'పదేళ్లు కలిసి ఉన్నాం.. రాజ్ తరుణ్ సమాధానం చెప్పాలి': లావణ్య కామెంట్స్ | Lavanya Comments On Raj Taru At Prasad Lab In Hyderabad | Sakshi
Sakshi News home page

Lavanya: 'పదేళ్లు కలిసి ఉన్నాం.. నా భర్త నాకు కావాలి': లావణ్య హాట్ కామెంట్స్

Jul 31 2024 5:44 PM | Updated on Jul 31 2024 7:53 PM

Lavanya Comments On Raj Taru At Prasad Lab In Hyderabad

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్‌ను కలిసేందుకు వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. ప్రసాద్‌ ల్యాబ్‌లో తిరగబడరా సామీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుగుతుండగా లావణ్య అక్కడికి వెళ్లేందుకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లావణ్యను వెళ్లకుండా నిలువరించారు. దీంతో నా భర్త రాజ్ తరుణ్‌తో నన్ను మాట్లాడనివ్వండి అంటూ పోలీసులను కోరింది. నా భర్తతో మాల్వీ ఎందుకు వచ్చిందని లావణ్య ప్రశ్నించింది. భర్తతో సంసారం చేసినట్లుగా మాల్వీ ఎందుకు కలిసి ఉంటోందని మాట్లాడింది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి.. ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడని లావణ్య కామెంట్స్ చేసింది. 

లావణ్య మాట్లాడుతూ..'నన్ను ఎందుకు రాజ్‌ తరుణ్‌ను కలవకుండా చేస్తున్నారు. నాకు రాజ్ సమాధానం కావాలి. నా భర్త నాకు కావాలి. నా నుంచి ఎన్నిసార్లు తప్పించుకుంటాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మాది లవ్ మ్యారేజ్. పెళ్లి ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించాం. కోర్టుకు అన్ని ఆధారాలు ఇచ్చాను. నాతో పదేళ్లు కలిసి ఉ‍న్నాడు. నాకు అబార్షన్‌ రెండుసార్లు చేయించాడు. నా ఇంటి నుంచి అతనే పారిపోయాడు. నేను ఒక సాధారణ ‍అమ్మాయిని. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాట్లేదో మీకే తెలియాలి. నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ' అని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. 

కాగా.. రాజ్ తరుణ్-లావణ్య టాపిక్‌ టాలీవుడ్‌లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో  ఈ వివాదం మరింత ముదిరింది. తాను రాజ్ తరుణ్‌తో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు లావణ్య ఆరోపించింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు కామెంట్స్ చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement