ఐ ఫోన్ 7లో కొత్త లీక్..!
ఆపిల్ మొబైల్ అంటేనే ఒక క్రేజ్..! మరి ఆ క్రేజీ థింగ్ లో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే.. ప్రస్తుతం వస్తున్న లీక్ లు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇచ్చిన ఇంటర్వూలో రాబోయే రోజుల్లో ఐఫోన్ 7 లేకుండా ఉండలేరు అని చెప్పకనే చెప్పారు. మరి అది నిజమయ్యేలానే ఉంది. ఈ లీకులను చూస్తోంటే..
ఆపిల్ హెడ్ ఫోన్స్ ను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కనిపించిన చిత్రాల్లో హెడ్ ఫోన్స్ పెట్టే 3.5 ఎమ్ఎమ్ జాక్ ను లేకుండా ఫోన్ కనిపించింది. దీనికి బదుల ప్రత్యేకంగా ఫోన్ కోసం తయారుచేసిన బీట్స్ బ్లూటూత్ హెడ్ సెట్ ను విక్రయించే విషయం ఆలోచిస్తోందని మరో లీక్..!
కెమెరాలో కూడా మార్పులకు సిద్ధమవుతున్నట్లు మరో లీక్ లో వెల్లడైంది. రెండు ఐసైట్ కెమెరాలను ఫోన్ లో వాడనున్నట్లు తెలిసింది. ఏదేమైనా కొత్త డిజైనింగ్ తో కనిపిస్తున్న ఐఫోన్ 7 వినియోగదారులకు కొత్త అనుభవాన్ని మిగులుస్తుందని ఆశిద్దాం.