బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రమోట్ అయిన నటీమణుల్లో వాణి భోజన్ ఒకరు. ఆకర్షణీయమైన అందం, అలరించే అభినయం ఉన్న ఈమె ఓ మై కడవులే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే నటిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత లాకప్, రామే ఆండాలుమ్ రావణనే ఆండాళుమ్, పాయుమ్ అని నీ వెనక్కు చిత్రాలతో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తమిళ్ రాకర్స్ వంటి వెబ్ సీరీస్‌లోనూ నటించారు.
ప్రస్తుతం ఆర్యన్, క్యాసినో, పగైవనుక్కూ అరుళ్ వాయ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అందాల ఆరబోతల్లో ముందుండే వాణి భోజన్ రాజకీయాలపై తన ఆసక్తిని వెలిబుచ్చారు. ఇటీవల హీరో విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాణిభోజన్ తన ఎక్స్ మీడియాలో నటుడు విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు.
దీని గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విజయ్ చాలాకాలంగా తన అభిమాన సంఘాల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. సెంగళం అనే వెబ్‌సీరీస్‌లో తాను రాజకీయ నాయకురాలి పాత్రను పోషించినట్లు చెప్పారు. ఆ సమయంలోనే తనకు రాజకీయాలపై ఆసక్తి కలిగిందన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు వాణి భోజన్.
చదవండి: వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ పవిత్ర
Comments
Please login to add a commentAdd a comment