Watch: Cobra Snake Found Inside Shirt Of Man Sleeping In Field, Video Viral - Sakshi
Sakshi News home page

Snake Found In Man Shirt: షర్ట్‌లో దూరి బటన్స్‌ మధ్యలో నుంచి తొంగిచూస్తూ.. చుక్కలు చూపించిన నాగుపాము

Published Thu, Jul 27 2023 11:26 AM | Last Updated on Thu, Jul 27 2023 11:51 AM

Cobra Snake Found Inside Man Shirt Video Viral - Sakshi

Social Media Viral Video.. దేశవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఇక, వర్షాకాలంలో పాములు, విష కీటకాల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిందే. వర్షాల కురుస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు భూమి లోపల ఉన్న బొరియల్లో నీరు నిండడం వల్ల పాములు పొదల్లో, గడ్డిలో దాక్కుంటాయి. అయితే, తాజాగా ఓ మనిషి షర్ట్‌లోకి పాము దూరిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, పాము అతడి చొక్కాలో ఉ‍న్నంతసేపు బాధితుడి అలాగే కూర్చుండిపోయాడు. 

వివరాల ప్రకారం.. పార్క్‌ వంటి ప్రదేశంలో ఓ వ్యక్తి చెట్టు కింద పడుకున్నాడు. ఈ క్రమంలో కింగ్ కోబ్రా అతని షర్ట్‌ లోపలికి ప్రవేశించింది. దీంతో, సదరు వ్యక్తి భయంతో వణికిపోయాడు. ఇక, అతని చొక్కా రెండు బటన్‌లు తెరిచి ఉండటంతో కింగ్ కోబ్రా తన తలను బయటకు పెట్టి చూస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు అతడిని పాము నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్బంగా బాధితుడి షర్ట్‌ బటన్స్‌ ఓపెన్‌ చేసిన తర్వాత పాము తోక భాగం నేలపై ఉన్న గడ్డిపైకి వస్తుంది. దీని తరువాత, ఆ వ్యక్తి నెమ్మదిగా ముందుకు సాగాడు.. అప్పుడు నడుము వైపు ప్రవేశించిన నాగుపాము తల కూడా బయటకు వచ్చింది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. అదృష్టం కొద్ది కింగ్‌ కోబ్రా కాటు నుంచి సదరు వ్యక్తి బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: షాకింగ్ వీడియో.. గ్రేటర్‌ నోయిడాలో నీట మునిగిన 200కు పైగా కార్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement