దొంగలందు మంచి దొంగలు వేరయా! | Thieves theft british womans bike | Sakshi
Sakshi News home page

దొంగలందు మంచి దొంగలు వేరయా!

Published Sun, Aug 13 2017 12:28 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

దొంగలందు మంచి దొంగలు వేరయా! - Sakshi

దొంగలందు మంచి దొంగలు వేరయా!

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని వేమన చెప్పినట్లే దొంగలందు మంచి దొంగలు వేరయా అని చెప్పక తప్పదేమో ఈ సంఘటన చూస్తుంటే.. దొంగిలించుకెళ్లిన బైక్‌ను తిరిగి తీసుకురావడమే కాకుండా దానిలో తిరిగి పెట్రోల్‌ ట్యాంక్‌ ఫుల్‌ చేసి, కొత్త తాళం చేయించి పెట్టి క్షమాపణలు కోరుతూ ఓ లేఖ కూడా రాసి పెట్టిపోయారు ఇద్దరు దొంగలు. తాము ఏ యువకుడిదో ఆ బైక్‌ అనుకుని పొరబడ్డామని అందుకు క్షమిం చాలని ఆ లేఖలో బాధితులను కోరారు. రెండు వారాల క్రితం మెల్‌ ఫిషర్‌ అనే బ్రిటన్‌ మహిళ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఒక పోస్ట్‌ చేసింది.

తన ప్రియుడి కుమారుడి బైక్‌ను ఎవరో దొంగిలించుకెళ్లారని, దయచేసి ఆ బైక్‌ కనిపిస్తే వివరాలు అందించాలని పోస్ట్‌లో కోరారు. అయితే, ఆమె అలా పోస్ట్‌ చేసిన వారం రోజుల్లోనే అనూహ్యంగా ఒక రోజు ఆ పిల్లాడి బైక్‌ ఇంటిముందే కనిపించింది. పైగా దానికి కొత్త తాళం చెవి చేయించి ఉండటంతోపాటు ఫుల్‌గా పెట్రోల్, ఓ క్షమాపణ పత్రం కనిపించింది. దీంతో మెల్‌ ఫిషర్, ఆమె ప్రియుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘మీ కుమారుడి బైక్‌ దొంగిలించినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాం.

వాస్తవానికి మేం చేసిన తప్పు క్షమార్హం కాకపోయినప్పటికీ వివరణ ఇచ్చుకుంటున్నాం. మేం ఎవరో టీనేజర్‌ బైక్‌ అనుకుని ఎత్తుకెళ్లాం. అయితే, మీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చూశాక వెంటనే మీ బైక్‌ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే మీ పిల్లాడి బైక్‌కు ఇక ఎవరూ దొంగిలించలేనంత బలమైన తాళాన్ని కొనుగోలు చేశాం. తాళాలు బైక్‌లో పెట్టాము. మీరు సూచించిన చోట బైక్‌ ఇవ్వలేకపోతున్నాం. కానీ, ఈ బైక్‌ చూశాకనైనా గుండెపగిలిన మీ పిల్లవాడు సంతోషపడతాడని భావిస్తున్నాం’ అంటూ ఆ లేఖలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement