సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు ఎస్9, ఎస్9+ పై కంపెనీ ఒక శుభవార్త అందించింది. టెలికం సర్వీసు ప్రొవైడర్ భారతి ఎయిర్‌టెల్ ఆన్‌లైన్‌స్టోర్లలో కూడా ఈ రెండు ఫోన్లు లభ్యం కానున్నాయి. అంతేకాదు కంఫర్టబుల్ డౌన్‌పేమెంట్, ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తోంది. ఇందులో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు అనుకూలమైన డౌన్ పేమెంట్‌ను ఎంపి కచేసుకోవచ్చు. దీంతోపాటుగా ఎయిర్‌టెల్ ఒక ఆసక్తికర ఆఫర్ కూడా ఉంది.
తమ ఆన్‌లైన్ స్టోర్లో తాజా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లను అందించడం ఆనందంగా ఉందని అధికారి భారతి ఎయిర్‌టెల్ ప్రధాన మార్కెటింగ్ ముఖ్యఅధికారి వాణి వెంకటేష్ శుక్రవారం ప్రకటించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ ప్రీమియం మొబైల్‌ను తక్షణ ఫైనాన్సింగ్ ద్వారా అందించనున్నామన్నారు. గెలాక్సీఎస్ 9.. 64జీబీ వేరియంట్ రూ.9,900 డౌన్ పేమెంట్ ఆప్షన్, తర్వాత 24నెలవారీ వాయిదాలలో రూ.2,499 చెల్లించే సదుపాయాన్ని కల్పిస్తోంది.
గెలాక్సీ ఎస్9 + 64జీబీ వేరియంట్‌ను కేవలం రూ .9,900 డౌన్‌పేమెంట్ చేసి సొంతం చేసుకోవచ్చు. తదుపరి 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,799. చెల్లించే అవకాశం. అంతేకాదు ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై 8జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఒక సంవత్సరం అమెజాన్ ప్రధాన సభ్యత్వం, ఎయిర్‌టెల్ సెక్యూర్, ఎయిర్‌టెల్ టీవీ, విన్క్ మ్యూజిక్ వంటి ఉత్తేజకరమైన కంటెంట్‌ను అందించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కూడా ఉచితం. ఈ నెలలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన గెలాక్సీ ఎస్ 9 ధర రూ. 57,900. ఎస్ 9 +కు రూ. 64,900 ప్రారంభ ధరగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment