Watch: Snake Slithering Away With Slipper Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

ఇదేం పామురా అయ్యా.. తిండి వేశారు అనుకుందో ఏమో..

Published Fri, Nov 25 2022 6:02 PM | Last Updated on Fri, Nov 25 2022 7:22 PM

Snake Slithering Away With Slipper Video Viral In Social Media - Sakshi

సాధారణంగా మన ఇంటి పక్కన ప్రదేశాల్లో పాము కనిపిస్తే ఏ​ం చేస్తారు?. కొందరు పామును చంపేస్తారు.. మరికొందరు అక్కడి నుంచి పారిపోతారు. ఈ వీడియోలో కూడా ఓ పాము తమ ఇంటి వద్ద కనిపించడంతో ఓ వ్యక్తి దానిపైకి చెప్పును విసిరాడు. దీంతో, అతను దానికి తిండి వేశాడు అనుకుందో ఏమో.. పాము తన నోటితో ఆ చెప్పును పట్టుకుని అక్కడి నుంచి పరుగు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అయితే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌) అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు. పింక్‌ కలర్‌లో ఉన్న రబ్బర్‌ చెప్పును నోట కరుచుకున్న పాము, తల పైకి ఎత్తి చాలా కోపంతో వేగంగా పాకుతున్నట్లు అందులో ఉంది. ‘ఈ పాము ఆ చెప్పుతో ఏం చేస్తుందో అని ఆశ్చర్యంగా ఉంది. దానికి కాళ్లు లేవుగా’ అని ఆయన ఫన్నీ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ఇది ఎక్కడ జరిగిందో తెలియదని ఆయన పేర్కొన్నారు.

ఇక, ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. చెప్పు వాసన వల్ల ఏదో తినే పదార్థంగా భావించిన పాము దానిని నోట కరుచుకుని ఉంటుందని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement