హీరోయిన్‌కు సారీ చెప్పిన రాజ్‌ తరుణ్.. చాలా బాధగా ఉందంటూ..! | Tollywood Hero Raj Tarun Tweet Goes Viral On Social Media | Sakshi

Raj Tarun: 'అలా జరిగినందుకు సారీ.. చాలా అవమానంగా అనిపించింది'

Sep 12 2024 7:15 PM | Updated on Sep 12 2024 7:37 PM

Tollywood Hero Raj Tarun Tweet Goes Viral On Social Media

టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్‌ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం భలే ఉన్నాడే. ఈ సినిమాలో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న థియేటర్లలో సందడి చేయనుంది.

అయితే ఒకవైపు బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో అలరిస్తోన్న రాజ్ తరుణ్‌ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే యువతి అతనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ముంబయిలోని హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఇంటి వద్దకు వెళ్లిన లావణ్య హల్‌చల్‌ చేసింది. అయితే అక్కడే రాజ్ తరుణ్ ఉన్న సమయంలో ఈ గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలైంది.

(ఇది చదవండి: రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో కొత్త ట్విస్ట్‌.. డబ్బు కోసం అశ్లీల వీడియోలు)

తాజాగా ఈ సంఘటనపై రాజ్ తరుణ్ పోస్ట్ చేశారు. ముంబయిలో జరిగిన సంఘటనను తలచుకుంటే చాలా బాధగా ఉంది.. అవమానంగా అనిపించిందని ట్వీట్ చేశారు. ఇలా మీ నివాసం వద్ద జరిగినందుకు క్షమించాలంటూ మాల్వీమల్హోత్రాను ట్విటర్ ద్వారా కోరారు. అయినప్పటికీ మీతో, మీ స్నేహితులతో కలిసి వినాయక చవితి పండుగను ఆస్వాదించానని.. అలాగే ఆ గణేశుడి ఆశీస్సులు మనందరికీ ఉంటాయని రాజ్ తరుణ్‌ రాసుకొచ్చారు. అంతేకాకుండా గణేశునితో దిగిన ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement