ఐ ఫోన్‌ ఎక్స్‌:ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ | Apple iPhone X: Airtel offers Rs 10,000 cashback for postpaid customers | Sakshi
Sakshi News home page

ఐ ఫోన్‌ ఎక్స్‌:ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌

Published Wed, Nov 1 2017 8:05 PM | Last Updated on Wed, Nov 1 2017 8:24 PM

Apple iPhone X: Airtel offers Rs 10,000 cashback for postpaid customers

న్యూఢిల్లీ: ఆపిల్‌10వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్‌లోకి వచ్చిన ఆపిల్‌ అత్యంత ఖరీదైన ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌పై ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌  ప్రకటించింది. నవంబర్‌ 3నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నఆపిల్ ఐఫోన్ ఎక్స్‌ పై   ఎయిర్‌ టెల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా  రూ. 10వేల క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ పోస్ట్‌ పెయిడ్‌ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ ఆఫర్‌ లభించనుంది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలనుంచి  శనివారంఉదయం 7. గంటల వరకు ఎయిర్‌ టెల్‌ పోస్ట్‌ పెయిడ్‌వినియోగదారులకు  ఈ ఆఫర్‌అందుబాటులోఉంటుందని భారతి ఎయిర్‌టెల్‌ సీఎంఓ రాజ్‌ పూడిపెద్ది ప్రకటించారు. 

నవంబర్ 3 సాయంత్రం 6గంటలనుంచి కొత్తగా ప్రారంభించిన ఎయిర్టెల్  ఆన్‌లైన్‌ స్టోర్లో ఐఫోన్ ఎక్స్‌  ఫోన్లను  ఎయిర్‌టెల్‌ విక్రయించనుంది. ముఖ్యంగా  సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌కార్డు ద్వారా కొనుగోలుచేసే ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు  రూ.10వేల క్యాష​ బ్యాక్‌  పొందొచ్చునని ఎయిర్‌టెల్‌  ప్రకటించింది. నవంబరు 3వ తేదీ సా. 6గంటలనుంచి మరునాడు ఉదయం 7గంటలవరకు మాత్రమే ఈ  సౌలభ్యమని తెలిపింది. పూర్తిగా నగదు చెల్లించిన(నో ఈఎంఐ ఆప‍్షన్‌ ) పోస్ట్‌పెయిడ్‌  వినియోగదారుల్లో ఫస్ట్‌  కం ఫస్ట్‌ సెర్వ్‌ కింద ఈ ఆఫర్‌ అందుబాటులోఉంటుందని  పేర్కొంది. అయితే ప్రీ ఆర్డర్‌ కోసం  ప్రముఖ ఈ కామర్స్‌ సైట్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో  అందుబాటులోఉన్నప్పటికీ.. ఎయిర్‌టెల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో  ఐఫోన్‌ఎక్స్‌ ఇంకా లిస్ట్‌ అయినట్టు చూపించడం లేదు.

కాగాఎయిర్టెల్ ఆన్‌లైన్‌ స్టోర్ సేవలు  ప్రస్తుతం భారతదేశంలోని 21 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.  ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న  ఆపిల్‌ ఐఫోన్‌ ఎక్స్‌ స్మార్ట్‌ఫోన్‌  నవంబరు 3నుంచి గ్లోబల్‌ మార్కెట్లలోకి విక్రయానికి రానున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement