
ముంబై: ముంబైలోని దారుణం చోటు చేసుకుంది. ఓ నవజాత శిశువు మృతదేహాన్ని టాయిలెట్ వద్ద గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై మైనర్ బాలిక ప్రియుడు, ఆమె తల్లిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మలాడ్ ఈస్ట్‌లోని దుధనాథ్ దూబే చావల్ వద్ద స్థానికులు ఓ నవజాత శిశువు మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో.. మూడు మహిళా పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా ఉన్న రెండు కుటుంబాలను పోలీసులు గుర్తించారు.
కొన్ని నెలలు తల్లీ కూతుళ్లు వారు ఉండే అద్దె ఇంటికి వెళ్లడం లేదని తెలుసుకున్నట్లు కురార్ స్టేషన్ పోలీస్ అధికారి తెలిపారు. 16 ఏళ్ల బాలిక గర్భవతి అని, ఆమె తన అకాల శిశువును మలాడ్‌లోని పబ్లిక్ టాయిలెట్ సమీపంలో వదిలిపెట్టిందని పోలీసులు తెలుసుకున్నారు. ఆ ఇద్దరిని నలసోపర వరకు ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఓ 20 ఏళ్ల యువకుడితో పరిచయం ఉన్నట్లు ఆ అమ్మాయి తెలిపింది. అయితే ఆమెకు ఆరవ నెలలో ప్రియుడు, ఆమె తల్లి అబార్షన్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపింది. అయితే ఆ అమ్మాయి చనిపోయిన శిశువును ప్రసవించింది. ఈ విషయాలు అమ్మాయి తల్లికి తెలుసు. అయితే మృతదేహాన్ని పారవేసిన వారు మలాడ్ నుంచి పారిపోయారని పోలీసు అధికారి అన్నారు. ఐపీసీ సెక్షన్ 321 కింద బాలిక తల్లి, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment