మనలో చాలామంది గంటల కొద్దీ హెడ్‌ఫోన్‌లను ఉపయోగిస్తుంటారు. అసలు అవి శుభ్రంగానే ఉన్నాయా లేదా అనేది చూసుకోకుండా పాటలు వింటూనో, సినిమాలు చూస్తూనో గంటలకొద్దీ చెవుల్లో మోత మోగాల్సిందే. అయితే ఈ వీడియా చూశాక మాత్రం హెడ్ ఫోన్లను ఉపయోగించే ముందు కాస్త జాగ్రత్తగా ఉంటారేమో. ఆస్ర్టేలియాలోని పెర్త్ ప్రాంతానికి చెందిన ఓలీ అనే వ్యక్తి ఎప్పటిలానే హెడ్‌సెట్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుండగా, చెవులో ఏదో గిలిగింతగా అనిపించింది. దీంతో ఏంటా అని చూస్తే స్పైడర్ (సాలెపురుగు) దర్శనమిచ్చింది. అంతే ఇక దాన్ని బయటకు తీయడానికి చాలా సమయమే పట్టింది. అటు తిప్పి, ఇటు తిప్ప మొత్తానికి స్పైడర్‌ను బయటకు తీశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టగానే అది కాస్తా వైరల్ అయ్యింది. (ఇదేమి స్పైడర్ రా నాయనా..)
ఇక మీరు ఆ పాత హెడ్‌సెట్ వాడే బదులు కొత్తది కొంటారేమో అని ఒకరు సరదాగా కామెంట్ చేస్తే..చూడ్డానికి చాలా భయానకంగా ఉంది ఇంతకీ మీరు ఆ హెడ్‌సెట్‌ను కాల్చేశారా లేదా అని మరొక యూజర్ ప్రశ్నించారు. అయితే సాలెపురుగు అంత ప్రమాదకరం కాదని మరికొందరి వాదన. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మ్యూజియం నిర్వాహకులు సైతం ఇదే విషయాన్ని తెలియజేశారు. శరీరంపై పెద్ద వెంట్రుకలు ఉన్న సాలె పురుగులు ఎటువంటి హానీ కలిగించవని, అయితే కొన్ని మాత్రం విషపూరిత స్వభావాన్ని కలిగి ఉంటాయని వెల్లడించారు. అవి కాటు వేసినా కొన్ని సైడ్ ఎఫెక్స్ట్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మొత్తానికి ప్రమాదం జరిగేకంటే ముందే జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. (ఈత కొట్టి సేద తీరాడు.. ఇంతలోనే)
Comments
Please login to add a commentAdd a comment