వీడియో దృశ్యాలు
మెల్‌బోర్న్ : ఎలుకల సమస్యతో ఆస్ట్రేలియా రైతులు అల్లాడిపోతున్నారు. చేతికందిన పంటల్ని నాశనం చేస్తున్న వాటిపై పీకల్లోతు కోపంతో ఉన్నారు. వాటి బెడదను తప్పించుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓ రైతు వాటిపై కోపం నశాలానికి అంటి దారుణానికి ఒడిగట్టాడు. వాటిని మంటల్లో పడేసి కాల్చాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఆండ్రూ అనే రైతు పొలంలో ఎలుకల ఆగడాలు ఎక్కువయ్యాయి. వాటి వల్ల తరచూ పంట నష్టమవుతుండటంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో పొలంలో ఓ చోట ఓ పెద్ద ఇనుప డ్రమ్ము పెట్టి, దాంట్లో మంట పెట్టాడు. అనంతరం ధాన్యాన్ని సేకరించే మిషన్ మూతిని మంట దగ్గర ఉంచి ఆన్ చేశాడు. దీంతో అందులో ధాన్యం కోసం పాగా వేసిన వందలాది ఎలుకలు మంట్లో పడి ప్రాణాలు విడిచాయి.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నాకు ఎలుకలంటే నచ్చదు.కానీ, వాటినలా చంపటం మంచి పద్ధతికాదు’’.. ‘‘వాటిని కాల్చేకంటే ప్రాణాలతో నీళ్లలో పడేసుంటే బాగుండు..’’.. ‘‘ నేను శాకాహారిని కాదు. కానీ, వాటిని కచ్చితంగా కాల్చకుండా ఉండాల్సిందని మాత్రం చెప్పగలను’’ అని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకు ఆండ్రూ రిప్లై ఇస్తూ.. ‘‘ సమస్య మీది కాదు కాబట్టి ఎన్నైనా చెబుతారు.. వాటిని కాల్చకుండా ఏం చేస్తే బాగుండేదో మీరే చెప్పండి’’ అంటూ మండిపడ్డాడు.
చదవండి : వరదలో చిక్కిన మహిళ.. ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని..
Comments
Please login to add a commentAdd a comment