
Spider Interupts Australia News Conference: ఒక్కోసారి ప్రజానాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడూ అది కూడా మీడియా ప్రత్యక్ష ప్రశారాల్లో అనుకోని అంతరాయాలు ఏర్పడటం చూస్తుంటాం. సిగ్నల్స్ లేక లేదా ఒక వేళ అక్కడ ఉన్న వ్యక్తులు సమావేశం జరగకుండా అడ్డుతగలడమే చూస్తుంటాం. కొంత మంది వ్యక్తులైతే పనిగట్టుకుని ఉపన్యాసిస్తున్న నేతను పట్టుకుని అందరి ముందు దులిసేసి రసభాస చేయడం కూడా ఇటీవలకాలంలో మనం ఎక్కువగా చూశాం. కానీ ఒక సీరియస్ మీటింగ్‌లో అది కూడా ఒక ఆరోగ్య మంత్రి సమావేశంలో ఒక చిన్న సరీసృపం ఎలా అంతరాయం కలిగించిందో తెలుసా!. పైగా ఒక్క నిమిషంపాటు ఆ మంత్రి కూడా కంగారుపడి పోవడం కూడా జరిగింది.
(చదవండి: పాండా జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి.. పాపం ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!
అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ ఆరోగ్య మంత్రి యివెట్ డి అథ్వాస్ కోవిడ్ -19 మహమ్మారి నియంత్రణలు, వ్యాక్సిన్‌లకు సంబంధించి బహిరంగ మీడియా సమావేశం నిర్వహించారు. అలాగే ఆ సమావేశంలో వ్యాక్సినేషన్ విధివిధానాలకు అనుగుణమైన వ్యాపార ఆవశ్యక్యత గురించి ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఎక్కడ నుంచి వచ్చిందో ఒక సాలీడు ఆమె మాట్లాడుతుండగా ఆమె మీద నుంచి సమీపంలోని పోడియం పై పడుతుంది.
దీంతో ఏదో మీద పడినట్టుగా భావించి ఒక్కసారిగా కంగారుపడుతుంది. ఆ తర్వాత వెంటనే మీలో ఎవరైన దీన్ని ఇక్కడ నుంచి తీసేయగలరా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇంతలో చీఫ్ హెల్త్ ఆఫీసర్ జాన్ గెరార్డ్ కొన్ని కాగితాలను ఉపయోగించి సాలీడును తీసేశాడు. అయితే ఆమె మన వద్ద కోవిడ్ ఉంది, స్పైడర్‌లు ఉన్నాయంటూ చమత్కరించారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.
(చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి)
Comments
Please login to add a commentAdd a comment