
మోడలింగ్ రంగం నుంచి బుల్లితెరకు, ఆ తర్వాత వెండితెరకు పరిచయమైన నటి వాణిభోజన్. ఓ మై కడవులే చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత వరుసగా చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సీరీస్‌లతో బిజీగా ఉంది. ఈమె తాజాగా నటించిన వెబ్‌సీరీస్ సెంగలం. నటుడు కలైయరసన్ ప్రధాన పాత్రలో నటించిన ఇందులో వాణిభోజన్ రాజకీయ నాయకురాలుగా నటించింది. ఎస్సార్ ప్రభాకర్ దర్శకత్వంలో 9 ఎపిసోడ్స్‌గా రూపొందిన దీన్ని అభి అండ్ అభి పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇది ఇప్పుడు జీ5 చానల్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
వాణి భోజన్ మాట్లాడుతూ ఇంతకుముందు ఎప్పుడు నటించనటువంటి పాత్రను ఇందులో నటించినట్లు చెప్పింది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ పాత్ర తనకు చాలా కొత్తగా అనిపించిందని పేర్కొంది. కాగా ఈ అమ్మడిపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తున్నా మరికొందరు మాత్రం పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై స్పందించిన వాణి భోజన్ నువ్వు సినిమాల్లో నటించడానికి ఎందుకు వచ్చావు? అంటూ కొందరు చేస్తున్న కామెంట్స్ తన చెవి వరకు కూడా వచ్చాయని చెప్పింది. అలాంటి కామెంట్స్ చూసి మొదట్లో చాలా భయపడ్డానని, ముఖ్యంగా అలాంటివి తన తల్లితండ్రులు చదువుతారని అని భావించేదాన్ని పేర్కొంది. అయితే ఇప్పుడు అలాంటి వాటిని ధైర్యంగా ఫేస్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.
కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు చీర సరి చేసుకున్నా జూమ్ చేసి వీడియోలు తీసి కామెంట్స్ చేస్తున్నారని యూట్యూబ్‌పై మండిపడింది. అలాంటి వాటిని పట్టించుకుంటే సంతోషంగానే ఉండలేమని చెప్పింది. తాను సినిమాలో చాలా అప్ అండ్ డౌన్‌న్ చూశానని, నటించిన ఒక్కోచిత్రం వీడియో సమయంలో అది హిట్టో ఫ్లాపో సంతోషం కలుగుతుందని చెప్పింది. తను మాత్రం శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్నానని అది తనను ఎక్కడకు తీసుకెళ్లి నిలబెడుతుందో తెలియదని వాణి భోజన్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment