
కవి కుమార్ ఆజాద్
ముంబై : ప్రముఖ హిందీ బుల్లితెర హాస్య నటుడు కవి కుమార్ ఆజాద్ కన్నుమూశారు. సోమవారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించారు. హిందీ సీరియల్ ‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’లో డా. హన్షరాజ్ హాథీ పాత్రతో ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారాయన. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబై మీరా రోడ్‌లోని వక్రదంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న రాత్రి కోమాలోకి వెళ్లిన ఆయన సోమవారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన నటించిన ‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అత్యధిక ఎపిసోడ్స్ ప్రసారమైన సీరియల్‌గా ఈ రికార్డును నెలకొల్పింది. కేవలం బుల్లితెర మీదే కాకుండా ఆమిర్ ఖాన్ కథానాయకునిగా నటించిన మేలా, ఫన్‌తూస్ వంటి సినిమాలలో కవి కుమార్ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment