మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతమే లేదన్నట్లుగా నేరాలు జరుగుతున్నాయి. ఈ అఘాయిత్యాలకు పాల్పడే వాళ్లంతా సమాజంలో మంచి స్థానంలో ఉన్న ప్రముఖులు లేదా ప్రుముఖుల పిల్లలే కావడం బాధకరం. స్టార్ హీరోయిన్ దగ్గర నుంచి మంచి ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న మహిళలందరూ ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. కొంతమంది ప్రబుద్ధులు చట్టాలను సైతం లెక్కచేయకుండా మహిళలపై అయిత్యాలకు తెగబడుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక రచయిత్రి అత్యాచారానికి గురైంది.
వివరాల్లోకెళ్తే....ముంబైలోని ఉంటున్న ఒక రచయిత్రి అత్యాచారానికి గురైంది. ముంబైలోని జుహు ప్రాంతంలో ఫైవ్‌స్టార్ హోటల్‌లో 35 ఏళ్ల రచయిత్రి పై 75 ఏళ్ల వ్యాపారవేత్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా ఆ వ్యాపారవేత్త ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ డాన్ దావుద్ ఇబ్రహీం పేరుతో బెదిరించాడు.
దీంతో ఇక ఆమె చేసేదిలేక ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు నిందితుడు బాధిత మహిళ వద్ద రూ.2 కోట్లు రుణం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా... నిందితు డాన్ పేరుతో బెదిరించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: చంపి.. బొందపెట్టారు: అమెజాన్ అడవుల్లో వీడిన మిస్టరీ.. బొల్సోనారో బలుపు వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment