శాంసంగ్‌ ఏ 20 లాంచ్‌.. డ్యుయల్‌ రియర్‌ కెమెరా | Samsung Galaxy A20 With Super AMOLED Display, Dual Rear Cameras Launched | Sakshi
Sakshi News home page

Published Tue, Mar 19 2019 11:50 AM | Last Updated on Tue, Mar 19 2019 11:56 AM

Samsung Galaxy A20 With Super AMOLED Display, Dual Rear Cameras Launched - Sakshi

సాక్షి, ముంబై : శాంసంగ్‌ గెలాక్సీ ఎ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌​ చేసింది. ఎ20 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ రియర్‌ కెమెరాను. సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఫింగర్‌ ప్రింట్‌  సెన్సర్‌ను  పొందు పర్చింది.   ఏ సిరీస్‌లో భాగంగా ఏ 50, ఏ 30, ఏ 20 లను రష్యా మార్కెట్‌లో తీసుకొచ్చింది  శాంసంగ్‌. బ్లాక్‌ , బ్లూ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభ్యం కానుంది. అయితే భారత మార్కెట్‌లో ఏ 20  ఏప్రిల్‌ రెండవవారంలో  ఆవిష్కరించనుందని అంచనా.

ధర : సుమారు రూ. 14,900

ఎ 20 ఫీచర్‌లు
6.4 హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
720x1560  పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌
32 జీబీ స్టోరేజ్‌
512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
13+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌  కెమెరా
8ఎంపీ  సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement