నటుడిపై లైంగిక వేధింపుల కేసు | Molestation Case Filled On Actor Shahbaz Khan In Mumbai | Sakshi
Sakshi News home page

నటుడు షాబాజ్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసు

Published Wed, Feb 12 2020 11:30 AM | Last Updated on Wed, Feb 12 2020 12:21 PM

Molestation Case Filled On Actor Shahbaz Khan In Mumbai - Sakshi

ముంబై: ప్రముఖ చిత్ర, టీవీ నటుడు షాబాజ్‌ ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసును నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఓ యువతిని లైంగిక వేధించినట్లు ఫిర్యాదు రావడంతో ఓషివారా పోలీసు స్టేషన్‌లో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 354, 509 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున ఆయనపై ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఏఎన్‌ఐ న్యూస్‌ పేర్కొంది.


ఇక  పలు హిందీ సీరియల్‌లో ప్రతి నాయకుడి పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న షాబాజ్‌ ఖాన్‌ అసలు పేరు హైదర్‌ ఖాన్‌. శాస్త్రీయ గాయకుడిగా పద్మభూషన్‌ ఆవార్డును గెలుచుకున్న ఉస్తాద్‌ మీర్‌ ఖాన్‌ కుమారుడు. షాబాజ్‌ తెనాలి రామా, రామా సియా కే లవ్‌ కుష్‌, సలామ్‌ అలీ ఖాన్‌..  వంటి హిందీ సిరియళ్లతో పాటు వెండితెరపై కూడా ప్రతినాయకుడి పాత్రల్లో నటించి పాపులర్‌ అయ్యాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement