Headphone
-
హెడ్ ఫోన్లు వాడుతున్నారా? బీ కేర్‌ఫుల్
మనలో చాలామంది గంటల కొద్దీ హెడ్ఫోన్లను ఉపయోగిస్తుంటారు. అసలు అవి శుభ్రంగానే ఉన్నాయా లేదా అనేది చూసుకోకుండా పాటలు వింటూనో, సినిమాలు చూస్తూనో గంటలకొద్దీ చెవుల్లో మోత మోగాల్సిందే. అయితే ఈ వీడియా చూశాక మాత్రం హెడ్ ఫోన్లను ఉపయోగించే ముందు కాస్త జాగ్రత్తగా ఉంటారేమో. ఆస్ర్టేలియాలోని పెర్త్ ప్రాంతానికి చెందిన ఓలీ అనే వ్యక్తి ఎప్పటిలానే హెడ్సెట్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుండగా, చెవులో ఏదో గిలిగింతగా అనిపించింది. దీంతో ఏంటా అని చూస్తే స్పైడర్ (సాలెపురుగు) దర్శనమిచ్చింది. అంతే ఇక దాన్ని బయటకు తీయడానికి చాలా సమయమే పట్టింది. అటు తిప్పి, ఇటు తిప్ప మొత్తానికి స్పైడర్‌ను బయటకు తీశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే అది కాస్తా వైరల్ అయ్యింది. (ఇదేమి స్పైడర్ రా నాయనా..) ఇక మీరు ఆ పాత హెడ్సెట్ వాడే బదులు కొత్తది కొంటారేమో అని ఒకరు సరదాగా కామెంట్ చేస్తే..చూడ్డానికి చాలా భయానకంగా ఉంది ఇంతకీ మీరు ఆ హెడ్‌సెట్‌ను కాల్చేశారా లేదా అని మరొక యూజర్ ప్రశ్నించారు. అయితే సాలెపురుగు అంత ప్రమాదకరం కాదని మరికొందరి వాదన. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మ్యూజియం నిర్వాహకులు సైతం ఇదే విషయాన్ని తెలియజేశారు. శరీరంపై పెద్ద వెంట్రుకలు ఉన్న సాలె పురుగులు ఎటువంటి హానీ కలిగించవని, అయితే కొన్ని మాత్రం విషపూరిత స్వభావాన్ని కలిగి ఉంటాయని వెల్లడించారు. అవి కాటు వేసినా కొన్ని సైడ్ ఎఫెక్స్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మొత్తానికి ప్రమాదం జరిగేకంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. (ఈత కొట్టి సేద తీరాడు.. ఇంతలోనే) -
బ్లాడర్‌లో కేబుల్ : నిజం తెలిస్తే షాక్!
మనషుల మానసిక రుగ్మతకు, వింత ప్రవర్తనకు నిదర్శనమైన ఉదంతం ఒకటి అసోంలో వెలుగు చూసింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తికి ఆపరేషన్ చేసిన వైద్యులు అతని మూత్రాశయంలో మొబైల్ హెడ్ ఫోన్ వైర్ ను చూసి విస్తుపోయారు. చివరికి ఆ కేబుల్ ను తొలగించి రోగి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. ఈ ఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే అసోంకు చెందిన రోగి (30) తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. పొరపాటున హెడ్‌ఫోన్ కేబుల్‌ను మింగేశానని చెప్పాడు. దీంతో మల పరీక్ష, ఎండోస్కోపీ పరీక్షలు చేసిన వైద్యులు, ఫలితం లేకపోవడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అయినా జీర్ణాశయంలో కేబుల్ జాడ దొరకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు ఆపరేషన్ బెడ్ మీదే ఎక్స్ రే పరీక్ష నిర్వహించారు. ఇక్కడే డాక్టర్లకు దిమ్మదిరిగే విషయం తెలిసింది. రోగి మూత్రాశయం లోపల దాదాపు రెండు అడుగుల పొడవైన కేబుల్‌ను గుర్తించారు. అతడు వైద్యులకు అబద్దం చెప్పాడనీ నోటి ద్వారా కాకుండా పురుషాంగం ద్వారా కేబుల్ చొప్పించబడిందని తేలిందని సర్జన్ డాక్టర్ వాలియుల్ ఇస్లాం వెల్లడించారు. “యురేత్రల్ సౌండింగ్'' అని పిలిచే ఒక రకమైన హస్త ప్రయోగమని, ఇది చాలా అరుదైన విషయమని పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత నొప్పితో తమ దగ్గరకు వచ్చిన వ్యక్తి ఇలా అబద్ధం చెబుతాడని అస్సలు ఊహించలేదన్నారు. తన పాతికేళ్ల చరిత్రలో ఆపరేషన్ టేబుల్ మీద ఇలా జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ సంగతి ముందే చెప్పి ఉంటే.. ఆపరేషన్ లేకుండానే కేబుల్‌ను తొలగించేవారిమని చెప్పారు. -
ఆలోచనలే ఆదేశాలైపోతాయి...
ఫొటోను కాస్త జాగ్రత్తగా చూడండి.. ఆ వ్యక్తి చెవి దగ్గర మొదలై మెడ, నోటివరకూ విస్తరించిన గాడ్జెట్‌ను ఇంకొన్నేళ్లలో మీరూ తగిలించుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకలా? ఏమిటి దాని స్పెషాలిటీ అంటారా? సింపుల్. మీరు మనసులో అనుకునే మాటలనే ఆదేశాలుగా మార్చి సమాచారం అందిస్తుంది ఇది. అర్థం కాలేదు కదూ.. ఉదాహరణతో చూద్దాం. రోడ్డుపై వెళుతున్నారు... షాపు గాజు కిటికీలోంచి ఓ మంచి షర్ట్ కనిపించింది. భలే ఉందే షర్టు అనుకుంటే చాలు.. ఈ గాడ్జెట్ ఆ షర్ట్‌పై ఉండే బార్కోడ్నో లేదా షాపు వెబ్సైట్లోకి వెళ్లి ఆ డిజైన్ షర్ట్‌ను గుర్తించో.. లేకపోతే ఇంకో మార్గం ద్వారానో దాని రేటు కనుక్కుని తెలియజేస్తుంది. మామూలుగానైతే.. ఈ పనులన్నీ మనం కీబోర్డు సాయంతో చేయాల్సినవి. అవేవీ లేకుండానే మన ఆలోచనలతోనే చేసేస్తుందన్నమాట. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తయారుచేసిన ఈ నమూనా యంత్రం పేరు ‘ఆల్టర్ ఈగో’. మనుషులు, కంప్యూటర్ల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం సులువుగా జరిగిపోయేందుకు ఇది ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న భారతీయ సంతతి శాస్త్రవేత్త అర్ణవ్ కపూర్ అంటున్నారు. గాడ్జెట్‌లోని ఎలక్ట్రోడ్లు, మెషీన్ లెర్నింగ్ వ్యవస్థ, బోన్ కండక్షన్ హెడ్ఫోన్ల వంటివన్నీ కలిసి ఈ పనులు చేస్తాయన్నమాట. ఆల్టర్ ఈగో పనితీరును వివరిస్తూ ఎంఐటీ ఒక వీడియోను సిద్ధం చేసింది. ఇందులో అర్ణవ్ కపూర్ ఓ సూపర్ మార్కెట్లో తిరుగుతూ నచ్చిన ఉత్పత్తివైపు చూస్తే చాలు.. దాని ధర, వివరాలు వినిపిస్తూంటాయి. బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చే సమయానికి మీరు తీసుకున్న వస్తువుల తాలూకూ మొత్తం బిల్లు రెడీగా ఉంటుంది. -
ఐ ఫోన్ 7లో కొత్త లీక్..!
ఆపిల్ మొబైల్ అంటేనే ఒక క్రేజ్..! మరి ఆ క్రేజీ థింగ్ లో కొత్త కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయా? అంటే.. ప్రస్తుతం వస్తున్న లీక్ లు అవుననే చెప్తున్నాయి. ఇప్పటికే కంపెనీ సీఈవో టిమ్ కుక్ ఇచ్చిన ఇంటర్వూలో రాబోయే రోజుల్లో ఐఫోన్ 7 లేకుండా ఉండలేరు అని చెప్పకనే చెప్పారు. మరి అది నిజమయ్యేలానే ఉంది. ఈ లీకులను చూస్తోంటే.. ఆపిల్ హెడ్ ఫోన్స్ ను మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కనిపించిన చిత్రాల్లో హెడ్ ఫోన్స్ పెట్టే 3.5 ఎమ్ఎమ్ జాక్ ను లేకుండా ఫోన్ కనిపించింది. దీనికి బదుల ప్రత్యేకంగా ఫోన్ కోసం తయారుచేసిన బీట్స్ బ్లూటూత్ హెడ్ సెట్ ను విక్రయించే విషయం ఆలోచిస్తోందని మరో లీక్..! కెమెరాలో కూడా మార్పులకు సిద్ధమవుతున్నట్లు మరో లీక్ లో వెల్లడైంది. రెండు ఐసైట్ కెమెరాలను ఫోన్ లో వాడనున్నట్లు తెలిసింది. ఏదేమైనా కొత్త డిజైనింగ్ తో కనిపిస్తున్న ఐఫోన్ 7 వినియోగదారులకు కొత్త అనుభవాన్ని మిగులుస్తుందని ఆశిద్దాం.