british woman
-
ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?
ఆన్లైన్లో, రెస్టారెంట్‌లోగానీ ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఏదైనా లోపం ఉన్నా, లేదా ఇంకేమైనా వెంట్రుకలు లాంటి అవాంఛిత పదార్థాల్ని, వస్తువులను గుర్తించినా, వెంటనే సంబంధిత డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేయడం, దానికి వాళ్లు సారీ చెప్పడం, లేదా ఫ్రీ మీల్ ఆఫర్ చేయడం ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే ఇలాంటి ఫ్రీ మీల్స్ కోసం ఆశపడిన ఒక అమ్మడు అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు కస్టమర్లు ఫిర్యాదులు ఆధారంగా వారికి నష్టపరిహారం ఫ్రీ మీల్స్ ఆఫర్ చేస్తాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం కథనం ప్రకారం ఇలా ఉచిత భోజనం కక్కుర్తి పడిన బ్రిటీష్ మహిళ రెస్టారెంట్‌ను మోసం చేయాలని ప్లాన్ చేసింది. ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌బర్న్‌లోని ప్రసిద్ధ తినుబండారం అయిన అబ్జర్వేటరీలో భోజనం చేస్తూ ఆహారంలో జుట్టు వచ్చిందంటూ హడావిడి చేసింది. దీంతో హోటల్ యజమాని మహిళ బీఫ్ రోస్ట్ డిన్నర్‌ను తిరిగి ఆఫర్ చేశారు. అయితే, నిఘా కెమెరాలున్నాయన్న సంగతిని ఆ మహిళ మర్చిపోయింది. కానీ రెస్టారెంట్ యజమాని మాత్రం మర్చిపోలేదు. అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే తమ హోటల్లో ఇలా జరిగిందేమిటబ్బా అని ఆందోళన చెందిన అతను ఆ తరువాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. దీంతో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. వీడియోలో మహిళ జుట్టును తీసి తన భాగస్వామి సగం తిన్న ప్లేట్లో ఉంచడం క్లియర్ కనిపించింది.టామ్ క్రాఫ్ట్ దీనిపై సోషల్ మీడియాలోపోస్ట్ పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్ బాబులూ బీ అలర్ట్ జాగ్రత్త ఇలాంటి వాళ్లూ కూడా ఉంటారు అంటూ ఫేస్బుక్లో CCTV ఫుటేజీని షేర్ చేశాడు. ఇది చాలా అసహ్యంగా అనిపించిందని, కేవలం 15.88 డాలర్లు(రూ. 1300) కోసం ఇంతకు దిగజారతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తమకు ఫైవ్ స్టార్ ఫుడ్ హైజీన్ రేటింగ్ ఉందనీ, అన్ని ఆహార భద్రతా మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపాడు. నిజంగా సీసీటీవీ ఫుటేజీని గమనించకపోతే ఆమె ఆరోపణతో తన వ్యాపారం, ప్రతిష్ట గంగలో కలిసిపోయేదిగా అంటూ వాపోయాడు.. -
శరీరంపై 800 టాటూలు.. అక్కడే చిక్కొచ్చి పడింది..!
టాటూ.. శరీరాన్ని మరింత అందంగా ఫ్యాషన్‌గా కనిపించేలా చేస్తుంది. అందరి కళ్లూ మనమీదే ఉండేలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ బ్రిటన్‌కు చెందిన ఓ మహిళకు మాత్రం టాటూలే తన పాలిట శాపంగా మారాయి. టాటూల కారణంగానే ఎక్కడకు వెళ్లినా.. దిక్కరింపులే ఎదురవుతున్నాయట. జీవనోపాధి కూడా లభించట్లేదట. ఎందుకంటే..? ఆమె పేరు మెలిస్సా స్లోన్(46) యూకేకు చెందిన మహిళ. ఇంతకు ముందు తనకు కనీసం టాయిలెట్ క్లీనింగ్ ఉద్యోగమైనా లభించేది. కానీ ఇప్పుడు అది కూడా దొరకట్లేదు. ఎందుకంటే ఆమె తన శరీరంపై ఏకంగా 800 టాటూలను వేయించుకుంది. శరీరమంతా టాటూలతో నిండిపోయింది. దీంతో ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం ఇవ్వకుండా యజమానులు తిరస్కరిస్తున్నారట. మెలిస్సాకు తన 20వ ఏట నుంచి టాటూలను శరీరంపై వేయించుకునే అలవాటు ఉండేది. మొదట్లో ప్రతి వారం రెండు నుంచి మూడు టూటూలు వేయించుకుంటే.. ఇక రాను రాను పరిస్థితి మారిపోయింది. వాటికి అలవాటు పడి శరీరమంతా పచ్చబొట్లను పొడిపించుకుంది. దీంతో చూడటానికి ఇబ్బందికరంగా మారిపోయింది. మెలిస్సాకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూటూల కారణంగా శరీరం నీలం రంగులో మారిపోయిందని ఆమె చెబుతున్నారు. కానీ అవంటే తనకు ఎంతో ఇష్టమని చెబుతోంది. బహుశా ప్రపంచంలో తన కంటే ఎక్కువ టాటూలు ఎవరి శరీరంపై ఉండబోవని ఆమె అన్నారు. ఇదీ చదవండి: గిన్నీస్ రికార్డ్: చేతులపై 25 సెకన్లలో 75 మెట్లు దిగి.. -
ముంబైలో దారుణం.. బ్రిటిష్ మహిళపై అత్యాచారం
ముంబై: ముంబైలోని బాంద్రాలో బ్రిటిష్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న బ్రిటిష్ మహిళ లైంగిక వేధింపులకు గురైంది. మంగళవారం బాంద్రాలోని ఓ క్లబ్లో జరిగిన ఘటన ఆలస్యం గా వెలుగుచూసింది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ (44) ముంబైలోని బ్రిటిష్ రాయబార కార్యాలయంలో గత కొన్నేళ్లుగా పనిచేస్తోంది. మంగళవారం తన భర్త, మరికొంతమంది స్నేహితులతో కలసి ఆమె బాంద్రాలోని ఓ క్లబ్ కు వెళ్లింది. సుమారు రాత్రి 11.30 గంటల సమయంలో సదరు మహిళ బాత్రూమ్కు వెళ్లగా...అక్కడ 35 ఏళ్ల యువకుడు ఆమెను వెంబడించి అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే బయటకొచ్చి జరిగిన విషయం తన భర్తకు, స్నేహితులకు చెప్పగా వారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు నగరానికి చెందిన ఘనశ్యామ్ లాలాచంద్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. లాల్ చంద్‌పై ఐపీసీ సెక్షన్లు 354, 354 (ఎ), 509 కింద కేసు నమోదు చేశారు. -
Metaverse: కనీవినీ ఎరుగని రీతిలో సామూహిక అత్యాచారం
ప్రపంచంలో ఏదో ఒక మూల.. ప్రతీ నిమిషానికి మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఒంటరి మహిళలు మృగాల చేతిలో చితికిపోతున్నారు. కానీ, ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన.. బహుశా ఇది వరకు విని, చదివి ఉండరు. వాస్తవిక ప్రపంచంలోనే కాదు.. వర్చువల్ ప్రపంచంలోనూ ఆడవాళ్ల భద్రతపై అనుమానాల్ని పెంచే ఘటన ఇది. పైగా అవి మరింత ఘోరంగా.. ఆందోళనకరంగా ఉంటాయనే విషయాన్ని రుజువు చేసింది ఇది. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ(43).. ఫేస్బుక్ మెటావర్స్ ‘హోరిజోన్ వెన్యూస్’పై సంచలన ఆరోపణలకు దిగింది. ఆ వేదికపై తాను గ్యాంగ్‌రేప్‌నకు గురయ్యానని ఆమె ఫిర్యాదు చేసింది. వర్చువల్ వరల్డ్‌లోకి జాయిన్ అయిన నిమిషానికే.. తనను ముగ్గురు-నలుగురు (మేల్ అవతార్స్) చుట్టుముట్టి బలాత్కారం చేశారని, ఆపై ఆ అఘాయిత్యాన్ని ఫొటోలు సైతం తీశారని ఆమె వాపోయింది. ఆర్తనాదాలు. అరణ్యరోదనే! అఘాయిత్యం జరుగుతున్న టైంలో తను గట్టిగట్టిగా అరిచినా.. స్పందన కరువైందని ఆమె వాపోయింది. ఆ సమయంలో చాలామంది లాగిన్‌లో ఉన్నారు. కానీ, నా అరుపులను ఎవరూ పట్టించుకోలేదు. పైగా నా అవతార్ మీద ఘాతుకానికి పాల్పడ్డ మగ అవతార్లు మృగాళ్లా ప్రవర్తించాయి. దుర్భాషలాడాయి.. నాపై దాడి చేశాయి. దుస్తులు చించేశాయి. ఏం జరుగుతుందో అర్థం కావడానికే నాకు కొన్ని నిమిషాలు పట్టింది. ఆ భయంకరమైన అనుభవంతో వెంటనే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తీసేసి, లాగౌట్ అయ్యానని ఆమె పేర్కొంది. ఇక ఘటనపై తన అనుభవాన్ని ఓ బ్లాగ్‌లో పంచుకున్న బాధితురాలు. వర్చువల్ ఘటనను అనవసరంగా సీన్ చేస్తోందని కొందరు అంటున్నారు. కానీ, వాస్తవాల నుంచి వర్చువల్ అనుభవాలు వేరు చేయలేవని ఆమె అంటోంది. అందుకే వర్చువల్ ప్రపంచంలోనూ అనుభవాలకు 'వాస్తవికత' ఉంటుందని పేర్కొంది. వర్చువల్ రియాలిటీలో ఎక్కువ మంది ఉన్నప్పుడు.. అక్కడ వాస్తవికతకు ఆస్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలని, తనకు ఎదురైన అనుభవం వర్చువల్ ప్రపంచంలోనూ మరెవరికీ ఎదురు కాకూడదని ఆమె అంటోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పందించని ఫేస్బుక్ మెటావర్స్.. భద్రత విషయంలో మార్పులు చేస్తున్నట్లు ఆ మధ్య ఒక ప్రకటనతోనే సరిపెట్టింది. సంబంధిత వార్త: పక్కన లేకున్నా.. ‘నన్ను బలవంతంగా వాటేసుకుని’!! -
Zara Rutherford: గాలిలో తేలినట్టుందే..!
నీటిమీద, నేల మీద ప్రపంచాన్ని చుట్టి రికార్డులు సృష్టించినవాళ్లు చాలామందే ఉన్నారు. వీరందరికీ భిన్నంగా ఓ 19 ఏళ్ల అమ్మాయి గాల్లో ప్రయాణిస్తూ ప్రపంచాన్ని చుట్టి సరికొత్త రికార్డు నెలకొల్పనుంది. బెల్జియన్ బ్రిటిష్ సంతతికి చెందిన జరా రూథర్‌ఫర్డ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే ‘బెస్పోక్ షార్క్ ఆల్ట్రాలైట్ ’ విమానంలో ప్రపంచాన్ని చుట్టేయనుంది. ఆగస్టు పదకొండున బ్రసెల్స్‌లో ప్రారంభమయ్యే జరా ప్రపంచ యాత్ర మూడు నెలలు కొనసాగి యూరప్ లో ముగుస్తుంది. 52 దేశాలను చుట్టే క్రమంలో 51 వేల కిలోమీటర్లు ప్రయాణించనుంది. జరా తల్లిదండ్రులు ఇద్దరు పైలట్లు కావడంతో 14 ఏళ్ల వయసునుంచే విమానం నడపడం నేర్చుకుంది. పద్దెనిమిదో ఏట విమానం నడిపే లైసెన్స్ తీసుకుంది. జరా యాత్ర సవ్యంగా సాగితే ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి అతిపిన్న వయస్కురాలిగా నిలవనుంది. ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన షెస్తావాయి (2017) పేరుమీద రికార్డు ఉండగా, పురుషుల విభాగంలో 18 ఏళ్ల అతిపిన్న వయస్కుడి మీద మరో రికార్డు ఉంది. ‘‘అమ్మ కాస్త వెనక్కు లాగినప్పటికీ, నాన్న మాత్రం ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహంతోనే ఈరోజు యాత్రకు సిద్ధమయ్యాను. నా యాత్ర విజయవంతమైన తరువాత స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్) చదువుతోన్న చాలామంది అమ్మాయిలు ప్రేరణ పొంది ఏవియేషన్ రంగంలోకి వస్తారు. ఈ విభాగంలో పురుషులకు, మహిళలకు మధ్య చాలా తేడా ఉంది. అందుకే నేను రికార్డు నెలకొల్పి ఏవియేషన్‌లో అమ్మాయిలు కూడా రాణించగలరని నిరూపిస్తాను’’ అని జరా చెప్పింది. -
బ్రిటీష్ యువతికి పెళ్లి పేరిట వల.. ఆపై దారుణం
ఇస్లామాబాద్: బ్రిటీష్ దేశానికి చెందిన యువతి పాకిస్తాన్లో ఉంటుండగా ఇద్దరు యువకులు ఆమెను ఇష్టపడ్డారు. వారిద్దరూ ఆమెకు లవ్ ప్రపోజల్స్ చేశారు. అయితే వారు ప్రపోజల్ చేసిన కొన్నాళ్లకే ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో పాకిస్తాన్లో కలకలం రేపింది. ఆ యువతి మరణం మిస్టరీగా మారింది. దీనిపై అక్కడి పోలీసులతో పాటు బ్రిటీష్ అధికారులు కూడా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బెల్జియంకు చెందిన లా విద్యార్థి మైరా జుల్ఫికర్ (25) పాకిస్తాన్‌లోని లాహోర్‌లో తన స్నేహితురాలు ఇఖ్రాతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. మూడు నెలల కిందట బ్రిటన్ నుంచి పాకిస్తాన్‌కు వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు సాద్ అమీర్ భట్, జాహీద్ జడూన్ పరిచయమయ్యారు. ఆ ఇద్దరు యువకులు ఆమెను పెళ్లి చేసుకుంటామని ప్రతిపాదించారు. అయితే వారిని తిరస్కరించింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం తుపాకీ తూటాలకు బలైంది. లాహోర్‌లో నివసించే ఆమె బాబాయి మహ్మద్ నాజీర్ విషయం తెలుసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆమె హత్య విషయమై ఫిర్యాదు చేశాడు. మైరాకు ఇద్దరు పెళ్లి ప్రతిపాదన చేయగా దాన్ని తిరస్కరించినప్పటి నుంచి ఆమెకు ప్రాణహాని పొంచి ఉందని ఫిర్యాదులో ఆమె బాబాయి పేర్కొన్నాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. మెడ వద్ద.. తొడ భాగాన రెండు బుల్లెట్లను గుర్తించారు. అయితే వారిద్దరూ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోవాలనే కోణంలో విచారణ చేయగా.. వారిద్దరూ ఆమెను పెళ్లి చేసుకుంటే బ్రిటన్ వీసా లభిస్తుందనే ఆశించారట. అయితే ఆమె పెళ్లికి నిరాకరించిందనే ఆక్రోశంతో ఆమెపై కాల్పులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మైరా జుల్ఫీకర్ హత్యలో అమీర్ భట్ హస్తం ప్రధానంగా ఉందని పోలీస్ అధికారి సిద్రా ఖాన్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఇస్లామాబాద్, లాహోర్‌లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై బ్రిటన్ అధికారులు కూడా ఆరా తీశారు. చదవండి: కొత్తగా పెళ్లయిన కమెడియన్ జంటకు షాకిచ్చిన పోలీసులు చదవండి: ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు -
మాస్కులు కుడుతున్న ‘బ్రిటిష్ ఇల్లాలు’
బంజారాహిల్స్: కరోనా వైరస్ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాల్సి ఉండగా కొంతమంది పేదలు వీటికి దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని బంజారాహిల్స్ రోడ్ నంబర్–3లో నివసించే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ విభాగం అధికారి ఆండ్రుఫ్లెమింగ్ భార్య వ్యాన్ఫ్లెమింగ్ గత 3 రోజుల నుంచి మాస్క్‌లు ఉచితంగా అందిస్తున్నారు. నైజీరియన్ క్లాత్‌తో ఆమె ఈ మాస్క్‌లు కుడుతూ తన చుట్టుపక్కల నివసించే పేదలకు పంపిణీ చేస్తున్నారు. ఆమె చేస్తున్న ఈ సేవకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆమె 300కుపైగా మాస్క్‌లను సొంతంగా కుట్టి పంపిణీ చేశారు. -
గోవాలో బ్రిటన్ మహిళపై లైంగిక దాడి
పనాజి : గోవాలో బ్రిటన్ టూరిస్ట్‌పై గుర్తుతెలియని వ్యక్తి లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. గోవాలో గురువారం ఉదయం బీచ్ వద్దకు వెళుతున్న 48 సంవత్సరాల బ్రిటన్ పర్యాటకురాలిపై దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని, లైంగిక దాడి అనంతరం ఆమె వస్తువులను అపహరించాడని పోలీసులు తెలిపారు. పనాజీకి వంద కిలోమీటర్ల దూరంలోని కనాకొన పట్టణంలో గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, నేరానికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడని దక్షిణ గోవా పోలీసులు వెల్లడించారు. బాధితురాలు పాలోలెమ్ బీచ్‌కు వెళుతుండగా అడ్డగించిన దుండగుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని చెప్పారు. ఒంటరిగా వెళుతున్న మహిళను గమనించిన నిందితుడు ఆమెను రోడ్డు పక్కనే ఉన్న పంటపొలంలోకి బలవంతంగా తీసుకువెళ్లి లైంగిక దాడికి తెగబడ్డాడన్నారు. ఘటన అనంతరం బాధితురాలికి చెందిన మూడు బ్యాగులను దొంగిలించి పారిపోయాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు గత పదేళ్ల నుంచి తరచూ గోవాను సందర్శిస్తున్నారని తెలిపారు. -
షాండ్లియర్‌తో మహిళ నిశ్చితార్ధం
లండన్ : ప్రేమకు వయసు, మతమే కాదు ఏవీ అడ్డురావని 34 ఏళ్ల బ్రిటన్ మహిళ మరోసారి చాటిచెప్పారు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌కు చెందిన అమాండ లిబర్టీ 91 సంవత్సరాల షాండ్లియర్‌తో నిశ్చితార్ధం జరుపుకుని ఏకంగా దానికి లుమియర్ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఈబే నుంచి కొనుగోలు చేసిన ఈ జర్మన్ షాండ్లియర్ టాటూను ఆమె తన ఎడమ చేతిపై వేసుకున్నారు. ప్రముఖ బ్రిటిష్ టీవీ షో టాటూ ఫిక్సర్స్ స్టార్ అలిస్ పెర్రిన్ ఈ టాటూను వేశారు. షాండ్లియర్‌తో తన జీవితం పంచుకునేందుకు ఆమె త్వరలోనే కమిట్మెంట్ సెర్మనీని కూడా నిర్వహించబోతున్నారు. వస్తువుల పట్ల ఆకర్షితమయ్యే డిజార్డర్‌తో అమండా బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇది ఓ రకమైన మానసిక దౌర్భల్యమని వారంటున్నారు. -
పెళ్లికి వచ్చిన విదేశీయులనూ వదల్లేదు!
సాక్షి, గుంటూరు: రాజధాని జిల్లాలో నిత్యం, సభలు, సమావేశాల బందోబస్తుల నుంచి నేరస్తులు, దొంగల వేట వరకూ నిత్యం తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతూ కొందరు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. అవినీతికి అలవాటుపడిన మరికొందరు ఆ శాఖ పరువును దిగజారుస్తున్నారు. విదేశీయుల రాకపోకలతో పాటు తీవ్రవాదుల కదలికలపై నిఘా ఉంచాల్సిన బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న కౌంటర్ ఇంటెలిజెన్స్(సి.ఐ) విభాగంలోని కానిస్టేబుళ్లే అవినీతికి తెర తీయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వీరు ఏకంగా విదేశీయుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో వారు డీజీపీ మాలకొండయ్యకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాలతో విచారణ నిర్వహించిన అర్బన్ ఎస్పీ విజయారావు అందుకు కారకులైన ముగ్గురు సీఐ సెల్ కానిస్టేబుళ్లను సస్పెండ్‌చేసి నివేదికను డీజీపీకి పంపారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామంలో గత ఏడాది డిసెంబర్ 20న జరిగిన ఓ స్నేహితుని వివాహానికి పలువురు విదేశీయులు హాజరయ్యారు. వారు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా వారి పాస్‌పోర్టులు పరిశీలించి నిబంధనల ప్రకారం ఫారం–సీ దరఖాస్తును వారి నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్‌కు చెందిన కానిస్టేబుళ్లు చూడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎం. శ్రీనివాసకుమార్, టి.రవితేజ, వి.ప్రదీప్‌కుమార్ అనే ముగ్గురు కానిస్టేబుళ్లు విదేశీయుల వద్దకు వెళ్లి దురుసుగా ప్రవర్తించారని, డబ్బులు కూడా డిమాండ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతమంది ఒకేసారి ఎందుకు వచ్చారు.. పాస్‌పోర్టులు చూపించండి..అంటూ ఫొటోలు తీస్తూ హడావిడి సృష్టించారని, డబ్బులు కూడా డిమాండ్ చేసినట్టు సమాచారం. అర్బన్ ఎస్పీ సమగ్ర విచారణ పెళ్లి వేడుక ముగించుకుని స్వదేశానికి వెళ్లిన రోసియన్ రేన్యమ్ అనే బ్రిటిష్ మహిళ సీఐ సెల్ కానిస్టేబుళ్లు తమ పట్ల ప్రవర్తించిన తీరు, డబ్బులు వసూలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ వెంటనే విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ సీహెచ్. విజయారావును ఆదేశించారు. దీంతో సోమవారం సమగ్ర విచారణ జరిపిన అర్బన్ ఎస్పీ కానిస్టేబుళ్లు ఎం. శ్రీనివాసకుమార్, టి.రవితేజ, వి. ప్రదీప్‌కుమార్ విదేశీయుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు నిర్ధారించి వారిని సస్పెండ్ చేశారు. జరిగిన సంఘటనపై పూర్తి నివేదికను డీజీపీకి పంపారు. తాము విదేశీయుల వద్ద రూ.2వేలు వసూలు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఫారం–సీ దరఖాస్తును పూర్తి చేసి ఇచ్చినందుకు కంప్యూటర్ సెంటర్ వాళ్లకు ఇవ్వమని డబ్బు ఇచ్చారంటూ సీఐ సెల్ కానిస్టేబుళ్లు ఎస్పీకి ఇచ్చిన వివరణలో తెలిపినట్టు సమాచారం. -
డేటింగ్‌కు వెళ్లి కిటికీలో ఇరుక్కుంది
లండన్: అప్పటి వరకు ఆహ్లాదంగా ఉన్న వారిగదిలో ఒక్కసారిగా భయాందోళనలు చుట్టుముట్టాయి. జాలీగా, సరదాగా ఆ రాత్రంతా గడిపేద్దామనుకున్న వారిని టైం వెక్కిరించింది. చాటుమాటుగా చేద్దామనుకున్న వారి పనిని బట్టబయలుచేసింది. చివరకు అగ్నిమాపక సిబ్బంది వస్తేగానీ వారి సమస్య పరిష్కారం అయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ టిండర్ అనే మొబైల్ యాప్ ద్వారా లియామ్ స్మిత్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అదికాస్త గాఢంగా మారి అతడితో డేటింగ్ చేయాలనుకుంది. అనుకుందే తడువుగా బ్రిస్టల్‌లోని స్మిత్ ఇంట్లో వారిద్దరు ఏకాంతంగా గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఏం చక్కా మద్యం, కొన్ని ఆహారపదార్థాలు తెచ్చుకున్నారు. మద్యం సేవిస్తుండగా మద్యలో ఆ మహిళ టాయిలెట్లోకి టిష్యు పేపర్‌ను లాగే ప్రయత్నం చేయగా అది కాస్త రెండు కిటికిల సందులో పడింది. దీంతో ఆమె దానిని అందుకునే ప్రయత్నం చేస్తూ పూర్తిగా అందులోకి ఇరుక్కుపోయి కేకలు వేయడం ప్రారంభించింది. అది చూసిన స్మిత్‌కు ఏ చేయాలో అర్ధం కాలేదు. అతడు ఎంత ప్రయత్నించినా ఆమెను బయటకు తీయడం సాధ్యం కాలేదు. ఇక చేసేది లేక అగ్నిమాపక సిబ్బందిని ఆశ్రయించగా వచ్చి చూసిన వారు ఆశ్చర్యపోయి తమలో తామే నవ్వుకున్నారు. అనంతరం విండోను పగులగొట్టి బయటకు తీశారు. ఈ విషయం కాస్త అటుఇటూ అందరికి తెలిసిపోయింది. ఈ ఘటనలో అతడికి కాస్తంత ఉపశమనం కలిగింది.. అదేమిటంటే ఈ ఘటన కారణంగా పగిలిపోయిన తన కిటికీని తిరిగి బాగుచేయించుకునేందుకు గో ఫండ్ మి ద్వారా సాయం అందింది. -
దొంగలందు మంచి దొంగలు వేరయా!
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లే దొంగలందు మంచి దొంగలు వేరయా అని చెప్పక తప్పదేమో ఈ సంఘటన చూస్తుంటే.. దొంగిలించుకెళ్లిన బైక్‌ను తిరిగి తీసుకురావడమే కాకుండా దానిలో తిరిగి పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసి, కొత్త తాళం చేయించి పెట్టి క్షమాపణలు కోరుతూ ఓ లేఖ కూడా రాసి పెట్టిపోయారు ఇద్దరు దొంగలు. తాము ఏ యువకుడిదో ఆ బైక్ అనుకుని పొరబడ్డామని అందుకు క్షమిం చాలని ఆ లేఖలో బాధితులను కోరారు. రెండు వారాల క్రితం మెల్ ఫిషర్ అనే బ్రిటన్ మహిళ తన ఫేస్బుక్ పేజీలో ఒక పోస్ట్ చేసింది. తన ప్రియుడి కుమారుడి బైక్‌ను ఎవరో దొంగిలించుకెళ్లారని, దయచేసి ఆ బైక్ కనిపిస్తే వివరాలు అందించాలని పోస్ట్‌లో కోరారు. అయితే, ఆమె అలా పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే అనూహ్యంగా ఒక రోజు ఆ పిల్లాడి బైక్ ఇంటిముందే కనిపించింది. పైగా దానికి కొత్త తాళం చెవి చేయించి ఉండటంతోపాటు ఫుల్‌గా పెట్రోల్, ఓ క్షమాపణ పత్రం కనిపించింది. దీంతో మెల్ ఫిషర్, ఆమె ప్రియుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘మీ కుమారుడి బైక్ దొంగిలించినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాం. వాస్తవానికి మేం చేసిన తప్పు క్షమార్హం కాకపోయినప్పటికీ వివరణ ఇచ్చుకుంటున్నాం. మేం ఎవరో టీనేజర్ బైక్ అనుకుని ఎత్తుకెళ్లాం. అయితే, మీ ఫేస్బుక్ పోస్ట్ చూశాక వెంటనే మీ బైక్ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే మీ పిల్లాడి బైక్‌కు ఇక ఎవరూ దొంగిలించలేనంత బలమైన తాళాన్ని కొనుగోలు చేశాం. తాళాలు బైక్‌లో పెట్టాము. మీరు సూచించిన చోట బైక్ ఇవ్వలేకపోతున్నాం. కానీ, ఈ బైక్ చూశాకనైనా గుండెపగిలిన మీ పిల్లవాడు సంతోషపడతాడని భావిస్తున్నాం’ అంటూ ఆ లేఖలో వివరించారు. -
మాజీ ప్రియురాలిపై యాసిడ్ దాడి
రిసార్ట్‌లో సేద తీరుతున్న ప్రియురాలిపై కక్ష్య గట్టిన మాజీ ప్రియుడు ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటన లిస్బన్ నగరంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అల్గర్వ్ రిసార్ట్‌లో సేద తీరుతున్న మహిళ(29)తో మాట్లాడాలని మాజీ ప్రియుడు ఆమెకు కబురుపెట్టాడు. అతని కలవడానికి రోడ్డు మీదకు వెళ్లిన ఆమెపై చుట్టు పక్కల ఎవరూ లేని సమయం చూసిన అతను రెండు లీటర్ల యాసిడ్‌ను ఆమెపై పోశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా కింద పడిపోయి పెద్ద పెట్టున కేకలు పెట్టింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. యాసిడ్ దాడిలో బాధితురాలి శరీరంలో 30 శాతం పూర్తిగా కాలిపోయిందని.. స్పెషలిస్టు డాక్టర్లు ఆమెకు వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారని తెలిపారు. కాగా, ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డులో యాసిడ్ దాడి జరగడంపై లిస్బన్ నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఓ క్లబ్లో ఇద్దరు యువకులపై కొందరు విషవాయువు ప్రయోగించడంతో వారు చూపు కోల్పోయారు. -
కేసును నీరుగార్చేందుకు కుట్ర: ఫోయినా
పనాజి: గోవా బీచ్ లో జరిగిన తన కూతురు హత్యను పోలీసులు, ప్రభుత్వం కలిసి నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నరని ఫోయినా మెకాన్ ఆరోపించారు. బ్రిటన్ కు చెందిన స్కార్లెట్ కీలింగ్(15) 2008లో గోవా బీచ్ లో లైంగికదాడికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసుపై గోవాలోని చిల్డ్రన్ కోర్టులో తుది వాదోపవాలు జరుగుతున్న నేపథ్యంలో స్కార్లెట్ తల్లి ఫోయినా మెకాన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తన కూతురు శరీరంపై గాయాలు ఉన్నాయని, అది ముమ్మాటికీ హత్యేనని ఆమె ఆరోపించారు. మొదట ఆత్మహత్యగా కేసును నమోదు చేసిన పోలీసులు అనంతరం ఫోయినా మెకాన్, ఆమె లాయర్ విక్రమ్ వర్మ ప్రయత్నం వల్ల హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసును సీబీఐ కి అప్పగించిన అనంతరం కేసును నీరు గార్చేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారులు సస్పెండ్ కు గురయ్యారు. గోవా మాజీ మంత్రి కుమారునికి ఈ కేసులో ప్రమేయం ఉన్నందువల్లే కేసును నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం జరుగుతుందని ఫోయినా మెకాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోవాలోని అంజనా బీచ్ లో 2008 ఫిబ్రవరి 18 న స్కార్లెట్ హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. -
బ్రిటిష్ యువతి దారుణ హత్య
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సమీప ప్రాంతంలో బ్రిటిష్ యువతిని దారుణంగా పొడిచి చంపారు. బ్యాక్‌ప్యాకర్స్ హాస్టల్లో 30 మంది చూస్తూ ఉండగానే ఓ ఫ్రెంచి వ్యక్తి ఆమెను చంపేశాడు. పోలీసులు అక్కడకు వచ్చేసరికే 21 ఏళ్ల వయసున్న ఆ బ్రిటిష్ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు మరో బ్రిటిష్ వ్యక్తి (30) కూడా కత్తిపోట్లకు గురయ్యాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. వీరిద్దరినీ పొడిచిన ఫ్రెంచి వ్యక్తి (29)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, హత్యకు కారణం ఏంటన్న విషయాలు తెలుసుకోడానికి తము ప్రయత్నిస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ రే రోవెదర్ తెలిపారు. పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత నిందితుడు వాళ్లను ఎదుర్కోడానికి ప్రయత్నించడంతో బాగా కష్టపడాల్సి వచ్చింది. సుమారు 30 మంది వ్యక్తులు అక్కడి పరిస్థితిని చూసి హడలిపోయారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేసేందుకు వీలుగా బ్రిటిష్ కాన్సులేట్‌ను తాము సంప్రదిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతడు తప్ప వేరే నిందితులు ఎవరి కోసం ఈ కేసులో గాలించడం లేదని రోవెదర్ చెప్పారు. -
వింత వ్యాధితో నిత్యం నరకం..!
యూకేకు చెందిన రోడ్నీ, జూన్ దంపుతుల ముద్దుల కూతురు మండీ సెల్లార్స్. ఆమె పుట్టినప్పటి నుంచీ పేరెంట్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పుట్టుకతోనే మెకాలు నుంచి పాదాల వరకు సాధారణ వ్యక్తుల కంటే ఐదు రెట్లు ఎక్కవగా ఉన్న భాగాలతో ఉంది. ఆమెను వింత వ్యాధి బాధిస్తోంది. గతంలో నా కాళ్లు 17 స్టోన్స్ వరకు పెరిగాయి, చికిత్స తర్వాత 11 స్టోన్ కు తగ్గింది. ఇక అంతా హ్యాపీగా సాగుతుందని ధీమాగా ఉన్నట్లు చెప్పింది. పుట్టినప్పటి నుంచీ ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం ఇప్పటికీ దొరకటం లేదని బాధితురాలు సెల్లార్స్(41) ఆవేదన వ్యక్తం చేసింది. 2010లో దురదృష్టవశాత్తూ ఆమె ఎడమకాలుకు ఏదో ఇన్ఫెక్షన్ సోకడంతో తొలగించారు. కానీ, తొలగించిన భాగం మళ్లీ తిరిగి పెరుగుతుండటం ఆమెను మరింత ఆందోళనకు గురిచేసింది. నడుము నుంచి ఆ పై అవయవాలు కంట్రోల్ లో ఉన్నా, కింది అవయవాలు ఆమెను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేశాయి. అయితే ఇటీవల ఆర్ఎస్పీసీఏ సంస్థ వాలంటీర్స్ అందించిన డ్రగ్ వాడకంతో సిక్స్ స్టోన్ లెగ్స్ ను సాధ్యం చేసుకున్నానని చెప్పింది. ప్రస్తుతం తాను సరైన దారిలోనే ఉన్నాను. గతంలో తన కోసం ప్రత్యేకంగా దుస్తులు, షూస్ తయారు చేయించాల్సి వచ్చేదని.. భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండక పోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది. చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డా కూడా చదువు మానలేదని, యూనివర్సిటీ ఆఫ్ లాంకషైర్ లో సైకాలజీ పూర్తి చేశానని అంటోంది. అసలు తనకు ఏమైందో తెలుసుకునేందుకే ఈ జీవితం మొత్తం సరిపోదని, ప్రస్తుతం తన కాళ్లు చాలా సన్నగా మారుతున్నాయని ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. రెండేళ్ల కిందట వాడిన మెడిసిన్ తనలో ఈ మార్పులు తీసుకొచ్చాయని, ఇప్పుడు ఎవరి సాయం లేకుండా ఇంట్లో అటూ ఇటూ తిరగడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చింది. డాక్టర్లు మాత్రం ఆమె పూర్తిగా అందిరిలా మారుతుందని గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. -
హనీమూన్ లో విషాదం..
బ్యాంకాక్: హనీమూన్ కోసం భర్తతో పాటు విదేశానికి వెళ్లగా అక్కడ విషాదం చోటుచేసుకుంది. బ్రిటన్ కు చెందిన మోనికా ఒ.కార్నర్ తన భర్తతో థాయ్ లాండ్ కు వెళ్లింది. అక్కడ జరిగిన బోట్ ప్రమాదంలో కొత్త జంటలో భార్య, మరో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. కో సమూయ్ తీరంలో పడవలో భార్యాభర్తలు గురువారం సాయంత్రం షికారుకు బయలుదేరారు. వీరితో పాటు మరికొందరు పర్యాటకులు ఉన్నారు. 32 మంది టూరిస్టులు, నలుగురు సిబ్బందితో బోట్ బయలుదేరగా వాతావరణం అనుకూలించకపోవడంతో బోట్ మునిగిపోయిందని కెప్టెన్ గా సనన్ సీకాకియా వ్యవహరించారు. పడవ ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి చాలా మందిని త్వరగానే రక్షించినట్లు సమాచారం. జర్మనీకి చెందిన వ్యక్తితో పాటు, హాంకాంగ్ కు చెందిన యువతి కూడా మృతిచెందారని టూరిస్ట్ పోలీసులు వెల్లడించారు. వివాహం మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి వచ్చిన మరో జంట కూడా ఈ ఘటనలో తప్పిపోయారని వారి కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిందని బోటు కెప్టెన్ చెప్పారు. పూజా పార్నెల్, మోనికా భర్తల వివరాలు తమకు అందుబాటులో లేవని వెల్లడించారు. -
'సూసైడ్ బాంబర్ కావాలనుంది'
లండన్: ఐఎస్ఐఎస్ తొలి మహిళా సూసైడ్ బాంబర్ కావాలని ఉందని బ్రిటన్‌కు చెందిన 46 ఏళ్ల సాలీ జోన్స్ సోషల్ మీడియాలో హడలెత్తిస్తోంది. బ్రిటీష్ మీడియా 'మిసెస్ టెర్రర్'గా పేర్కొనే సాలీ జోన్స్ గతంలో సిరియాకు పారిపోయి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది. అమెరికా వైమానిక దాడిలో ఆమె భర్త హతమయ్యాడు. ఆ తర్వాత సూసైడ్ బాంబర్‌గా మారాలనుకున్న జోన్స్ ఇప్పుడు అమెరికా దళాలకు లక్ష్యంగా మారింది. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించే సాలీ జోన్స్ అమెరికాను హెచ్చరిస్తూ తరచూ పోస్ట్ చేస్తుంటుంది. భద్రతకు ముప్పుగా మారిన సాలీ జోన్స్ కోసం అమెరికా దళాలు వెంటాడుతున్నాయి. డ్రోన్ దాడుల్లో జోన్స్‌ను హతమార్చాలని లక్ష్యంగా చేసుకున్నాయి. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఆమె కూడా ఉంది. 2010లో చెచెన్యాలో రష్యా దళాలపై ఆత్మాహుతి దాడి చేసిన హవా బరయెవ్ను ప్రశంసించే జోన్స్ ఆమెలా అమెరికా దళాలపై దాడి చేయాలనుకుంటున్నట్టుగా బ్రిటీష్ మీడియా వెల్లడించింది. -
ముంబైలో బ్రిటన్ మహిళ పట్ల అసభ్య ప్రవర్తన
ముంబై మహానగరంలోని ఒషివారా ప్రాంతంలో బ్రిటన్ మహిళ (26) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి (36)ని సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి మంగళవారం ఇక్కడ వెల్లడించారు. నిందితుడిపై ఐపీసీ 354 సెక్షన్‌పై మహిళ పట్ల అసభ్యకర ప్రవర్తన కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తామన్నారు. పోలీసులు కథనం ప్రకారం... సోమవారం సాయంత్రం బ్రిటన్ మహిళ మరో ఇద్దరు మహిళలతో కలసి ఆటోలో ప్రయాణిస్తూ శ్రీజీ హోటల్ సమీపంలోకి చేరుకున్నారు. ఆ సమయంలో నిందితుడు బ్రిటన్ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో ముగ్గురు మహిళలు గట్టిగా అరిచారు. నిందితుడు బయపడి పరుగు లంకించుకోవడంతో స్థానికంగా గస్తీ తరుగుతున్నపోలీసు కానిస్టేబుళ్లు అప్రమత్తం అయ్యారు. నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు. నిందితుడు మీరా రోడ్డు ప్రాంతంలో నివసిస్తాడని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. అయితే బ్రిటన్ మహిళ ఏడాది నుంచి ముంబై నగరంలో నివసిస్తుందని తమతో తెలిపిందని ఆయన వెల్లడించారు. బాలీవుడ్ చిత్రాల్లో ఎక్సెట్రా డాన్సర్‌గా ఉంటూ జీవనం సాగిస్తుందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.