
ముంబై: కామాంధులకు కన్నుమిన్ను కానదన్నది మరోమారు నిరూపించారు మహారాష్ట్రకు చెందిన నలుగురు వ్యక్తులు. మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వు ఫారెస్టులో వేటకు వెళ్లిన నలుగురు వేటగాళ్లు కామంతో బెంగాల్ మానిటర్ బల్లిపై సామూహిక అత్యాచారం జరిపారని అధికారులు చెప్పారు. వీరిని సందీప్ తుకారాం, పవార్ మంగేశ్, జనార్ధన్, అక్షయ్ సునీల్‌గా గుర్తించారు.
అడవిలో అనుమతి లేకుండా సంచరిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్న అటవీ అధికారులు వీరి మొబైల్స్‌ను చెక్ చేశారు. వీరంతా కలిసి బల్లిని గ్యాంగ్ రేప్ చేసిన వీడియో చూసిన అధికారులు వీరిపై కేసు నమోదు చేశారు. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం బెంగాల్ మానిటర్ లిజార్డ్‌ను రిజర్వ్‌డ్ జాతిగా గుర్తించారు. వీరి నేరం రుజువైతే 7ఏళ్ల కారాగార శిక్ష పడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment