![Bangladeshi Businessman Arrested After Actress Pori Moni Alleges Murder Attempt Case - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/14/pori-moni.gif.webp?itok=Sml7-VNz)
బడా వ్యాపారవేత్త తనపై అత్యాచారం చేసి చంపేందుకు ప్రయత్నించారంటూ బంగ్లాదేశ్ హీరోయిన్ పోరి మోని(షామ్‌సున్నాహర్) ఫేస్‌బుక్‌లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ ఆపద నుంచి ఎలాగైనా గట్టెక్కించమంటూ దేశ ప్రధాని షేక్ హసీనాను కోరింది. ఆమెను తల్లిగా సంబోధించిన మోని నిందితులపై చర్యలు తీసుకోమని అర్థించింది. "న్యాయం కోసం ఎక్కడని వెతకాలి? నాలుగు రోజులుగా నేను న్యాయం కోసం తిరుగుతున్నాను. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను అమ్మాయిని, నటిని. వీటన్నింటికన్నా ముందు నేనూ ఒక మనిషినే. ఇక నేను సైలెంట్‌గా ఉండలేను" అని రాసుకొచ్చింది.
నాలుగు రోజుల క్రితం ఓ క్లబ్‌లో బడా వ్యాపారవేత్త నజీర్ యు మహ్మూద్ తనపై అత్యాచారానికి యత్నించడంతో పాటు చంపుతామని బెదిరించాడని మోని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు వ్యాపారవేత్తతో పాటు మరో నలుగురిని రైడ్ చేసి అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వారు మద్యంతోపాటు డ్రగ్స్ సేవించారని అధికారులు మీడియాకు తెలిపారు. ఇదిలా వుంటే పోరి మోని 2015లో వెండితెరకు పరిచయమైంది. సుమారు 24 బంగ్లాదేశీ చిత్రాల్లో కథానాయికగా అలరించింది. గతేడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన '100 డిజిటల్ స్టార్స్ ఆఫ్ ఆసియా' జాబితాలో చోటు దక్కించుకుంది.
చదవండి: బన్నీ అస్సలు తగ్గట్లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులతో దండయాత్రకు రెడీ
Comments
Please login to add a commentAdd a comment