నియా శర్మ..హిందీ టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఈ బ్యూటీ టీవీ నటుడు రాహుల్ సుధీర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బీటౌన్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె..తన రిలేషన్ షిప్‌పై స్పందించింది. 'లాంగ్ రిలేషన్‌లో ఉందామని ఎన్నిసార్లు ప్రయత్నించినా చాలాసార్లు నాకు నిరాశే ఎదురైంది. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా. నేను ఇతడే నా లైఫ్ పార్టనర్ అని ఖచ్చితంగా నమ్మినప్పుడే మీడియాతో వెల్లడిస్తా. ఎందుకంటే చాలామంది జంటలు మీడియా, సోషల్ మీడియాలో పాపులర్ అయిన జంటలు విడిపోవడం దగ్గర్నుంచి చూశా. అలా అని వాళ్లని కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ నేను పెళ్లి చేసుకునే వ్యక్తి విషయాలు చాలా ప్రైవసీగా ఉంచాలనుకుంటున్నా. చాలా కాలం నుంచి తనతో డేటింగ్‌లో ఉన్నా.. చూద్దాం ఇది ఎంత వరకు ఎళ్తుందో'.. అని నియా శర్మ తన లివింగ్ రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి వెల్లడించింది. ఇప్పటివరకు డేట్ చేసిన వాళ్లలో ఇదే లాంగ్ రిలేషన్ అని చెప్పింది.
బ్యాక్‌లెస్ టాప్‌తో వయ్యారంగా డ్యాన్స్..
ఇక యాక్టింగ్‌లోనే కాదు, అందాల ఆరబోతలో ఓ మాత్రం వెనకడుగు వేయని నియా శర్మ తాజాగా మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్‌లతో మతి పోగోట్టే ఈ భామ లేటెస్ట్‌గా ఓ డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి బ్లాక్ లేదా వైట్..మధ్యలో ఏదీ ఉండకూడదు అంటూ ఓ క్యాప్షన్‌ను జత చేసింది. బ్యాక్‌లెస్ టాప్‌తో నడుమును వయ్యారంగా కదిలిస్తూ హాట్ పెర్ఫార్మన్స్‌తో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ భామ. ఇప్పటికే నియా చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
నియా సహనటుడు అడా ఖాన్ సైతం ఈ అమ్మడి డ్యాన్స్‌కు హాట్ అంటూ కామెంట్ చేశాడు. వీడియో షేర్ చేసిన కొద్ది సేపట్లోనే నెటిజన్లు లక్షల కొద్దీ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక టీవీ నటుడు రవి దూబెతో జమాయి 2.0 అనే వెబ్ సిరీస్‌లో నియా శర్మ నటించిన సంగతి తెలిసిందే. వెండితెర మీద ముద్దులు, హగ్గులు ఇచ్చుకునే ఈ జంట వెబ్‌సిరీస్‌లోనూ రెచ్చిపోయారు. అండర్ వాటర్‌లో లిప్‌లాక్ సీన్లలోనూ నటించారు. చివరగా ఖత్రోన్ కే ఖిలాడి మేడ్ ఇన్ అనే సీరియల్‌లో నియా శర్మ కనిపించింది.
చదవండి : (అతడు బెస్ట్ కిస్సర్, అంతా ఆమె వల్లే సాధ్యం!)
(సహజీవనం : బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పేసిన నటి)
Comments
Please login to add a commentAdd a comment