Apple iPhone 14 available at massive discount on Flipkart - Sakshi
Sakshi News home page

యాపిల్‌ ఐఫోన్‌ 14 పై భారీ డిస్కౌంట్‌

Published Tue, Jul 25 2023 5:16 PM | Last Updated on Wed, Jul 26 2023 10:19 AM

AppleiPhone14 available at massive discount on Flipkart - Sakshi

యాపిల్‌ ఐఫోన్‌ 14 లవర్స్‌కు గుడ్‌న్యూస్‌. ఈ లగ్జరీస్మార్ట్‌ఫోన్‌ ఇపుడు భారీ తగ్గింపులో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 42,600 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంటే దీని ధర రూ. 30,000 కంటే తక్కువన్నమాట. డిస్కౌంట్లు, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫరలు కలిపి  ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14పై ఈ భారీ తగ్గింపుతో లభిస్తుంది.

ఇదీ చదవండి : ట్యూటర్లకు షాక్‌: ఏఐ చాట్‌బాట్‌పై బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

ఐఫోన్‌ 14 తగ్గింపు ఆఫర్
ఐఫోన్‌ 14  128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌ధర  రూ. 69,999  వద్ద లిస్ట్‌ చేసింది.  దీని లాంచింగ్‌ ప్రైస్‌. రూ.79,900. ప్రస్తుతం రూ. 9901 తగ్గింపు అందుబాటులో ఉంది.  దీంతో పాటు, బ్యాంక్ మరియు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌లతో మరింత దిగి వచ్చింది. ముఖ్యంగా తమ  స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌గా (ఫోన్  పరిస్థితి  మోడల్‌పై ఆధారపడి) రూ. 38,600 వరకు ఆఫర్ చేసే ఎక్స్ఛేంజ్ డీల్‌ లభ్యం. (యోగా గురు రామ్‌దేవ్ లగ్జరీ కార్ల కలెక్షన్‌: దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు)

అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 4,000 వరకు బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌తో లావాదేవీలపై 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఇవన్నీ వర్తించిన తరువాత  యాపిల్‌ ఐఫోన్‌ 14  128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ కేవలం రూ. 27,399కే కొనుగోలు చేయవచ్చు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement