మణికొండ: సినీ హీరో రాజ్‌తరుణ్ తనతో కలిసి లివింగ్ రిలేషన్‌లో ఉండటం, గుడిలో పెళ్లి చేసుకోవటం, నన్ను ఫోన్‌లో చంపేస్తానని బెదిరించిన రికార్డులు అన్నీ ఉన్నాయని, వాటన్నింటినీ జతచేస్తూ న్యాయవాదితో కలిసి త్వరలోనే నార్సింగి పోలీసులకు మరో ఫిర్యాదు చేస్తానని అతని మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు.
ఆదివారం ఆమె నగరంలో మీడియాతో మాట్లాడుతూ హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో పరిచయం అయిన తరువాతనే రాజ్‌తరుణ్ పూర్తిగా మారిపోయాడన్నారు. తనను వదలించుకునేందుకు కట్టు కథలు అల్లుతున్నారన్నారు. గతంలో డ్రగ్స్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేక పోయినా బలవంతంగా అందులో ఇరికించారని, త్వరలోనే తాను నిర్దోషిగా బయటకు వస్తానన్నారు.
నార్సింగి పోలీసులు ఆధారాలు ఇవ్వాలని నోటీసు ఇచ్చారని, గతంలో తను ఇచి్చన ఫిర్యాదు సరిగా లేదనే విషయం తెలుసుకుని ప్రస్తుతం న్యాయవాదితో తయారు చేయించి పూర్తి ఆధారాలతో మరో ఫిర్యాదు ఇస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు సంగతి ఎలా ఉన్నా తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కలి్పంచాలని ఆమె కోరింది.
Comments
Please login to add a commentAdd a comment