
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–14 టాలెంట్ సిరీస్ టోర్నీలో తెలంగాణ ప్లేయర్ శౌర్య సామల ఆకట్టుకున్నాడు. నేరేడ్‌మెట్‌లోని రామ టెన్నిస్ అకాడమీలో జరిగిన ఈ టోర్నీలో 10 ఏళ్ల శౌర్య బాలుర సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు.
బుధవారం జరిగిన ఫైనల్లో శౌర్య 9–8తో ధరణి దత్తా (తెలంగాణ)పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 8–7తో అర్నవ్ బిష్ణోయ్‌పై, క్వార్టర్స్‌లో 6–1తో కోట శ్రీకాంత్ (ఏపీ)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment