
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: ముంబైలోని బాంద్రాలో బ్రిటిష్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న బ్రిటిష్ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మంగళవారం బాంద్రాలోని ఓ క్లబ్‌లో జరిగిన ఘటన ఆలస్యం గా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ (44) ముంబైలోని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది. మంగళవారం తన భర్త, మరికొంతమంది స్నేహితులతో కలసి ఆమె బాంద్రాలోని ఓ క్లబ్ కు వెళ్లింది. సుమారు రాత్రి 11.30 గంటల సమయంలో సదరు మహిళ బాత్‌రూమ్‌కు వెళ్లగా...అక్కడ 35 ఏళ్ల యువకుడు ఆమెను వెంబడించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
వెంటనే బయటకొచ్చి జరిగిన విషయం తన భర్తకు, స్నేహితులకు చెప్పగా వారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు నగరానికి చెందిన ఘనశ్యామ్ లాలాచంద్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. లాల్ చంద్‌పై ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 509 కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment