
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో తలపడే భారత విశ్వవిద్యాలయాల టెన్నిస్ జట్టులో తెలంగాణ క్రీడాకారుడు పొన్నాల సిద్ధార్థ్ చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో చదువుతోన్న సిద్ధార్థ్ ఇటీవల జరిగిన ఆలిండియా యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా 2015–16, 2016–17 సీజన్ పోటీల్లో సిద్ధార్థ్ ఉస్మానియా యూనివర్సిటీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటలీలోని నపోలీలో జూలై 3 నుంచి ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment