Viral Video: Man Close Encounter Sea Snake Swimming Up To Him - Sakshi
Sakshi News home page

యూట్యూబర్‌ వెంటపడ్డ పాము.. కారణం అదేనంటూ వైరల్‌

Published Thu, Sep 2 2021 5:14 PM | Last Updated on Thu, Sep 2 2021 7:21 PM

Viral Video: Man Close Encounter Sea Snake Swimming Up To Him - Sakshi

ఆస్ట్రేలియన్‌: సముద్రపు పాములు.. అత్యంత విషపూరితమైన జాతుల్లో ఉన్నాయి.  ఇవి మనుషుల కంటపడకుండా తిరుగుతుంటాయి. వాటిని కదిలించాలని ప్రయత్నిస్తే మాత్రం.. కాటేస్తాయి. అందుకే వాటిని ‘షై స్నేక్స్‌’ అని కూడా అంటారు. కానీ ఈ వీడియోలో చూడబోయే పాము.. తన సహజ స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించింది. అందుకే ఈ వీడియో వైరల్‌ అయ్యింది. 

చదవండి: అదే జరిగితే ఇంటర్నెట్‌ బంద్‌

ఆస్ట్రేలియన్‌ యూట్యూబర్‌ బ్రాడీ మోస్‌.. ‘ప్యాడెల్‌ బోర్డింగ్‌’కు వెళ్లాడు. ఆ టైంలో ఓ సముద్రపు పాము నీళ్లలో ఈదుకుంటూ అతన్ని వెంబడించింది. అంతేకాదు అతిదగ్గరగా వచ్చి.. ఆ ప్యాడెల్‌బోట్‌ మీద కొంత సమయం తలను ఉంచింది. మోస్‌ మాటలకు జడుసుకుందో ఏమో.. తిరిగి మళ్లీ ఈదుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియోను అతను రెండు రోజుల క్రితం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ పై టిక్‌టాక్‌ ద్వారాను మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు. సిగ్గు పాములుగా పేరున్న సముద్ర సర్పం.. ఇలా స్వభావానికి విరుద్ధంగా ఎందుక ప్రవర్తించిందనే దానిపై చర్చ మొదలైంది. 

చదవండి: Google: ఓల్డ్‌తో పాటు బ్లర్‌ ఫొటోల్ని హైరెజల్యూషన్‌కు మార్చే టెక్నాలజీ వచ్చేసింది

మామూలు టైంలో సముద్రపు పాముల కదలిక చాలా రహస్యంగా ఉంటుంది. అయితే లైంగిక కోరికలు రేకెత్తినప్పుడు మాత్రం.. జంట కోసం వెతుకుంటూ బయటకు వస్తాయి. ఆ టైంలో అవి చురుకుగా ఉంటాయని, బహుశా అందుకే ఆ పాము అలా ప్రవర్తించి ఉంటుందని హెర్పెటాలజిస్టులు చెప్తున్నారు. సముద్రపు పాములను కోరల్‌ రీఫ్‌స్నేక్స్‌ అని కూడా అంటారు. ఇవి అన్ని కాలాల్లో నీళ్లలో నివసించగలవు. చాలావరకు సముద్రపు పాములన్నీ అత్యంత విషపూరితమైనవే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

చదవండి: Rare Incident: అరుదైన సంఘటన.. ఏనుగుకు కవల పిల్లలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement