వింత వ్యాధితో నిత్యం నరకం..! | Brit woman with 17 STONE legs reveals they are finally shrinking and now weigh 11 STONE | Sakshi
Sakshi News home page

వింత వ్యాధితో నిత్యం నరకం..!

Published Wed, Jun 1 2016 6:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:25 AM

వింత వ్యాధితో నిత్యం నరకం..!

వింత వ్యాధితో నిత్యం నరకం..!

యూకేకు చెందిన రోడ్నీ, జూన్ దంపుతుల ముద్దుల కూతురు మండీ సెల్లార్స్. ఆమె పుట్టినప్పటి నుంచీ పేరెంట్స్ చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పుట్టుకతోనే మెకాలు నుంచి పాదాల వరకు సాధారణ వ్యక్తుల కంటే ఐదు రెట్లు ఎక్కవగా ఉన్న భాగాలతో ఉంది. ఆమెను వింత వ్యాధి బాధిస్తోంది. గతంలో నా కాళ్లు 17 స్టోన్స్ వరకు పెరిగాయి, చికిత్స తర్వాత 11 స్టోన్ కు తగ్గింది. ఇక అంతా హ్యాపీగా సాగుతుందని ధీమాగా ఉన్నట్లు చెప్పింది. పుట్టినప్పటి నుంచీ ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం ఇప్పటికీ దొరకటం లేదని బాధితురాలు సెల్లార్స్(41) ఆవేదన వ్యక్తం చేసింది.

2010లో దురదృష్టవశాత్తూ ఆమె ఎడమకాలుకు ఏదో ఇన్ఫెక్షన్ సోకడంతో తొలగించారు. కానీ, తొలగించిన భాగం మళ్లీ తిరిగి పెరుగుతుండటం ఆమెను మరింత ఆందోళనకు గురిచేసింది. నడుము నుంచి ఆ పై అవయవాలు కంట్రోల్ లో ఉన్నా, కింది అవయవాలు ఆమెను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేశాయి. అయితే ఇటీవల ఆర్ఎస్పీసీఏ సంస్థ వాలంటీర్స్ అందించిన డ్రగ్ వాడకంతో సిక్స్ స్టోన్ లెగ్స్ ను సాధ్యం చేసుకున్నానని చెప్పింది. ప్రస్తుతం తాను సరైన దారిలోనే ఉన్నాను. గతంలో తన కోసం ప్రత్యేకంగా దుస్తులు, షూస్ తయారు చేయించాల్సి వచ్చేదని.. భవిష్యత్తులో అలాంటి అవసరం ఉండక పోవచ్చునని ఆశాభావం వ్యక్తం చేసింది.

చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డా కూడా చదువు మానలేదని, యూనివర్సిటీ ఆఫ్ లాంకషైర్ లో సైకాలజీ పూర్తి చేశానని అంటోంది.
అసలు తనకు ఏమైందో తెలుసుకునేందుకే  ఈ జీవితం మొత్తం సరిపోదని, ప్రస్తుతం తన కాళ్లు చాలా సన్నగా మారుతున్నాయని ఆనందంగా ఉన్నట్లు చెప్పింది. రెండేళ్ల కిందట వాడిన మెడిసిన్ తనలో ఈ మార్పులు తీసుకొచ్చాయని, ఇప్పుడు ఎవరి సాయం లేకుండా ఇంట్లో అటూ ఇటూ తిరగడం సాధ్యమవుతుందని చెప్పుకొచ్చింది. డాక్టర్లు మాత్రం ఆమె పూర్తిగా అందిరిలా మారుతుందని గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement