంపారని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ కుష్వాహ్ వాపోయారు. తాను రూ 93,900 చెల్లించి ఐఫోన్‌ను ఆర్డర్ చేయగా, ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నిర్వాకం తనను షాక్‌కు గురిచేసిందని 26 ఏళ్ల కుష్వాహ్ చెప్పుకొచ్చారు. తనకు వచ్చిన ప్యాకేజ్‌ను తెరిచిన వెంటనే ఫోన్ కెమెరా స్క్రీన్ నకిలీదని గుర్తించిన కుష్వాహ్ ఫోన్ సాఫ్ట్‌వేర్ కూడా ఐఓఎస్ కాదని, యాండ్రాయిడ్ యాప్స్‌ను మిక్స్ చేశారని పసిగట్టారు.
ప్లిఫ్‌కార్ట్‌ను అమ్మకాల వేదికగా ఎంచుకున్న సెల్లర్లు, థర్డ్ పార్టీ కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని భావిస్తున్నారు. తనకు అందిన పార్సిల్‌పై ఫిర్యాదు చేయగా, ఆర్డర్‌ను రీప్లేస్ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ హామీ ఇచ్చినా ఇప్పటివరకూ రీప్లేస్ కాలేదని కస్టమర్ వెల్లడించారు. గతంలోనూ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు, ఇటుకలు, పండ్లు వంటి ఇతర వస్తువులు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పలువురు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్న ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment