స్మార్ట్ ఫోన్ తో పళ్లను బ్రష్ చేసుకొండి!
స్మార్ట్ ఫోన్ తో పళ్లను బ్రష్ చేసుకొండి!
Published Wed, Jul 9 2014 11:43 AM | Last Updated on Wed, Sep 5 2018 2:06 PM
ఇకపై ఐఫోన్ నో లేక ఆండ్రాయిడ్ ఫోన్ ను చూస్తూ బ్లూటూత్ సాయంతో పళ్లు తోముకొండి. మీ పళ్ల సందుల్లో ఎలా క్లీన్ చేయాలో, బ్రష్ ను ఎలా వాడాలో మీకు ప్రత్యక్షంగా మీ స్మార్ట్ ఫోన్ చెబుతుంది.
కొత్తగా మార్కెట్లలో విడుదలైన ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ మీకు ఫీడ్ బ్యాక్ ఇస్తుంది. రెండంటే రెండు నిమిషాల్లో మొత్తం పళ్లను శుభ్రం చేస్తుంది. దీని కోసం ప్రత్యేకమైన యాప్ ను కూడా రూపొందించారు.
ఈ టూత్ బ్రష్ ల హెడ్స్ ను మార్చుకోవచ్చు. చార్జింగ్ చేసుకునేందుకు చార్జర్, పళ్లు తోముకునేందకు, నాలుక గీసుకునేందుక ఆరు స్విచ్చిలు ఉంటాయి. మీరు బ్రష్ చేసుకుంటుంటే స్మార్ట్ ఫోన్ స్క్రీను మీద మీ టీత్ మ్యాప్ కనిపిస్తుంది. మీ బ్రష్ ఎక్కడ దాకా వెళ్లిందో కనిపిస్తుంది. ఇంకెంత లోపలికి తోయాలో తెలుస్తుంది. బాగా నొక్కి తోముతూంటే ప్రెషర్ తగ్గించమని సూచనలిస్తుంది. గత ఇరవై రోజులుగా మీరు బ్రష్ చేసుకున్న తీరును రికార్డు చేసి ఉంచుతుంది.
అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్ లను ఈ సోనార్ ఎలక్ట్రిక్ బ్రష్ ఇప్పటికే తోమి పారేసింది. త్వరలో మన దగ్గరికీ వస్తుంది. కాసుకొండి.
Advertisement