సాక్షి, హైదరాబాద్: పాములను చూస్తే భయంతో దూరంగా పరుగులు తీస్తాం. అలాంటిది.. ఇటీవలే ఒకరి హెల్మెట్‌లో పాము పిల్ల దూరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా భయంకరమైన కింగ్ కోబ్రా.. ఒక మహిళ షూలోకి దూరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా పాముకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. ఓ మహిళ తన ఇంటి ముందు షూను వదిలేసింది. ఇక అందరి కళ్లుగప్పి.. నాగుపాము షూలోకి దూరింది. సదరు మహిళ షూ వేసుకునేందుకు యత్నించగా, బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది.
Cobra trying a new footwear😳😳
— Susanta Nanda (@susantananda3) October 5, 2023
Jokes apart, as the monsoon is coming to a close, please be extra careful. pic.twitter.com/IWmwuMW3gF
ఇంతలో షూను కదిలించగా, పడగ విప్పి బయటకు వచ్చింది కింగ్ కోబ్రా. దీంతో ఆమె హడలిపోయింది. దూరంగా పరుగెత్తింది. కాసేపటికే నాగుపాము అటు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: భార్యకు గుడ్‌బై.. ఇజ్రాయెల్ కోసం భర్త సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment