తరుణ్, తానియాలకు టైటిళ్లు | Tarun And Tania Got AITA Titles | Sakshi
Sakshi News home page

తరుణ్, తానియాలకు టైటిళ్లు

Jun 29 2019 1:59 PM | Updated on Jun 29 2019 2:09 PM

Tarun And Tania Got AITA Titles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) టోర్నమెంట్‌లో తానియా సరాయ్, టి. తరుణ్‌ సత్తా చాటారు. సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో అండర్‌–14 బాలబాలికల విభాగాల్లో వీరిద్దరూ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. బాలుర ఫైనల్లో తరుణ్‌ 6–4, 6–4తో శ్రీశరణ్‌పై గెలుపొందగా... బాలికల కేటగిరీలో తానియా 6–2, 6–3తో లక్ష్మీశ్రీని ఓడించింది. అండర్‌–12 కేటగిరీలో వన్షిక మరియా, తిరుమురుగన్‌ విజేతలుగా నిలిచారు.

బాలుర తుదిపోరులో తిరుమురుగన్‌ 6–2, 6–2తో అనీష్‌ జైన్‌పై, బాలికల ఫైనల్లో వన్షిక 5–7, 6–4, 6–2తో రిషితపై విజయం సాధించారు. మరోవైపు బాలుర డబుల్స్‌ విభాగంలో మురళీ కౌశల్‌–భవ్యానంద్‌ రెడ్డి జంట... బాలికల విభాగంలో రిషిత–తోరిత చక్రవర్తి జంటలు చాంపియన్‌లుగా నిలిచాయి. ఆకాంక్ష–స్నిగ్ధ జోడీ, ఆరవ్‌–శ్రీవంత్‌ రెడ్డి జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. అండర్‌–14 బాలుర డబుల్స్‌ ఫైనల్లో ప్రణీత్‌ సింగ్‌–మిహిర్‌ పర్చా జోడీపై తరుణ్‌ కోర్‌వర్‌–శ్రీశరణ్‌ జంట... బాలికల విభాగంలో లక్ష్మీసిరి–పద్మ వేద జోడీపై తానియా సరాయ్‌–నైనిక రెడ్డి ద్వయం గెలుపొంది విజేతలుగా నిలిచాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement