మూవీ టైటిల్ 'చట్నీ- సాంబార్'.. హీరోగా ప్రముఖ కమెడియన్! | Yogi Babu Vani Bhojan Upcoming Film Chutney Sambar Shoot Begins | Sakshi
Sakshi News home page

Yogi Babu: యోగి బాబు 'చట్నీ-సాంబార్'.. ఆ టైటిల్ ఏంట్రా బాబు!

Published Sun, Jul 16 2023 9:28 AM | Last Updated on Sun, Jul 16 2023 10:06 AM

Yogi Babu Vani Bhojan Upcoming Film Chutney Sambar Shoot Begins - Sakshi

కోలీవుడ్‌లో ఫేమస్ కమెడియన్ యోగిబాబు ఓ వైపు హాస్య పాత్రలో నటిస్తూనే మరోవైపు కథానాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలైన మావీరన్‌ చిత్రంలో కమెడియన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి చట్నీ సాంబార్‌ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రంలో నటి వాణి భోజన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నితిన్‌, సత్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాధా మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

యోగి బాబు ఇప్పటికే ఎస్‌జే సూర్య, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన బొమ్మై చిత్రం గత నెల 16వ తేదీన విడుదల కాగా..‌ మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని డిస్నీ హాట్‌ స్టార్‌ సంస్థతో కలిసి వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్నారు. దీనికి అజేష్‌ సంగీతాన్ని.. ప్రసన్నకుమార్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను శనివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. దర్శకుడు రాధా మోహన్‌ చిత్రాలు అంటేనే కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి. కాగా ఈ చిత్రం టైటిల్‌ కూడా చాలా కొత్తగా ఉంది. అదే సమయంలో ఇందులో వినోదానికి కొదవ ఉండదు అనిపిస్తుంది. దీంతో ఈ చట్నీ సాంబార్‌ చిత్రంపై ఆసక్తి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement