before marriage
-
Before Marriage Review: 'బిఫోర్ మ్యారేజ్' మూవీ రివ్యూ
చిత్రం: బిఫోర్ మ్యారేజ్ విడుదల: జనవరి 26 నటీనటులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ... గాయనీగాయకులు: మంగ్లీ, సంథిల్య పిసపాటి, అపర్ణ నందన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రవికుమార్ గొల్లపల్లి, మ్యూజిక్: పీఆర్ డీవోపీ: రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి ఎడిటింగ్: అలోష్యాస్ క్సవెర్ పబ్లిసిటీ డిజైనర్: జేకే ఫ్రేమ్స్ పీఆర్ఓ: ఆశోక్ దయ్యాల యువతను ఆకర్షించే కథ, దానికి తోడు ఓ మెసెజ్ ఇస్తే సినిమాను బ్రహ్మండంగా హిట్ చేస్తారు ప్రేక్షకులు. సరిగ్గా అలాంటి సబ్జెక్టుతో వచ్చిన మూవీ 'బీఫోర్ మ్యారేజ్'. మూడు దశాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యానర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా పరిచయమవుతూ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన మూవీ 'బిఫోర్ మ్యారేజ్'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం. కథేంటి ధరణి (నవీన రెడ్డి) తన కాలేజీ ఫ్రెండ్స్ శాంతి, ప్రశాంతితో కలిసి ఒకే రూమ్ లో ఉంటూ చదువుకుంటుంది. కొత్త అలవాట్లు, ఎంజాయ్ మెంట్ కోరుకునే క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ధరణి పెగ్నెన్సీ అవుతుంది. పెళ్ళి కాకుండానే తల్లి అవుతుందటంతో ఆమె జీవితం తలక్రిందులు అవుతుంది. దీంతో సామాజిక ఒత్తిడికి లోనవుతుంది. జీవితం తలక్రిందులైనట్టు మారిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఆమె తండ్రి ఆమెను అంగీకరిస్తారా? అలాంటి పరిస్థితిని ఎలా ఈ యువతి అధిగమిస్తుందనేదే ఈ సినిమా కథ. నటీనటులు ప్రధాన పాత్రలో నటించిన నవీన రెడ్డి క్యూట్‌గా కనిపించింది. ఈ తరం అమ్మాయిల ఆలోచన దోరణి ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే చేసి చూపించింది. మెయిన్ లీడ్ పాత్రను సమర్థవంతంగా పోషించిందని చెప్పవచ్చు. అలాగే హీరో భారత్ ఆకాష్ పాత్రలో తన యాక్టింగ్‌తో యూత్‌ను ఎట్రాక్ట్ చేశాడు. చక్కగా, చలాకీగా కనిపించాడు. ఇక అపూర్వ తన పాత్ర తగ్గట్టుగా నటించి మెప్పించింది. ఇతర పాత్రలు తమ పరిది మేరకు నటించి మెప్పించారు. సాంకేతిక విభాగం ఈ సినిమాకు ముందుగా చెప్పుకోవాల్సింది మ్యూజిక్ గురించి. మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్ చేసిన పాటలు బాగున్నాయి. సింగర్ మంగ్లీ పాడిన పాట ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. 'ఇదేమి జిందగీ. రొటీన్‌గా ఉన్నది.." పాట బాగుంది. ఇక నాచురల్‌గా విజువల్స్ కనిపించేలా షూట్ చేసిన డీవోపీ రాజశేఖర్ రెడ్డి పనితీరు బాగుంది. అలోష్యాస్ క్సవెర్ ఎడిటింగ్ సరిగ్గా కుదిరిందని చెప్పొచ్చు. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. స్క్రీన్ అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. విశ్లేషణ చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు చిత్రయూనిట్ ముందే ప్రకటించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనలే ఈ సినిమాలో సన్నివేశాలుగా కనిపిస్తాయి. దర్శకుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల తాను రాసుకున్న కథకు తగినట్టే తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. పెళ్లికి ముందు తప్పు అనిపించని ఓ పొరపాటు.. లైఫ్‌ను పూర్తిగా మార్చేస్తుందని చూపించిన విధానంలో ఇచ్చిన మెసెజ్ యువతకు సూటిగా తాకుతుంది. తాత్కాలిక ఆనందాల కోసం పెడదోవ పడుతున్న యువతకు ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఇస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించారు. యువత థియేటర్‌కు వెళ్లి చూడాల్సిన సినిమా అని తప్పకుండా చెప్పొచ్చు. -
'పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే'.. ఆసక్తి పెంచుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్!
భరత్, నవీన రెడ్డి జంటగా నటిస్తోన్న చిత్రం బీఫోర్ మ్యారేజ్'. ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హనుమ క్రియేషన్ బ్యానర్‌పై ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 26న రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్ ఫిలించాంబర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. 'గత ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. ఈ ఏడాది 'హనుమాన్' చిత్రం కొనసాగించిన ప్రభంజనం మాదిరిగానే ఈ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్‌కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. దర్శకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 'పెళ్లికి ముందు తప్పు అనిపించని పొరపాటు.. లైఫ్‌లో ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని.. అదే విషయాన్ని వాస్తవానికి దగ్గరగా తెరకేక్కించాం. టీమ్‌లో ప్రతి ఒక్కరూ బాగా చేశారు సినిమా హిట్టవుతుందన్న నమ్మకం ఉంది.' అని అన్నారు. నిర్మాత జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 'చిన్న విషయమే కదా అని యువత పెడదోవ పడితే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించాం. సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్టవుతుంది. యువతీయువకులకు మంచి మెసెజ్ ఉంటుంది. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. ఈ చిత్రంలో అపూర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. పోస్టర్ చూడగానే యూత్‌కు మంచి సందేశాన్నిచ్చే చిత్రంలా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బీఫోర్ మ్యారేజ్ అనే టైటిల్ ఈ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది. పెళ్లికి ముందే అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఈ సోసైటీ ఎలా చూస్తుందనే సామాజిక కోణంలో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. -
పెళ్లికి ముందే వరకట్న వేధింపులు.. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే..
బంజారాహిల్స్: నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు నుంచే వరకట్న వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రోహిత్ డేవిడ్ పాల్‌కు గత ఏడాది మార్చి 1న కంట్రీక్లబ్‌లో యువతితో నిశి్చతార్థం జరిగింది. ఇందుకోసం అత్తింటివారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారు. గతేడాది జూలైలో పెళ్లి చేయాలని నిశ్చయించారు. సదరు యువకుడు పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చాడు. ఆయన తల్లి కూడా ఈ పెళ్లి విషయంలో పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. రూ.2 కోట్ల వరకట్నం ఇస్తే చేసుకుంటానంటూ ఇటీవల మెలిక పెట్టాడు. చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితురాలి మేనమామ ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదైంది.నిశ్చితార్థం సమయంలో బంగారు ఉంగరం, దుస్తుల కోసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వాటిని తిరిగి ఇప్పించాల్సిందిగా కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముందు ఇల్లు తర్వాతే పెళ్లి
సాక్షి, హైదరాబాద్: 90వ శతాబ్ధం వరకు జీవిత వరుసక్రమం.. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆ తర్వాతే ఇల్లు! కానీ, 20వ శతాబ్ధం నుంచి సీన్ రివర్స్ అయింది. ఉద్యోగం వచ్చిందంటే చాలు సొంతింటి ఎంపికే ప్రధాన లక్ష్యంగా మారింది. యువత జనాభా పెరుగుతుండటం, చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగ అవకాశాలు రావటం, తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంక్ రుణాలు లభ్యమవుతుండటం, ప్రభుత్వం నుంచి రాయితీలు, పన్ను మినహాయింపులుండటం వంటి కారణాలతో ముందు ఇల్లు.. ఆ తర్వాతే పెళ్లి ఆలోచన అంటోంది నేటి యువతరం. 1990 వరకూ పొదుపు చేసిన సొమ్మే: 1990 సంవత్సరం వరకూ సొంతిల్లు కొనాలంటే పొదుపు చేసిన సొమ్ముతోనో లేక పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. దీంతో ఆ సమయంలో ఎక్కువ శాతం గృహ కొనుగోలుదారులు 45–55 ఏళ్ల వయసుగల వాళ్లే ఉండేవాళ్లు. పైగా ఆ సమయంలో బ్యాంక్‌లు, ఇతర రుణ సంస్థలు కూడా ప్రాపర్టీ విలువలో 85–90 శాతం వరకు రుణాలు ఇచ్చేవి కావు. దీంతో పొదుపు చేసిన సొమ్మే సొంతింటికి దిక్కయ్యేది. 2000 నుంచి సీన్ మారింది: డెవలపర్లకు, ప్రకటనదారులకు గృహ కొనుగోలుదారుల వయసు అనేది అత్యంత ప్రధానమైంది. 2000 సంవత్సరం నుంచి గృహ కొనుగోళ్లలో చాలా మార్పులు వచ్చాయి. కస్టమర్ల అభిరుచుల్లోనే కాకుండా వారి కొనుగోలు శక్తి వయసులోనూ మార్పులు వచ్చాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపా రు. గృహ రుణాలు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. యువ ఉద్యోగులు కూడా దాచుకున్న డబ్బుతో కాకుండా రుణంతో కొనాలని భావిస్తున్నారు. బ్యాంక్‌లు కూడా తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. 35–45 ఏళ్ల లోపే టార్గెట్: అనరాక్ నివేదిక ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో 37 శాతం గృహ కొనుగోలుదారులు 35–45 ఏళ్ల వయసు వాళ్లున్నారు. 25 శాతం కస్టమర్లు 45–55 ఏళ్లు, 20 శాతం కస్టమర్లు 25–35 ఏళ్లు వయసున్నారు. ఇక, 25 ఏళ్ల లోపు కంటే తక్కువ ఉన్న కొనుగోలుదారులు 7 శాతం వరకున్నారు. హైదరాబాద్‌లో 38 శాతం ప్రాపర్టీ కొనుగోలుదారులు 25–35 సంవత్సరాల వయసున్న వాళ్లున్నారు. -
పెళ్లికి ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి
కేకే.నగర్(చెన్నై): పెళ్లికి ముందు స్త్రీ, పురుషులు వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నైకి చెందిన ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్లో తన భర్తకు బ్లడ్ కేన్సర్ ఉందని, పెళ్లికి ముందే అతనికి ఈ వ్యాధి ఉన్న విషయాన్ని దాచి తనకు 2014లో వివాహం జరిపించారని తెలిపింది. అతనితో కలిసి జీవించడం ఇష్టం లేని తాను విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొంది. ఈ పిటిషన్ విచారణలో ఉండగా నా భర్త తమకు విడాకులు మంజూరు చేయొద్దని మరొక పిటిషన్ దాఖలు చేశారని తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై ఈ న్యాయస్థానంలో విచారణ జరుగుతోందని, రెండు కేసులను కలిపి ఒకే న్యాయస్థానంలో విచారణ జరపడంపై ఆదేశాలు జారీచేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి కృపాకరన్ సోమవారం విచారణ జరిపి తీర్పు ఇచ్చారు. అందులోని వివరాలు 24 సంవత్సరాల యువతిని మోసంచేసి వివాహం చేసినట్లు అభియోగం మోపింది. ఈ కేసులో సమర్పించిన ఆధారాలను బట్టి చూస్తే యువతి మోసానికి గురైనట్లు తెలుస్తోంది.. అందువలన ఆమె కోరినట్లు విడాకులు మంజూరు చేస్తున్నాం.. కుటుంబ సంక్షేమ కోర్టుకు ఈ కేసు పంపితే జాప్యం జరిగే అవకాశం ఉండడం వల్ల విడాకులను వెంటనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. వివాహానికి ముందు తల్లిదండ్రులు నిజాలను తెలియజేయాలి. వివాహం చేసుకునే ముందు దంపతులయ్యే ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేసుకోవాలని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
పెళ్లికి ముందే వరకట్నం కేసు..
చిలకలగూడ(హైదరాబాద్): అనుకున్న 'మాట' ప్రకారం నిశ్చితార్థం జరిగిపోయింది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న వివాహాం ఏర్పాట్లలో మునిగిపోయింది అమ్మాయి కుటుంబం. అంతలోనే ఒక పిడుగుపాటు. అనుకున్న 'మాట' కాకుండా ఇంకా పెద్ద మూటలిస్తేనే పెళ్లన్నారు వరుడి కుటుంబీకులు. మోసపోయామని గ్రహించిన అమ్మాయి కుటుంబం చివరికి పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి జరగకముందే వరుడిపై వరకట్నం వేధింపుల కేసు నమోదయింది. మంగళవారం నగరంలోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ ఎస్సై వెంకటాద్రి తెలిపిన వివరాలను బట్టి.. చిలకలగూడకు చెందిన భారతి అనే మహిళ తన కుమార్తె అయిన హేమలతకు ఓ సంబంధం ఖాయం చేసింది. అబ్బాయి పేరు ఎం. సదాశివం. ఉండేది తమిళనాడులోని వల్లూరులో. 40 తులాల బంగారం, రూ. 3 లక్షల నగదు కట్నంగా ఇచ్చేందుకు అంగీకారం కుదరటంతో గతేడాది అక్టోబర్ 19న హబ్సిగూడలోని ఓ కళ్యాణ మండపంలో నిశ్చితార్ధం జరిగింది. ఇక పెళ్లి ఏర్పాట్లలో పడ్డ అమ్మాయి తల్లి.. తేదీల ఖరారు కోసం మాట్లాడగా.. అతడు, అతడి తల్లిదండ్రులు మాటమార్చారు. పెళ్లి జరగాలంటే 150 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకుంటే వివాహం రద్దవుతుందని హెచ్చరించారు. వ్యక్తిగతంగా కలిస్తేనన్నా కాస్త మెత్తబడతారేమోనని భారతి ఇటీవలే వల్లూరులోని వరుడి ఇంటికి వెళ్లింది. అక్కడ సదాశివం, అతని సోదరుడు దినేష్‌లు భారతిని అసభ్య పదజాలంతో దూషించి దాడిచేశారు. గాయాలపాలైన భారతి హైదరాబాద్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదుచేసింది. వరుడు, అతని సోదరునిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ వెంకటాద్రి తెలిపారు. -
ముందే విడిపోవడం మంచిది
-
ముందే విడిపోవడం మంచిది
వివాహం, విభేదాలు, విడిపోవడాలు, కోర్టులు కేసులు అంటూ తలనొప్పి తెచ్చుకునే కంటే పెళ్లికి ముందే విడిపోవడం బెటర్ అంటున్నారు నటి త్రిష. సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన నటీమణుల్లో ముందు వరుసలో ఉండే నటి త్రిష. ఎప్పుడు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో సమీప కాలంలో కలకలం పుట్టిస్తున్న నటి ఈ చెన్నై చిన్నది. ఆ మధ్య ప్రేమ వదంతులతో ప్రచారాల హోరుకు కేంద్రబిందువుగా మారారు. ఆ తరువాత వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో పెళ్లికి సిద్ధం అయ్యి విస్మయం కలిగించారు. వివాహ నిశ్చితార్థం జరి గి పెళ్లి పెటాకులు అవ్వడంతో మరోసారి హెడ్లైన్లతో పత్రికలకెక్కారు. తాజాగా వివాహ వ్యవస్థపై రకరకాల వ్యాఖ్యలు చేస్తూ విస్మయానికి గురి చేస్తున్నా రు. అమ్మాయిలకు పెళ్లి అవసరమే అంటూ ఒకసారి, పెళ్లి చేసుకోకుండా చాలామంది జీవిస్తున్నారంటూ మరోసారి, తగిన వ్యక్తి తారసపడితే వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఇంకోసారి ఇలా మార్చి మార్చి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అసలు తన మనస్థత్వం ఏమిటో ఎవరికీ అంతుపట్టని విధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఏమంటున్నారో చూడండి. వివాహ జీవితం సక్రమంగా అమరాలి. అలా కాని పక్షంలో మనస్పర్థలు, వివాహ రద్దు కోసం కోర్టుల చుట్టూ తిరగడం వేదన కలిగించే విషయం. ప్రస్తుత పరిస్థితిలో వివాహం చేసుకుని కోర్టుల ద్వారా విడిపోవడం కంటే, వివాహానికి ముందే ఇద్దరు కలసి మెలసి తిరిగి సరిపడకపోతే విడిపోవడం మంచిదని భావిస్తున్నాను. వివాహానికి ముందు అబ్బా యి, అమ్మాయి సహజీవనం చేయడం అనేది వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి ఉంటుంది. ఇందువల్ల కుటుంబంతో సమస్యలు తలెత్తకూడదు. వివాహం చేసుకుని విడాకులు తీసుకుంటే జీవితాంతం బాధపడేకంటే ముందే కలిసి మెలిసి తిరిగి విడిపోవడం మంచిదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. -
ఉద్యోగం రాలేదని వరుడు పరారీ: ఆగిన పెళ్లి
హైదరాబాద్: డీఎస్సీలో ఉద్యోగం రాలేదని ఓ పెళ్లి కొడుకు ముహూర్తం సమయంలో అదృశ్యమయ్యాడు. దీంతో పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.