apurva
-
పెళ్లయి మూడు నెలలు కాలేదు.. వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన నటి
ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేమంటారు. అలాగే బ్రేకప్, విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఎందుకు వస్తున్నాయో ఎవరూ ఊహించలేకపోతున్నారు. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్, నటి దివ్య అగర్వాల్ మనసు రెండేళ్లక్రితమే ముక్కలైంది. ప్రియుడు వరుణ్ సూద్‌తో నడిపిన నాలుగేళ్ల ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పెట్టింది. తాను కోరుకున్న విధంగా, సొంతంగా జీవించాలనుకుంటున్నా అని 2022 మార్చి 6న బ్రేకప్ వార్తను బయటపెట్టింది.పెళ్లయి మూడు నెలలు కాలేదుతర్వాత వ్యాపారవేత్త అపూర్వ పడ్గాంకర్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరికీ 2022లో నిశ్చితార్థం జరగ్గా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఓ షోలో కూడా తనను అర్థం చేసుకునే భర్త దొరికాడంటూ పొంగిపోయింది నటి. కానీ అంతలోనే సడన్ షాకిచ్చింది. పెళ్లయిన మూడు నెలలకే తన వివాహ ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో నుంచి తీసేసింది. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నమ్మలేకపోతున్నాం..మొన్నే పెళ్లయింది? అంతలోనే ఏంటీ ఘోరం? అని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం మొన్నే కదా కలిసి నవ్వుతూ ఫోటోలకు పోజిచ్చారు.. ఇంతలోనే ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అయితే కాదు కదా.. అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: అతిలోక సుందరితో ముగ్గురు హీరోయిన్లు.. ఎవరో గుర్తుపట్టారా? -
'పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే'.. ఆసక్తి పెంచుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
భరత్, నవీన రెడ్డి జంటగా నటిస్తోన్న చిత్రం బీఫోర్ మ్యారేజ్'. ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హనుమ క్రియేషన్ బ్యానర్‌పై ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ ఫిలించాంబర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. 'గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది 'హనుమాన్' చిత్రం కొనసాగించిన ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్‌కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటు.. లైఫ్‌లో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని.. అదే విషయాన్ని వాస్తవానికి దగ్గరగా తెరకేక్కించాం. టీమ్‌లో ప్రతి ఒక్కరూ బాగా చేశారు సినిమా హిట్టవుతుందన్న నమ్మకం ఉంది.' అని అన్నారు. నిర్మాత జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 'చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్టవుతుంది. యువతీయువకులకు మంచి మెసెజ్ ఉంటుంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో అపూర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. పోస్టర్ చూడగానే యూత్‌కు మంచి సందేశాన్నిచ్చే చిత్రంలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బీఫోర్ మ్యారేజ్ అనే టైటిల్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. పెళ్లికి ముందే అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఈ సోసైటీ ఎలా చూస్తుందనే సామాజిక కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. -
ఎంటర్టైనింగ్.. ఎంగేజింగ్
కార్తీక్ ఆనంద్, డింపుల్, షాలినీ, మున్నా, అపూర్వ ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘యురేక’. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో ప్రశాంత్ తాత, లలితకుమారి నిర్మిస్తోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ –‘‘ఈ చిత్రానికి కథే బలం. యూత్‌ఫుల్ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంలో జరిగే కథ ఇది. యురేక అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చే హ్యాపీనెస్.మా సినిమాలో అదేంటన్నది సస్పెన్స్’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘మా చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అవుట్‌పుట్ చాలా బాగా వస్తోంది. ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం. జులై ఫస్ట్ వీక్‌లో సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘హీరోయిన్గా ఇది నా రెండో చిత్రం. ఇందులో నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు డింపుల్. ఈ చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, కెమెరా: విశ్వ. -
ఫైనల్లో మలిష్క, అపూర్వ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో మలిష్క, అపూర్వ ఫైనల్‌కు చేరుకున్నారు. మొయినాబాద్‌లోని శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో మలిష్క 6–3, 6–0తో అమూల్యపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో అపూర్వ వేమూరి 6–4, 6–1తో అభయ వేమూరిని ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. బాలుర సెమీఫైనల్ మ్యాచ్‌లలో జై అర్జున్ 4–6, 6–2, 6–2తో వరుణ్‌పై, రోహన్ కుమార్ 6–1, 6–1తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలుపొంది ఫైనల్లో ప్రవేశించారు. మరోవైపు బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో రోహన్ కుమార్– సిద్ధార్థ్ రెడ్డి ద్వయం 6–1, 6–1తో నరైన్ వర్మ– రిషిక్ జంటపై గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో మోహిత్ సాయి చరణ్– ప్రతినవ్ జంట 2–6, 6–2, 11–9తో సాధిష్ట లింగ– రాజేశ్వర్ రెడ్డి జోడీపై, వర్షిత్ కుమార్– ఆర్యంత్ రెడ్డి జంట 6–4, 6–1తో ఆది కపూర్– శ్రేయస్ శంకర్ జోడీపై, వరుణ్– కుషాల్ జంట 6–4, 2–6, 10–7తో జై అర్జున్– రోహన్ గాంధీ జోడీపై గెలిచాయి. -
ప్రేమ లేని 'లవ్'
తల్లిదండ్రుల దగ్గర ప్రేమ ఉంది. అది వాళ్లు ఇవ్వలేదు. వాడి దగ్గర లవ్ ఉంది. కానీ అందులో ప్రేమలేదు. లవ్‌లో ప్రేమ లేకపోవడం ఏంటి? అంతేమరి! ఈ రోజుల్లో లవ్‌కి డెప్త్ ఉండడం లేదు. నాలుగు రోజులు కలిస్తే చాలు ‘ఐ లవ్ యూ’ చెప్పేస్తున్నారు. ఆ తర్వాత... బాధ్యత తీసుకునే సమయానికి... ఆ లవ్ లో ప్రేమ లేదని అర్థమౌతుంది. ప్రేమ ఒక ఫాస్ట్ ఫుడ్ అయింది. శాటిస్ఫ్యాక్షన్ తప్ప, న్యూట్రిషన్ ఉండడం లేదు. ప్రేమ ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ అయింది. చూపులకు తప్ప, మనసుకు అందడం లేదు. ఎమోషనల్‌గా నిలబెట్టే ప్రేమ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే ఉంటుంది. ఆ రుచిని పిల్లలకు ఒక్కసారి చూపిస్తే... పిల్లలు గుర్తిస్తారు.. అర్థం చేసుకుంటారు.. బయటి ప్రేమలకు... బలి కాకుండా ఉంటారు. కారు వేగంగా వెళ్తోంది.సుధాకర్ దంపతుల ఆలోచనలు అంతకంటే వేగంగా సాగుతున్నాయి. ‘డ్రైవర్ త్వరగా పోనివ్వు’ అంది వసుంధర. ‘ఈ తొందర అప్పుడే పడి ఉంటే అపూర్వకి ఈ కష్టం వచ్చేది కాదు’ అన్నాడు సుధాకర్. ‘సరే... నేను తొందరగా తెలుసుకోలేదు మరి మీకేమైంది’ రెట్టించింది వసుంధర. ‘నాకేమైందా? ఆఫీసు, బిజినెస్సు సెట్ చేయకపోతే మనకివన్నీ ఉండేవా?’ సుధాకర్ గొంతులో అసహనం. ‘అయితే... నేను చేసిన పని... పని కాదా? నేను లేకుండానే ఇవన్నీ సమకూర్చగలిగారా’ వసుంధర స్వరంలో ఆవేశం. ‘వద్దులే... వసుంధరా! నీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే గొడవ’ ‘అవును. గొడవంతా నాదే... అందుకే ఆపూర్వకి ఇంత కష్టం వచ్చింది’ ఏడుపు ఆపుకుంటోంది వసుంధర. ఇంతలో కారు అపూర్వ ఇంటి ముందాగింది. ‘‘అమ్మా..’’ అంటూ ఒక్కసారిగా అమ్మ మీద వాలిపోయింది అపూర్వ. కూతుర్ని గట్టిగా హత్తుకుంది వసుంధర. కూతుర్ని చూసి షాక్ తిన్నాడు సుధాకర్. అపూర్వ ముఖమంతా ఎర్రగా కందిపోయి ఉంది. కళ్ల దగ్గర చర్మం నల్లగా కమిలిపోయి ఉంది. కూతుర్ని ఇద్దరూ కాసేపు అనునయించారు. సోఫాలో కూర్చోబెట్టారు. కూతురికి ఇటొకరు, అటొకరు కూర్చున్నారు. ‘‘రాహుల్ ఎక్కడ?’’ అని అడిగాడు సుధాకర్. ‘‘తెలీదు.. కొట్టేసి, వెళ్లిపోయాడు’’ అంది అపూర్వ. ఆమె ఒళ్లంతా వాతలు తేలి ఉన్నాయి. గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. అపూర్వ ఏడుపు ఆపుకోలేకపోతోంది. ‘‘వెళ్లిపోదాం... నేనూ మీతో వచ్చేస్తా’’ అంటోంది అమ్మానాన్నలతో. ‘‘ఏమైంది అపూర్వా?’’ అని అడిగింది వసుంధర. ఏమైందో తెలుసుకోవాలంటే కథ కొద్దిగా వెనక్కు నడవాలి. లవ్ ఎట్ ఫస్ట్ ఫైట్ అపూర్వ బీటెక్ థర్డ్డ్ ఇయర్. రాహుల్ ఫైనలియర్. ఆ యేడే కాలేజీ మారి కొత్త కాలేజీకి వచ్చింది. అపూర్వ, రాహుల్ క్యాంటిన్లోనో, లైబ్రరీలోనో ఒకరికొకరు ఎదురుపడేవారు తప్ప పరిచయం లేదు. ఓ రోజు అనుకోకుండా ఆ పరిచయమూ జరిగిపోయింది. కాలేజ్ క్యాంపస్‌లోనే అపూర్వను కొంతమంది సీనియర్స్ ఏవో కామెంట్స్ చేశారు. అంతే! అక్కడే ఉన్న రాహుల్... వాళ్లని లాగి ఒక్కటిచ్చాడు. ఆ స్టంట్‌కి మిగతా వాళ్లు బిత్తరపోయారు. అపూర్వ అబ్బురపడింది. రెండో రోజు కాలేజీకి మంచి గిఫ్ట్‌తో వచ్చింది. రాహుల్‌కి ఇచ్చింది. రాహుల్ ఆశ్చర్యపోయాడు. ‘వాళ్లనెందుకు కొట్టావ్?’ అని అడిగింది. ‘నిన్ను ఏడిపించారు కదా!’ అన్నాడు. ‘నన్ను ఏడిపిస్తే మీకేంటి?’ అని రెట్టించింది. ‘నీతో ఫ్రెండ్షిప్ చేయకపోయినా... నిన్ను రోజూ చూస్తుంటాను. ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో భలే సందడిగా ఉంటావ్. అది నాకు నచ్చింది’ అన్నాడు. మరికొంత సేపు ఇద్దరి మధ్యా సంభాషణ నడిచింది. ‘ఫ్రెండ్స్?’ అంటూ చేయి చాపింది. ‘ఫ్రెండ్స్’ అంటూ చేయి కలిపాడు. ఆ రోజు నుంచి ఆ ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. అపూర్వ మీద అమితమైన అటెన్షన్ చూపేవాడు రాహుల్. ఆమెకు నచ్చింది చేసేవాడు. మెచ్చింది తెచ్చేవాడు. సొంత అమ్మానాన్న కూడా అపూర్వ మీద ఎప్పుడూ అంత అటెన్షన్ పే చెయ్యలేదు. ఏదైనా చెబుతుంటే కనీసం వినేవాళ్లు కాదు. నాన్న బిజీ, అమ్మ బిజీ. కోరినవన్నీ సమకూర్చేవారు. కూతురితో టైమ్ మాత్రం స్పెండ్ చేసేవాళ్లు కాదు. ఇలా.. ప్రతి విషయంలో తన పేరెంట్స్‌ని రాహుల్‌తో పోల్చి చూసుకోవడం అలవాటైంది అపూర్వకు. అమ్మానాన్నల కంటే రాహులే తనకు దగ్గరగా ఉన్నట్లు అనిపించేవాడు.సినిమాలు, షికార్లు, పార్టీలు, పబ్‌లు.. అపూర్వ ఏది అడిగినా క్షణాల్లో వచ్చి వాలేవాడు రాహుల్. ఫ్రెండ్షిప్ కాస్తా లవ్‌గా మారిపోయింది. చివరికి ఒకరిని విడిచి ఒకరం ఉండలేమనే నిశ్చయానికీ వచ్చేశారు. పెళ్లి చేసుకోవాలని ప్రామిస్ చేసుకున్నారు. రాహుల్ ఫైనలియర్ ఎగ్జామ్స్ అవగానే పెళ్లి చేసుకున్నారు... ఇరువైపుల పెద్దల అనుమతి లేకుండానే... వాళ్లు రాకుండానే! పెళ్లయ్యాక సెకండ్ ఫైట్ ఫైనలియర్ రిజల్ట్స్ రాకముందే ఫ్రెండ్ సహాయంతో చిన్న కంపెనీలో ఉద్యోగంలో చేరాడు రాహుల్. ఓ నెల రోజులు బాగా గడిచాయి. రెండో నెలలో కీచులాటలు మొదలయ్యాయి. మూడో నెలలో మాటల యుద్ధం ప్రారంభమైంది. పెళ్లికి ముందు అపూర్వ మీద చూపించిన అటెన్షన్‌ను పెళ్లి తర్వాత ఉద్యోగం మీద చూపించాల్సి వచ్చింది రాహుల్‌కి. చాలీచాలని జీతంతో అపూర్వను సంతోష పెట్టడం కత్తి మీద సామైంది రాహుల్‌కి. పార్ట్ టైమ్ జాబూ వెదుక్కున్నాడు. ఆ ఒత్తిడితో తరచు అపూర్వను విసుక్కుంటున్నాడు. పెళ్లికి ముందు ఏం చేసినా మెచ్చుకున్న రాహుల్ ఇప్పుడు ఏం చేయకపోయినా తప్పు పడుతున్నాడు. తనతో గంటలుగంటలు గడిపిన అతను ఇప్పుడు ఒక్క నిముషంగా కూడా టైమ్ ఇవ్వలేకపోతున్నాడు. అలసిపోయి ఇంటికొచ్చిన భర్తను తనకు తెలీకుండానే సతాయించేది. ఒక వైపు పని ఒత్తిడి.. ఇంకోవైపు.. తన కన్నా పెద్దవాళ్లు అక్క, అన్న ఉండగానే డబ్బున్న అమ్మాయి దొరికిందని పెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకున్నాడనే నిందలు! అవన్నీ పట్టించుకోక ఇంటికొస్తే అపూర్వ సాధింపు. తట్టుకోలేక తాగుడికి అలవాటుపడ్డాడు. ఇంట్లో అపూర్వ కొంచెం గట్టిగా మాట్లాడినా.. ఎదురుగా ఉన్న వస్తువులను నేలకేసి కొట్టేవాడు. కోపం ఆవేశంగా మారి చివరకు అపూర్వను చేయి చేసుకునేదాకా వెళ్లింది. కొద్దిరోజులకే అది సర్వసాధారణం అయింది. కొట్టానన్న బాధతో మళ్లీ బార్కి వెళ్లేవాడు. బర్త్‌డే రోజు ఫైనల్ ఫైట్ తాగి ఆఫీస్‌కి వస్తున్నాడని ఒకరోజు రాహుల్‌ని ఉద్యోగంలోంచి తీసేశారు. ఆరోజు అపూర్వ బర్త్‌డే. సాయంకాలం తన కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తెస్తాడని ఆశగా ఎదురు చూసింది. కాని అక్కడ సీన్ మారింది. ఉద్యోగం ఊడిపోయిన బాధలో ఫుల్లుగా తాగొచ్చాడు రాహుల్. ఆ విషయాన్ని గ్రహించక... ఒట్టి చేతులతో వచ్చిన భర్త మీద విరుచుకు పడింది. తనంటే కాకుండా తన వెనకున్న డబ్బును చూసి పెళ్లి చేసుకున్నావంటూ తిట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లాం బర్త్‌డేకి ఓ గిఫ్ట్ కొనివ్వలేని నువ్వే భర్తవంటూ ఈసడించుకుంది. దానికి అపూర్వ మీద పిడిగుద్దులతో సమాధానమిచ్చింది రాహుల్ ఆవేశం. హతాశురాలైంది. భరించలేకపోయింది. వెంటనే ఆమ్మానాన్నలకు ఫోన్ చేసింది. ఆలోచనలో అమ్మానాన్న రాహుల్‌కి ఫోన్ చేసి, కొన్నాళ్లు అపూర్వ తమతో ఉంటుందని చెప్పి, అతడి అనుమతితో కూతుర్ని ఊరికి తెచ్చేసుకున్నారు సుధాకర్, వసుంధర. లోపల గదిలో అపూర్వ నిద్రపోతోంది. భార్యాభర్తలిద్దరూ ఆలోచనలో పడిపోయారు. ఇద్దరి ఆలోచనలూ ఒకే విధంగా సాగుతున్నాయి. కూతురి జీవితం ఇలా కావడానికి తామే కారణం అని వారికి అనిపిస్తోంది. అవును... ఆ పిల్ల మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టారని? సొంత కంపెనీని డెవలప్ చేసే పనిలో పడి అపూర్వను పట్టించుకోనేలేదిద్దరూ. నానమ్మ, అమ్మమ్మ, ఆయాల వంతుల వారీ పెంపకంతో అమ్మానాన్న ప్రేమకు దూరమైంది అపూర్వ. విలువైన సమయానికి బదులు ఖరీదైన కానుకలతో కూతురిని సంతోషపెట్టే ప్రయత్నం చేశారు. దాంతో పెంకితనం అలవడింది. ఏదడిగితే అది క్షణాల్లో హాజరవకపోతే హఠం చేసేది. ఫ్రెండ్స్‌తో ఎక్కువ గడపడం మొదలుపెట్టింది. పరాయి వాళ్లు తన మీద ఏ కాస్త శ్రద్ధ పెట్టినా.. ఇట్టే చనువు పెంచేసుకునేది. నమ్మేసేది. ఆ క్రమంలోనే రాహుల్ పరిచయం అయ్యాడు. వాళ్ల ప్రేమ వ్యవహారం తెలిసి వారించేసరికే పరిస్థితి చేయి దాటి పోయింది. కూతురి ఆలోచనను కుదురు చేయాల్సింది పోయి పరువు తీసిందని పరాయిదాన్ని చేశారు. ఇంట్లోకి రానివ్వకుండా కట్టడి చేశారు. ఎంత తప్పు చేశారు? అపూర్వ నిద్రలో కాస్త కదిలింది. కూతురి కురుల్ని సవరించింది వసుంధర. చక్క దిద్దాల్సిన వాటి గురించి ఆలోచిస్తున్నాడు సుధాకర్. -
సెమీస్‌లో అపూర్వ, నిర్మల
రాష్ట్ర స్థాయి సీనియర్ క్యారమ్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్థాయి సీనియర్ గ్రీన్ క్యారమ్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ అపూర్వ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆరుసార్లు జాతీయ చాంపియన్ నిర్మల కూడా తన పునరాగమనాన్ని విజయాలతో ప్రారంభించింది. రెండేళ్ల తర్వాత తిరిగి బరిలోకి దిగిన ఆమె కూడా సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎస్.అపూర్వ (ఎల్ఐసీ) 25–0, 25–0తో బి. శ్రీవిద్యపై గెలుపొందగా... పి. నిర్మల (ఎల్ఐసీ) 25–6, 25–0తో తేజస్వి (ఆక్సెంచర్)ని ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నందిని (డెలాయిట్) 24–7, 25–2తో శ్రీచందనపై, సవితా దేవి (పోస్టల్) 25–0, 25–0తో కె. పద్మజపై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో వి. అనిల్‌కుమార్, డి. రవీందర్ గౌడ్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వి. అనిల్ కుమార్ (ఏజీఏపీ) 25–4, 25–17తో ఎస్. సాయి (ఎస్ఎస్సీఏ)పై, రవీందర్ గౌడ్ (ఏజీఏపీ) 25–0, 25–1తో సయ్యద్ జుబేర్ అహ్మద్‌పై నెగ్గారు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో సూర్యప్రకాశ్ 25–10, 25–18తో బిసిల్ ఫిలిప్స్‌పై, నవీన్ 25–18, 25–4తో అబ్దుల్పై, నజరుల్లా 22–8, 25–24తో ఎస్కే జాఫర్‌పై, ఎస్. ఆదిత్య 22–5, 11–16, 25–0తో వసీమ్‌పై, మొహమ్మద్ అహ్మద్ 24–5, 25–17తో కృష్ణపై, హకీమ్ 25–9, 17–20, 25–7తో దినేశ్బాబుపై విజయం సాధించారు. మరోవైపు రెండోరౌండ్లో సంచలన విజయం సాధించిన లలిత్ స్వామి మూడోరౌండ్ మ్యాచ్‌లో 0–25, 5–25తో సాయి (ఎస్ఎస్సీఏ) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్ ఫలితాలు ఎస్. సాయి–నరేశ్ ద్వయం 25–0, 22–17తో గిరిధర్– సునీల్ జంటపై, ఆర్.డి.దినేశ్ బాబు–ఎల్. సూర్యప్రకాశ్ ద్వయం 16–13, 25–18తో వి. అనిల్ కుమార్–సందీప్ జంటపై, హకీమ్–ఎ.శ్రీనివాస రావు ద్వయం 25–12, 21–8తో ప్రసాద్–ఇమ్రాన్ అలీ ఖాన్ జంటపై, మొహమ్మద్ అహ్మద్–మొహమ్మద్ ద్వయం 18–11, 22–3తో సయ్యద్ మోయిజ్–నజరుల్లా జంటపై గెలుపొందాయి. -
అపూర్వకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: క్యారమ్ ప్రపంచ చాంపియన్ అపూర్వకు బుధవారం ఘనసన్మానం జరిగింది. బర్మింగ్హమ్లో జరిగిన వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించిన తమ ఉద్యోగి అపూర్వను ఎల్ఐసీ ఘనంగా సన్మానించింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్, రీజనల్ మేనేజర్ మజర్ హుస్సేన్, హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్షుడు హరనాథ్‌తో పాటు పలువురు ఎల్ఐసీ సీనియర్ ఉద్యోగులు పాల్గొన్ని ఆపూర్వను అభినందించారు. ఎల్ఐసీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగానని ఈ సందర్భంగా అపూర్వ పేర్కొంది. వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఆమె మూడు స్వర్ణాలను సాధించింది. -
అపూర్వమైన ఐంద్రజాలికురాలు
ప్రతిభా కిరణం కర్నాటకలోని మంగళూరుకు చెందిన ఏడు సంవత్సరాల అపూర్వ ఇంద్రజాలంలో అసాధారణ ప్రతిభను కనబరుస్తూ అద్భుతాలను సృష్టిస్తోంది. అపూర్వ రెండు సంవత్సరాల వయసులో మ్యాజిక్ నేర్చుకోవడం ప్రారంభించింది. ఐదేళ్లకేదాదాపు 400 ప్రదర్శనలు ఇచ్చింది. ఎంతో నైపుణ్యం కలిగిన ఐంద్రజాలికులు ప్రదర్శించే హైడ్ అండ్ ఎస్కేప్‌ను ఈ సిసింద్రీ మూడు సంవత్సరాల వయసులోనే ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 10 తాళాలు వేసిన 10 అడుగుల పొడవైన గొలుసుతో ఆమె శరీరాన్ని చుడితే దాని నుండి సునాయాసంగా బయటపడి విజయం సాధించింది. నాలుగు సంవత్సరాల వయసులోనే కళ్ళకు గంతలు కట్టుకుని ఎలక్ట్రిక్ బైక్ నడిపింది. ఆమె వయసువారు బొమ్మలతో ఆడుకుంటుంటే అపూర్వ మాత్రం ఐంద్రజాల మాంత్రికులైన తన తల్లిదండ్రుల దగ్గర తన ఇంద్రజాల విద్యకు మెరుగులు దిద్దుకోసాగింది. అలా ఆమెకు ఇల్లే మ్యాజిక్ పాఠశాలగా మారిపోయింది. అపూర్వ ఇప్పుడు కళ్లకు గంతలు కట్టుకుని బైక్ నడపగలదు. గొలుసుల మధ్య బంధిస్తే అందులోంచి తప్పించుకోగలదు. ఖాళీ డబ్బాల్లోంచి చాక్లెట్లు సృష్టించగలదు. రుమాలును గాలిలో ఊపి పావురాన్ని తెప్పించగలదు. ఇలా ఎన్నో మాంత్రిక కృత్యాలు చేయగలదు. 2013లో జరిగిన అంతర్జాతీయ మ్యాజిక్ ఫెస్టివల్లో కె.లాల్ మెమోరియల్ ట్రోఫీ ఇచ్చి అపూర్వని సన్మానించారు.