Online Stores
-
USA Presidential Elections 2024: ‘ట్రంప్ ధిక్కార’ టీ షర్టుల జోరు
బ్యాంకాక్: అటు తూటాల వర్షం. ఇటు చెవి నుంచి చెంప మీదుగా బొటబొటా కారుతున్న రక్తం. అంతలోకే రక్షణ వలయంగా కమ్ముకున్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతటి భీతావహ పరిస్థితిలోనూ పిడికిలి గట్టిగా బిగించి పైకెత్తి ‘పోరాటమే’నంటూ గొంతెత్తి నినాదాలు. ట్రంప్‌పై దాడి జరిగిన క్షణాలకు శాశ్వతత్వం కలి్పంచిన ఫొటో ఇది. హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డ క్షణాల్లో కూడా ట్రంప్ ఆత్మనిబ్బరానికి, ఆయన ప్రదర్శించిన సాహసానికి ప్రతీకగా నిలిచిన ఈ ఫొటో అప్పుడే టీ షర్టులపైకి కూడా ఎక్కింది. అది కూడా దాడి జరిగిన రెండు గంటల్లోపే! అంత తక్కువ సమయంలోనే టావోబావో, జేడీ.కామ్ వంటి చైనా ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్లైన్ దుకాణాలు ఆ ఫొటోలతో కూడిన టీ షర్టులను తయారు చేయడం, ఇ–కామర్స్ ప్లాట్‌ఫాంల్లో అమ్మకానికి పెట్టడం చకచకా జరిగిపోయాయి! వాటికి చూస్తుండగానే చైనా, అమెరికాల నుంచి 2,000 పై చిలుకు ఆర్డర్లు వచ్చాయి! -
భారత్‌లో యాపిల్ వ్యాపారం రెట్టింపు
న్యూయార్క్/న్యూఢిల్లీ: కొత్తగా ప్రారంభించిన ఆన్లైన్ స్టోర్ ఊతంతో భారత మార్కెట్లో టెక్ దిగ్గజం యాపిల్ విక్రయాలు మరింతగా పెరుగుతున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో తమ వ్యాపారం రెట్టింపయినట్లు సంస్థ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. దేశీ ప్రీమియం స్మార్ట్ఫోన్ల విభాగంలో శాంసంగ్, వన్‌ప్లస్‌తో యాపిల్ పోటీ పడుతోంది. గత త్రైమాసికంలో ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో 111.4 బిలియన్ డాలర్ల ఆదాయం ఆర్జించినట్లు ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కుక్ తెలిపారు. వార్షికంగా 21 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమ్మకాలే 64 శాతంగా ఉన్నట్లు వివరించారు. ‘ఉదాహరణకు భారత్ విషయాన్నే తీసుకుంటే అంతక్రితం ఏడాది డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే వ్యాపారం రెట్టింపయ్యింది. ఆన్లైన్ స్టోర్ పెట్టిన తర్వాత ఇవి తొలి పూర్తి స్థాయి త్రైమాసిక ఫలితాలు. అయితే, అవకాశాల పరిమాణంతో చూస్తే వ్యాపారం ఇంకా చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. కానీ, రాబోయే రోజుల్లో మరింతగా వృద్ధి సాధించబోతున్నాం‘ అని కుక్ చెప్పారు. త్వరలో భారత్‌లో రిటైల్ స్టోర్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. సెప్టెంబర్ 23న యాపిల్.. భారత్‌లో తమ తొలి ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. కౌంటర్‌పాయింట్ వంటి రీసెర్చ్ సంస్థల నివేదికల ప్రకారం 2020 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో యాపిల్ అమ్మకాలు 171% పెరిగాయి. ఐఫోన్ 12 ఆవిష్కరణ, ఐఫోన్ ఎస్ఈ 2020, ఐఫోన్ 11పై ఆకర్షణీయ ఆఫర్లు, ఆన్లైన్లో విక్రయాలు వంటివి ఇందుకు దోహదపడ్డాయి. -
కళలు, చేతి వృత్తులను బతికించుకుందాం : సీఎం జగన్
సాక్షి, అమరావతి : ఆప్కో- లేపాక్షి ఆన్లైన్ వెబ్స్టోర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోర్టల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. బీసీలకు పెద్దపీట : 'దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం.మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చాం. ఆ వర్గాలకే చెందిన వారికి ప్రయోజనం కల్పించే విధంగా ఇవాళ రెండు ఆన్లైన్ స్టోర్లు ప్రారంభిస్తున్నాం.వాటి ద్వారా మన కళలు, చేతి వృత్తులను బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం అది మాత్రమే కాదు, ఆ కళలు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. (చదవండి : సీఎం జగన్‌ను కలిసిన మంత్రాలయం ప్రతినిధులు) ఆప్కో–లేపాక్షి : ఆప్కో ఆన్లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా మన రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు మరింత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో వాటికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో ఎవరు కొనుగోలు చేసినా, అన్నీ సక్రమంగా అందేలా పూర్తి ఏర్పాట్లు చేశాం. ఇది ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా మంచి ఆదరణ లభించేలా చేస్తుంది. ఈ–ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటు : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా, వంటి ఈ–ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి.ఆప్కో ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వస్త్రాలు, డ్రెస్ మెటేరియల్స్, బెడ్షీట్లు పొందవచ్చు.ఇక లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కళంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలుబొమ్మలు పొందవచ్చు.అలా మన కళా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ స్థానం లభిస్తుంది. ఆ విధంగా ఆ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లభిస్తుందని 'ఆశిస్తున్నాను. హస్త కళాకారులకు ఆర్థిక సహాయం : 'హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నాం. ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం, మరోవైపు ఏటా ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ రెండింటి వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. జిల్లాలలో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్ స్టోర్స్‌లోకి తీసుకురావాలి.ఈ కళలు కలకాలం ఉండాలంటే, వాటికి అండగా నిలవడం ఎంతో అవసరం.ఇప్పుడు చేనేత కారుల కోసం నేతన్న నేస్తం పథకం ఉంది కాబట్టే, ఆ రంగం బ్రతుకుతోంది. అలాంటి వృత్తులు బ్రతకాలంటే ప్రభుత్వ సహాయం, అండగా నిలవడం ఎంతో అవసరం .' అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆప్కో– లేపాక్షి ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన జగన్ ఆన్లైన్లో ఒక చీరను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, లేపాక్షి అధికారులతో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.(చదవండి : స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేస్తోంది...
న్యూఢిల్లీ: అమెరికా టెక్ దిగ్గజం భారత్‌లోని ఐఫోన్ ప్రియులకు శుభవార్త చెప్పింది. దేశంలో తొలి ఆన్లైన్ స్టోర్ సెప్టెంబర్ 23 న ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. రానున్న పండుగ సీజన్ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని కంపెనీ భావిస్తోంది. ఆన్లైన్ స్టోర్ ఆవిష్కరణతో భారత్‌లోని తమ కస్టమర్లకు మరింత చేరువవుతామని పే ర్కొంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ స్టోర్లలో లభించే ప్రీమియం అనుభవాన్ని ఈ ఆన్లైన్ స్టోర్ అందిస్తుందని కంపెనీ ఆశిస్తోంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్లైన్ బృంద సభ్యులు సిద్ధంగా ఉన్నారని యాపిల్ చెప్పుకొచ్చింది. ఈ ఆన్లైన్ స్టోర్లలో యాపిల్‌కు చెందిన ఐఫోన్, ఐప్యాడ్, మాక్, ఉపకరణాలు లాంటి పూర్తి స్థాయి ఉత్పత్తులను అందుబాటులో ఉంచనుంది. ఇదే స్టోర్ ద్వారా దేశంలో తొలిసారిగా కస్టమర్లకు తన ప్రత్యక్ష సేవలను అందించనుంది. ఇక ఫిజికల్ స్టోర్‌ను వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశం ఉందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఈ ఫ్రిబవరిలో ట్విట్టర్ వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే. యాపిల్ ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తులను థర్డ్ పార్టీ విక్రేతలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తోంది. -
పల్లె వాకిట.. ఆన్లైన్ స్టోర్..!
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్... ఒకప్పుడు మెట్రో సిటీలకే పరిమితమైంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఆన్లైన్లో సరుకులు బుక్ చేస్తే వ్యాపారులు వాటిని ఇంటికే పంపిస్తారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్‌బాస్కెట్ లాంటి బడా సంస్థలు ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నప్పటికీ...మెజారిటీ పల్లెలకు ఈ సంస్థలు ఇంకా వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ–కామర్స్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ పల్లెల్లో యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ శాఖకు అనుబంధంగా కొనసాగుతున్న సీఎస్సీ (కామన్ సర్వీస్ సెంటర్స్) ద్వారా ఈ–కామర్స్ వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. దీనికి ప్రత్యేకంగా సీఎస్సీ గ్రామీణ్ ఈ–స్టోర్ యాప్‌ను రూపొందించింది. దీనిద్వారా క్షేత్రస్థాయిలో ఈ–కామర్స్‌ను పరిచయం చేసిన సీఎస్సీ... తాజాగా ఔత్సాహిక వ్యాపారులను ప్రోత్సహిస్తోంది. సరుకులు అనేకం... ప్లాట్‌ఫామ్ ఒకటే... ఆన్లైన్ వ్యాపారంలో వేగాన్ని పెంచేందుకు సీఎస్సీ ప్రత్యేకంగా సీఎస్సీ గ్రామీణ్ ఈ స్టోర్ యాప్‌ను రూపొందించింది. దీనికి అనుబంధంగా సరుకుల మేనేజ్మెంట్, ఆర్డర్లు తీసుకోడానికి మరో రెండు సపోర్టింగ్ యాప్లుంటాయి. సీఎస్సీలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వీఎల్ఈ(విలేజ్ లెవెల్ ఎంటర్ప్రెన్యూర్)కు ప్రత్యేకంగా ఈ యాప్‌ను పరిచయం చేస్తోంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకుని వివరాలను నమోదు చేసుకున్న వీఎల్ఈకి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను జారీ చేస్తుంది. దీని ద్వారా సరుకుల లభ్యత, ధరల నిర్ధారణ తదితరాలను సపోర్టింగ్ యాప్ ‘మై గ్రోసరీస్’లో చేయాలి. కస్టమర్ నుంచి వచ్చిన ఆర్డర్‌ను గుర్తించి సరుకులు డెలివరీ చేసేందుకు ఆర్డర్ సిస్టంలో చూడాలి. ఈ యాప్ ద్వారా కేవలం నిత్యావసర సరుకులే కాకుండా జనరల్ స్టోర్, స్టేషనరీతో పాటు అందుబాటులో ఉన్న రకాలను ఇందులో నమోదు చేసి మేనేజ్ చేయవచ్చు. ఈ వ్యాపారాన్ని నిర్వహించేందుకు మూడు రకాల యాప్‌లను వీఎల్ఈ మేనేజ్ చేసినప్పటికీ కస్టమర్ మాత్రం గ్రామీణ్ ఈస్టోర్ యాప్‌ను వినియోగిస్తే సరిపోతుంది. ప్రమోట్ చేస్తే సరి... క్షేత్రస్థాయిలో గ్రామీణ్ ఈ స్టోర్ యాప్‌ను వీఎల్ఈ ప్రచారం చేసుకోవాలి. యాప్‌పై వినియోగదారునికి అవగాహన కల్పించి తన దుకాణాన్ని యాప్‌లో సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక బుక్ చేసే ఆర్డర్లన్నీ ఎంపిక చేసిన వీఎల్ఈకి చేరతాయి. ఆ మేరకు సరుకులను సరఫరా చేస్తారు. సీఎస్సీ రూపొందించిన గ్రామీణ్ ఈస్టోర్ యాప్‌లో సరుకుల లభ్యతను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తే వినియోగదారుడికి కూడా స్పష్టత ఉంటుంది. అదేవిధంగా ధరలను కూడా వీఎల్ఈ నిర్ధారించిన ప్రకారం ప్రత్యక్షమవుతాయి. తక్కువ లాభాలను ఆశించి సరసమైన ధరలతో ప్రారంభిస్తే ఎక్కువ కస్టమర్లను ఆకట్టుకోవచ్చని అధికారులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం యాప్‌పై సీఎస్సీ గ్రామాల్లో అవగాహన కల్పిస్తోంది. అవగాహనతోనే వ్యాపార వృద్ధి... గ్రామాల్లో వీఎల్ఈ ప్రారంభించే ఈ–కామర్స్ వ్యాపారానికి.. గ్రామం లేదా సమీపంలోని టౌన్లో ఉన్న హోల్‌సేల్ కిరాణా స్టోర్‌తో సరుకుల సరఫరాకు అవగాహన చేసుకోవాలి. యాప్ ద్వారా వచ్చిన ఆర్డర్ల మేరకు సరుకులను ప్యాక్ చేసి కస్టమర్‌కు బట్వాడా చేస్తే లక్ష్యం పూర్తయినట్లే. కిరాణా దుకాణం తోనే కాకుండా జనరల్ స్టోర్, స్టేషనరీ, ఇతర హోల్‌సేల్ దుకాణాలతో ఒప్పందం చేసుకుని వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని సీఎస్సీ సూచిస్తోంది. -
గెలాక్సీ ఎస్9, ఎస్ 9ప్లస్‌లపై గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ ప్లాగ్‌షిప్ స్మార్ట్ఫోన్లు ఎస్9, ఎస్9+ పై కంపెనీ ఒక శుభవార్త అందించింది. టెలికం సర్వీసు ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్ ఆన్లైన్స్టోర్లలో కూడా ఈ రెండు ఫోన్లు లభ్యం కానున్నాయి. అంతేకాదు కంఫర్టబుల్ డౌన్‌పేమెంట్, ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తోంది. ఇందులో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు అనుకూలమైన డౌన్ పేమెంట్‌ను ఎంపి కచేసుకోవచ్చు. దీంతోపాటుగా ఎయిర్టెల్ ఒక ఆసక్తికర ఆఫర్ కూడా ఉంది. తమ ఆన్లైన్ స్టోర్‌లో తాజా శాంసంగ్ స్మార్ట్ఫోన్లను అందించడం ఆనందంగా ఉందని అధికారి భారతి ఎయిర్టెల్ ప్రధాన మార్కెటింగ్ ముఖ్యఅధికారి వాణి వెంకటేష్ శుక్రవారం ప్రకటించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ ప్రీమియం మొబైల్‌ను తక్షణ ఫైనాన్సింగ్ ద్వారా అందించనున్నామన్నారు. గెలాక్సీఎస్ 9.. 64జీబీ వేరియంట్ రూ.9,900 డౌన్ పేమెంట్ ఆప్షన్, తర్వాత 24నెలవారీ వాయిదాలలో రూ.2,499 చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది. గెలాక్సీ ఎస్9 + 64జీబీ వేరియంట్‌ను కేవలం రూ .9,900 డౌన్‌పేమెంట్ చేసి సొంతం చేసుకోవచ్చు. తదుపరి 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,799. చెల్లించే అవకాశం. అంతేకాదు ఈ రెండు స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై 8జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఒక సంవత్సరం అమెజాన్ ప్రధాన సభ్యత్వం, ఎయిర్టెల్ సెక్యూర్, ఎయిర్టెల్ టీవీ, విన్క్ మ్యూజిక్ వంటి ఉత్తేజకరమైన కంటెంట్‌ను అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఉచితం. ఈ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన గెలాక్సీ ఎస్ 9 ధర రూ. 57,900. ఎస్ 9 +కు రూ. 64,900 ప్రారంభ ధరగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఐ ఫోన్ ఎక్స్:ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఆపిల్10వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్లోకి వచ్చిన ఆపిల్ అత్యంత ఖరీదైన ఫోన్ ఐఫోన్ ఎక్స్‌పై ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నవంబర్ 3నుంచి భారత్‌లో విక్రయానికి రానున్నఆపిల్ ఐఫోన్ ఎక్స్ పై ఎయిర్ టెల్ ఆన్లైన్ స్టోర్ ద్వారా రూ. 10వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ప్రత్యేకంగా ఈ ఆఫర్ లభించనుంది. శుక్రవారం సాయంత్రం ఆరుగంటలనుంచి శనివారంఉదయం 7. గంటల వరకు ఎయిర్ టెల్ పోస్ట్ పెయిడ్వినియోగదారులకు ఈ ఆఫర్అందుబాటులోఉంటుందని భారతి ఎయిర్టెల్ సీఎంఓ రాజ్ పూడిపెద్ది ప్రకటించారు. నవంబర్ 3 సాయంత్రం 6గంటలనుంచి కొత్తగా ప్రారంభించిన ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో ఐఫోన్ ఎక్స్ ఫోన్లను ఎయిర్టెల్ విక్రయించనుంది. ముఖ్యంగా సిటీ బ్యాంక్ క్రెడిట్‌కార్డు ద్వారా కొనుగోలుచేసే ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ.10వేల క్యాష బ్యాక్ పొందొచ్చునని ఎయిర్టెల్ ప్రకటించింది. నవంబరు 3వ తేదీ సా. 6గంటలనుంచి మరునాడు ఉదయం 7గంటలవరకు మాత్రమే ఈ సౌలభ్యమని తెలిపింది. పూర్తిగా నగదు చెల్లించిన(నో ఈఎంఐ ఆప్షన్ ) పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల్లో ఫస్ట్ కం ఫస్ట్ సెర్వ్ కింద ఈ ఆఫర్ అందుబాటులోఉంటుందని పేర్కొంది. అయితే ప్రీ ఆర్డర్ కోసం ప్రముఖ ఈ కామర్స్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోఉన్నప్పటికీ.. ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్‌లో ఐఫోన్ఎక్స్ ఇంకా లిస్ట్ అయినట్టు చూపించడం లేదు. కాగాఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ సేవలు ప్రస్తుతం భారతదేశంలోని 21 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆపిల్ ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ నవంబరు 3నుంచి గ్లోబల్ మార్కెట్లలోకి విక్రయానికి రానున్న సంగతి తెలిసిందే. -
రూ.7777 చెల్లిస్తే..ఐ ఫోన్ 7 మీ సొంతం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులను ఆకర్షించటానికి దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ ఐ ఫోన్ 7 పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్‌లో భాగంగా లాంచ్ చేసిన ఆన్లైన్ స్టోర్ ద్వారా ఐ ఫోన్‌పై ఆకర్షణీయ మైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 7 ను ఆకర్షణీయమైన డౌన్ చెల్లింపుల్లో అందిస్తోంది. ఇతర ప్రీమియం స్మార్ట్ఫోన్లను త్వరలోనే జోడించాలని సంస్థ యోచిస్తోంది. జియోనుంచి గట్టిపోటీని ఎదుర్కొంటూ, దూకుడు ధరలను ఆఫర్ చేస్తున్న సంస్థ ఆన్లైన్ స్టోర్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై సరసమైన డౌన్ పేమెంట్స్, తక్షణ క్రెడిట్ వెరిఫికేషన్, ఫైనాన్సింగ్, నెలసరి ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో సోమవారం ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఆపిల్ ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లను జోడించింది. కేవలం రూ. 7,777 ల డౌన్ పేమెంట్‌తో 32 జీబీ ఐఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. మిగిలిన సొమ్మును 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,499 ( పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో కలిపి) చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తోంది. అంతేకాదు దీంతోపాటు, నెలవారీ వాయిదాలలో 30 జీబి డేటా, అపరిమిత కాలింగ్ (స్థానిక, ఎస్టీడీ, జాతీయ రోమింగ్) తోపాటు సైబర్ ప్రొటెక్షనతో పాటు ఫోన్ డ్యామేజ్ కవర్ చేసే ఎయిర్టెల్ సెక్యూర్ ప్యాకేజీ అందించే ప్రత్యేకమైన పోస్ట్ పెయిడ్ పధకాన్ని కూడా అందిస్తోంది. ఐఫోన్7 128 జీబీ వేరియెంట్‌కు రూ.16,300 డౌన్‌పేమెంట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ వేరియంట్‌కు రూ.17,300, 128 జీబీ వేరియంట్‌కు రూ.26వేల డౌన్‌పేమెంట్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం www.airtel.in/onlinestore కు లాగిన్ అయ్యి మొబైల్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం మన ఎలిజిబిలిటీ, రుణ సదుపాయం తదితర అంశాలను పరిశీలించుకోవాలి. చివరగా మనం ఎంపిక చేసుకున్న మొబైల్‌కు సంబంధించిన డౌన్ పేమెంట్ చెల్లించాలి. లావాదేవీ సక్రమంగా పూర్తయితే సంబంధిత చిరునామాకు మొబైల్ చేరుతుంది. లక్షలాది మంది వినియోగదారులని ఆహ్లాదపరిచేందుకు ఎయిర్టెల్ మరో ఉత్తేజకరమైన డిజిటల్ ఆవిష్కరణను తీసుకొచ్చినట్టు హర్మీన్ మెహతా భారతి ఎయిర్టెల్ గ్లోబల్ డైరెక్టర్ తెలిపారు. కస్టమర్లు ఎల్లప్పుడూ కోరుకునే పరికరాలకు అప్‌గ్రేడ్ చేయడమే కాదు, డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధునాతనమైన, సరళమైన ప్రక్రియతో వారి కలను సాకారం చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తమ భాగస్వాములకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ సేవలు భారతదేశంలోని 21 నగరాల్లో ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఇంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, క్లిక్స్ కాపిటల్, సెయిన్స్ టెక్నాలజీస్, బ్రైట్ స్టార్ టెలికమ్యూనికేషన్స్ , వుల్కాన్ ఎక్స్‌ప్రెస్ సంస్థలతో భాగస్వామ్యంను కలిగి ఉంది. -
ఫ్యాషన్ సూత్ర..
అడుగుల్లో తడబాటు... మాటల్లో తత్తరపాటు... చూపుల్లో నునుసిగ్గులు... చెంపల్లో కెంపులు... ఇవన్నీ కలగలిసి కదలివచ్చే నవవధువు సొగసు చూడతరమా... సంప్రదాయం ఏదైతేనేం... అందం, అలంకారం ఆమెదే. పెళ్లి వేడుకలో అప్పటిదాకా ముచ్చట్లలో మునిగిపోయి ఉన్న అతిథులంతా అటెన్షన్లోకి వచ్చారంటే దాని అర్థం పెళ్లికూతురి ఆగమనమే. అందుకే అన్ని రకాల సంప్రదాయాల్లోనూ నవవధువు అలంకారానికి అంత ప్రాధాన్యత. ముఖ్యంగా క్రైస్తవుల వివాహ వేడుకల్లో అయితే టాక్ ఆఫ్ ది ఈవెంట్ వధువు ధరించే వెడ్డింగ్ గౌన్. పెళ్లి వేడుకల్లో ఒక్కో సంప్రదాయూనిది ఒక్కో విలక్షణత. ఏ సంప్రదాయుంలోనైనా పెళ్లిళ్లలో వధువు అలంకరణే కీలకం. నిజానికి నిశ్చితార్థం నాటి నుంచే పెళ్లి ఏర్పాట్లు మొదలవుతారుు. ఎప్పటికీ నిలిచిపోయే తీపి జ్ఞాపకంగా పెళ్లి వేడుకను వులచుకునేందుకు అందరూ తవు తవు సృజనాత్మకత మేరకు, వనరుల మేరకు తాపత్రయుపడతారు. అదే విధంగా క్రైస్తవుల పెళ్లిళ్లలో వధువు అలంకరణను అత్యంత కీలకంగా భావిస్తారు. క్రైస్తవుల పెళ్లి ఏర్పాట్లు సాధారణంగా పెళ్లి తేదీకి దాదాపు వుూడు నెలల వుుందుగానే మొదలవుతారుు. పెళ్లి, రిసెప్షన్లకు వేదికల ఎంపిక, ఆహ్వాన పత్రికల ఎంపిక, వుుద్రణ, తోటి పెళ్లికూతురి ఎంపిక, ఆభరణాలు, అలంకరణ సావుగ్రి, ఇతర యూక్సెసరీస్ కొనుగోలు వంటివన్నీ ఒక పద్ధతి ప్రకారం చకచకా సాగిపోతారుు. వీటన్నింటి హడావుడి ఒకెత్తయితే... వధువు ధరించే ఆభరణాలతో పాటు పెళ్లి రోజున వధువు ధరించే వెడ్డింగ్ గౌన్ ఒక్కటీ ఒకెత్తు. అందుకే దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి అందించేందుకు సిటీలో పలు బొటిక్‌లు సిద్ధంగా ఉన్నాయి. వెడ్డింగ్ వస్త్ర... క్రైస్తవుల పెళ్లిళ్లలో వధువులు సాధారణంగా స్వచ్ఛతకు సంకేతంగా తెలుపు రంగు గౌన్ ధరిస్తారు. నగరంలో ఈ వైట్ గౌన్స్‌ని రెడీమేడ్‌గా విక్రరుుంచే దుకాణాలు ఉన్నారుు. ఆన్లైన్ స్టోర్స్‌లోనూ లెక్కలేనన్ని డిజైన్లలో వెడ్డింగ్ గౌన్లు దొరుకుతున్నారుు. గౌన్ల ధరలు చాలా వరకూ విభిన్న వర్గాలకు అందుబాటులోనే ఉంటున్నాయి. అయినా అదీ భరించలేని వారికి వెడ్డింగ్ డ్రెస్‌ను అద్దెకు ఇచ్చే షాపులూ ఉన్నారుు. అవేవీ నప్పవనుకుంటే, వుుందుగానే నిపుణులైన టైలర్ల వద్ద ప్రత్యేకంగా కుట్టించుకోవచ్చు. పెళ్లిలో తనకు తోడుగా ఉన్న తోటి పెళ్లికూతుళ్లకు కూడా వస్త్రాభరణాలను పెళ్లికూతురు కానుకగా ఇవ్వడం ఆనవారుుతీ. ఇందుకోసం కూడా వుుందుగానే వస్త్రాలను, ఆభరణాలను, ఇతర అలంకరణ సావుగ్రిని కొనుగోలు చేస్తారు. వెడ్డింగ్ గౌన్, చేతులకు గ్లౌస్, బొకే, ఇతర ఆభరణాలకు తోడుగా పెళ్లి రోజున వధువు వుుఖాన్ని పలచగా కప్పి ఉంచే మేలివుుసుగును ధరిస్తుంది. దీంతో పెళ్లి అలంకరణ పూర్తరుునట్లే. ఫ్యాషన్ సూత్ర.. పెళ్లికి ఎలాంటి గౌన్ ధరించాలనేది వుుందుగానే నిర్ణరుుంచుకోవాలి. బాల్ గౌన్, స్లింకీ నంబర్, ఏ-లైన్, ఫిష్ టెరుుల్ వంటి వెరైటీలు అందుబాటులో ఉన్నారుు. వీటన్నింటినీ ఓసారి ట్రై చేసి, తవు శరీరాకృతికి బాగా నప్పేది ఖరారు చేసుకోవాలి. భారత్‌లో ఎక్కువ వుందిది కాస్త డార్క్ కాంప్లెక్షన్. మేనివన్నెకు తగిన రంగులో వెడ్డింగ్ గౌన్ ఎంపిక చేసుకుంటే గ్రాండ్‌గా కనిపిస్తారు. తెలుపులోనే చిన్నచిన్న తేడాలతో ఐవరీ, క్రీమ్‌కలర్, స్నోవైట్ వంటి రంగుల్లో వెడ్డింగ్ గౌన్లు దొరుకుతున్నారుు. గోల్డ్, సిల్వర్ యూక్ససరీస్ వీటికి బాగా సూటవుతారుు. వీటికి అనుగుణంగానే అంబర్, పీచ్, రస్ట్, బ్రిక్ రెడ్, వార్మ్గ్రీన్, కేమెల్ వంటి రంగుల్లో కలర్థీమ్స్ ఎంచుకోవచ్చు. పెళ్లి సవుయుంలో వధువు చేత ధరించే బొకేలో సాధారణంగా తెలుపురంగు గులాబీలు లేదా ఆర్కిడ్స్ వాడతారు. గౌనుకు నప్పే బొకే ఎంపిక చేసుకుంటే, పెళ్లి వుండపంలో నవవధువు దేవకన్యలా మెరిసిపోతుంది. - నీతా సంజయ్‘జాస్పర్ బ్రైడల్ కలెక్షన్’ స్టోర్