ఐఫోన్‌తో కేక్‌ కట్‌ చేసి.. ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుకలు: వైరల్‌ | Karnataka BJP MLA Son Cuts Birthday Cake With IPhone Video Goes Viral | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌తో కేక్‌ కట్‌ చేసి.. ఎమ్మెల్యే కొడుకు బర్త్‌డే వేడుకలు: వైరల్‌

Published Fri, Sep 3 2021 9:05 PM | Last Updated on Fri, Sep 3 2021 9:51 PM

Karnataka BJP MLA Son Cuts Birthday Cake With IPhone Video Goes Viral - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని ఓ జీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఐఫోన్‌తో బర్త్‌డే కేక్‌లను కట్‌ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివకాల్లోకి వెళితే.. కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్‌ దడేసుగూర్‌ కొడుకు పుట్టిన రోజు వేడుకలో కేక్‌ను తన ఐఫోన్‌తో కట్‌ చేశాడు. అతడు పుట్టినరోజును బళ్లారి జిల్లా హోసపేటలో జరుపుకోవడానికి తన స్నేహితులతో కలిసి బీఎండబ్ల్యూలో చేరుకున్నాడు.

చదవండి: రైల్లో లోదుస్తులతో ఎమ్మెల్యే చక్కర్లు.. నెటిజన్ల ట్రోలింగ్‌ 

కాగా ఈ వీడియోలో మొత్తం​ 8 కేకులను ఐఫోన్‌తో కట్‌ చేసి జరుపుకున్నాడు. అయితే దీనిపై అతడి తండ్రి ఎమ్మెల్యే బసవరాజ్‌ స్పందిస్తూ.. ‘‘నా కొడుకు కష్టపడి డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బుతో కొన్న ఐఫోన్‌తో కేక్‌ కట్‌ చేశాడు. ఇందులో తప్పేముంది? కోవిడ్‌-19 వల్ల చేతులకు బదులు ఐఫోన్‌ ఉపయోగించాడు’’ అంటూ వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ..  ‘‘2018 ఎన్నికలకు ముందు ఎన్నికల ఖర్చుల కోసం  ఆయన నియోజకవర్గంలో ప్రజలు డబ్బులు చందాలు వేసుకుని గెలిపించారు. ఆ విధంగా గెలిచిన ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఈ డబ్బు ఎలా వచ్చింది?’’ అంటూ ప్రశ్నించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement