'పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయితే'.. ఆసక్తి పెంచుతోన్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్! | Youthful Entertainer Before Marriage Ready Release On This Date | Sakshi
Sakshi News home page

Before Marriage: ఆసక్తి పెంచుతోన్న బీఫోర్ మ్యారేజ్.. రిలీజ్ ఎప్పుడంటే?!

Jan 23 2024 7:49 PM | Updated on Jan 24 2024 9:18 AM

Youthful Entertainer Before Marriage Ready Release On This Date - Sakshi

భరత్, నవీన రెడ్డి జంటగా నటిస్తోన్న చిత్రం బీఫోర్ మ్యారేజ్'. ఈ చిత్రానికి  శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‍హనుమ క్రియేషన్ బ్యాన‌ర్‌పై ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో  నిర్మాత ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. 'గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది 'హనుమాన్' చిత్రం కొన‌సాగించిన‌ ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్‌కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా' అని అన్నారు. ద‌ర్శ‌కుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'పెళ్లికి ముందు త‌ప్పు అనిపించ‌ని పొర‌పాటు.. లైఫ్‌లో ఒక్క‌సారిగా ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయని.. అదే విష‌యాన్ని వాస్తవానికి దగ్గరగా తెరకేక్కించాం. టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాగా చేశారు సినిమా హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.' అని అన్నారు. 

నిర్మాత జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 'చిన్న విష‌య‌మే క‌దా అని యువ‌త పెడ‌దోవ ప‌డితే ఏం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల‌ ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సినిమాలో సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్ట‌వుతుంది. యువ‌తీయువ‌కుల‌కు మంచి మెసెజ్ ఉంటుంది. మా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో అపూర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. పోస్టర్‌ చూడగానే యూత్‌కు మంచి సందేశాన్నిచ్చే చిత్రంలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బీఫోర్ మ్యారేజ్‌ అనే టైటిల్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. పెళ్లికి ముందే అమ్మాయి ప్రెగ్నెంట్‌ అయితే ఈ సోసైటీ ఎలా చూస్తుందనే సామాజిక కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement