
సాక్షి, న్యూఢిల్లీ : ఖరీదైన 100 ఐఫోన్లను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆదివారం దుబాయ్ నుంచి భారత్ వచ్చిన 53 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద దాదాపు రూ. 85 లక్షలు విలువ చేసే ఐఫోన్ ఎక్స్ ఫోన్లను గుర్తించారు. వాటికి సరైన ఆధారాలు చూపని కారణంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, ఫోన్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద అక్రమంగా రవాణా చేస్తున్న బంగారం, ఖరీదైన వస్తువులు భారీగా లభిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment