సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ | Sai Dedeepya Pair In Semis of AITA Womens Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ

Published Thu, Mar 28 2019 3:30 PM | Last Updated on Thu, Mar 28 2019 3:30 PM

Sai Dedeepya Pair In Semis of AITA Womens Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు సాయిదేదీప్య, మౌలిక రామ్‌ నిలకడగా రాణిస్తున్నారు. బెంగళూరులో జరుగుతోన్న ఈ టోర్నీలో జంటగా బరిలోకి దిగిన వీరిద్దరూ డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల క్వార్టర్‌ ఫైనల్లో సాయిదేదీప్య–మౌలిక రామ్‌ ద్వయం 6–2, 7–6 (9/7)తో రాధిక యాదవ్‌ (హరియాణా)–స్నిగ్ధ (కర్ణాటక) జోడీపై విజయం సాధించి ముందంజ వేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement