ఫైనల్లో మలిష్క, అపూర్వ | malishka, apurva enter final | Sakshi
Sakshi News home page

ఫైనల్లో మలిష్క, అపూర్వ

Published Fri, May 26 2017 10:53 AM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

malishka, apurva enter final

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) అండర్‌–14 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో మలిష్క, అపూర్వ ఫైనల్‌కు చేరుకున్నారు. మొయినాబాద్‌లోని శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రాంగణంలో గురువారం జరిగిన బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో మలిష్క 6–3, 6–0తో అమూల్యపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో అపూర్వ వేమూరి 6–4, 6–1తో అభయ వేమూరిని ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది.

 

బాలుర సెమీఫైనల్‌ మ్యాచ్‌లలో జై అర్జున్‌ 4–6, 6–2, 6–2తో వరుణ్‌పై, రోహన్‌ కుమార్‌ 6–1, 6–1తో సిద్ధార్థ్‌ రెడ్డిపై గెలుపొంది ఫైనల్లో ప్రవేశించారు. మరోవైపు బాలుర డబుల్స్‌ క్వార్టర్స్‌లో రోహన్‌ కుమార్‌– సిద్ధార్థ్‌ రెడ్డి ద్వయం 6–1, 6–1తో నరైన్‌ వర్మ– రిషిక్‌ జంటపై గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. ఇతర క్వార్టర్స్‌ మ్యాచ్‌ల్లో మోహిత్‌ సాయి చరణ్‌– ప్రతినవ్‌ జంట 2–6, 6–2, 11–9తో సాధిష్ట లింగ– రాజేశ్వర్‌ రెడ్డి జోడీపై, వర్షిత్‌ కుమార్‌– ఆర్యంత్‌ రెడ్డి జంట 6–4, 6–1తో ఆది కపూర్‌– శ్రేయస్‌ శంకర్‌ జోడీపై, వరుణ్‌– కుషాల్‌ జంట 6–4, 2–6, 10–7తో జై అర్జున్‌– రోహన్‌ గాంధీ జోడీపై గెలిచాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement