ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్‌ | Balika Vadhu Actor Siddharth Shukla Arrested | Sakshi
Sakshi News home page

ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్‌

Published Sun, Jul 22 2018 8:51 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

Balika Vadhu Actor Siddharth Shukla Arrested - Sakshi

సిద్దార్ద్‌ శుక్లా (ఫైల్), ప్రమాదానికి గురైన కారు

ముంబై : ప్రముఖ హిందీ టీవీ నటుడు సిద్దార్ద్‌ శుక్లా తన ర్యాష్‌ డ్రైవింగ్‌తో కారు ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన కారుతో పాటు మరో మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం కారును నడుపుతున్న సిద్దార్ద్‌ శుక్లా ఒక్కసారిగా పట్టుతప్పి ముందు వస్తున్న కార్లను ఢీకొన్నారు. ఆ తర్వాత ఓ కరెంట్‌ స్థంబాన్ని ఢీకొన్న అతని కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రాజ్‌కుమార్‌ దూదె అనే కారు యాజమాని స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నటుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు నడుపుతున్న సమయంలో సిద్దార్ద్‌ శుక్లా తాగి ఉన్నాడా? లేదా? అని తెలుసుకోవటానికి అతని రక్తాన్ని వైద్యపరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. సిద్దార్ద్‌ కారు కరెంట్‌ స్థంబాన్ని ఢీకొన్నా కారులోని ఏయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోలేదని, అయినా అదృష్టం కొద్ది అతడికి ఏ గాయాలుకాలేదని వెల్లడించారు. 279,336,337 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. సిద్దార్ద్‌ శుక్లా పాపులర్‌ హిందీ సీరియల్‌ ‘‘ బాలికా వధు’’ (తెలుగులో ‘‘చిన్నారి పెళ్లికూతురు’’)లో లీడ్‌ రోల్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement