Prasad Labs
-
'పదేళ్లు కలిసి ఉన్నాం.. రాజ్ తరుణ్ సమాధానం చెప్పాలి': లావణ్య కామెంట్స్
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్‌ను కలిసేందుకు వచ్చిన లావణ్యను పోలీసులు అడ్డుకున్నారు. ప్రసాద్ ల్యాబ్‌లో తిరగబడరా సామీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా లావణ్య అక్కడికి వెళ్లేందుకు యత్నించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు లావణ్యను వెళ్లకుండా నిలువరించారు. దీంతో నా భర్త రాజ్ తరుణ్‌తో నన్ను మాట్లాడనివ్వండి అంటూ పోలీసులను కోరింది. నా భర్తతో మాల్వీ ఎందుకు వచ్చిందని లావణ్య ప్రశ్నించింది. భర్తతో సంసారం చేసినట్లుగా మాల్వీ ఎందుకు కలిసి ఉంటోందని మాట్లాడింది. ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి.. ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడని లావణ్య కామెంట్స్ చేసింది. లావణ్య మాట్లాడుతూ..'నన్ను ఎందుకు రాజ్ తరుణ్‌ను కలవకుండా చేస్తున్నారు. నాకు రాజ్ సమాధానం కావాలి. నా భర్త నాకు కావాలి. నా నుంచి ఎన్నిసార్లు తప్పించుకుంటాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మాది లవ్ మ్యారేజ్. పెళ్లి ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించాం. కోర్టుకు అన్ని ఆధారాలు ఇచ్చాను. నాతో పదేళ్లు కలిసి ఉన్నాడు. నాకు అబార్షన్ రెండుసార్లు చేయించాడు. నా ఇంటి నుంచి అతనే పారిపోయాడు. నేను ఒక సాధారణ అమ్మాయిని. అతన్ని ఎందుకు అరెస్ట్ చేయాట్లేదో మీకే తెలియాలి. నేను న్యాయం కోసం పోరాడుతున్నా. ' అని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. కాగా.. రాజ్ తరుణ్-లావణ్య టాపిక్ టాలీవుడ్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదిరింది. తాను రాజ్ తరుణ్‌తో 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు లావణ్య ఆరోపించింది. అంతేకాకుండా రాజ్ తరుణ్ తన భర్త అని చాలాసార్లు కామెంట్స్ చేసింది. -
ప్రసాద్ లాబ్స్ కి నేనే కింగ్ గా ఉండేవాడిని...!
-
వి బి ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ & టివి డైరెక్టరీ సీతారామశాస్త్రికి అంకితం..
ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతరామశాస్త్రికి మా "సమాచారదర్శిని"ని అంకితం చేయడం గర్వంగా ఉందన్నారు విష్ణు బొప్పన. వి.బి.ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ & టివి డైరెక్టరీని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఆవిష్కరించారు.ఈ వేడుకలో సీతారామశాస్త్రి తనయుడు, వర్ధమాన సంగీత దర్శకుడు యోగేశ్వర శర్మ, తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ డా: వకులాభరణం కృష్ణమోహన్ రావు, ప్రముఖ నటుడు-దర్శకుడు - తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, ప్రముఖ నటీనటులు దివ్యవాణి, కృష్ణుడు, మాదాల రవి, కరాటే కళ్యాణి, కోట శంకర్ రావు, గౌతమ్ రాజు, అశోక్ కుమార్, ఈస్టర్, టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ బాల, ఎ.వి.గ్రూప్ అధినేత జి.ఎల్.విజయకుమార్, విజన్ వివికె అధినేత వి.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 4న నిర్వహించనున్న వి.బి.ఎంటర్టైన్మెంట్స్ బుల్లితెర అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఆవిష్కరించారు. తనపై నమ్మకం ఉంచి... తనకు ఎంతగానో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ విష్ణు బొప్పన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. -
సినిమా ఇండస్ట్రీకి మంచి దర్శకుడు దొరికాడు: నిర్మాత
Dhruva Kerosene Movie Pre Release Event In Hyderabad: బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా ధృవ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'కిరోసిన్'. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ మిస్టరీ కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. 'నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. కథ మీద ఎంతో నమ్మకం, నాపై అపారమైన నమ్మకంతోనే ఈ అవకాశం ఇచ్చారు. నేను హీరోగా నటిస్తాను అన్నప్పుడు వారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిస్టరీ సినిమానే అయినా అన్ని రకాల అంశాలు చిత్రంలో ఉంటాయి.' అని తెలిపాడు. చదవండి: ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె.. 'నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికి థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ధృవ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండా చేయాలని భావించాను. దానికి తగిన అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా కోసం ఆయన చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా ఇండస్ట్రీకి ధృవ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడని చెప్పవచ్చు.' అని నిర్మాత దీప్తి కొండవీటి పేర్కొన్నారు. -
ఎందరో మహానుభావులు పుస్తక ఆవిష్కరణ
-
‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఆడియో ఫంక్షన్
-
సినిమా అంటే మూర్తికి పిచ్చి
-
మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించి స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించిన సినిమా ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ మంగళవారం సాయంత్రం మే 21న ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి నారాయణమూర్తితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన నికార్సయిన మనిషని ప్రశంసలు కురిపించారు. ‘నా మిత్రుడికి ఆనందాన్ని కలిగించేందుకే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నారాయణమూర్తితో నాలుగున్నర దశాబ్దాల పరిచయం నాది. ఈ ఆడియో వేడుకకు రావడం సంతోషంగా ఉంది. సినిమా అంటే మూర్తికి పిచ్చి. కమర్షియల్ అయిపోతున్న ఈరోజుల్లో తన కమిటిమెంట్‌తో ముందుకు సాగుతున్నాడు. అప్పటి నారాయణమూర్తి ఇప్పటి నారాయణమూర్తి ఒక్కడే. ఆస్తులు, అంతస్తులు కాదు సినిమానే ప్రాణం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమాతోనే సంసారం చేస్తున్నాడు. దేశంలో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అవుతోంది. నారాయణమూర్తి చిత్రం ఇందుకు నిదర్శనం’అన్నారు. సినిమా అంటే మూర్తికి పిచ్చి -
ఎల్వీ ప్రసాద్‌గారు ఎందరికో స్ఫూర్తి
‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించడమే. ఆయన ఒక వ్యవస్థ. సినిమా రంగంలో తనకు ఇష్టమైన అన్ని శాఖల్లోనూ ఆయన రాణించారు. ప్రసాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అందుకే ఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. గతాన్ని ఎవరూ మర్చిపోకూడదు. భావి తరాలకు చెప్పాలి. ఎల్వీ ప్రసాద్‌గారి కలల్ని ఆయన తనయుడు సాకారం చేయడం ఆనందంగా ఉంది’’ అని హీరో బాలకృష్ణ అన్నారు. అక్కినేని లక్ష్మీ వరప్రసాద్(ఎల్వీ ప్రసాద్) 111వ జయంతిని గురువారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సీనియర్ నటి గీతాంజలి మాట్లాడుతూ– ‘‘నన్ను అందరూ సీతమ్మ అని పిలుస్తున్నారంటే కారణం పెద్దాయన ఎన్టీఆర్‌గారే. ‘సీతారామకల్యాణం’ తర్వాత నేను చేసిన సినిమా ‘ఇల్లాలు’. అప్పట్లో ఎల్వీ ప్రసాద్‌గారి మెప్పు పొందాను’’ అన్నారు. ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నకి సినిమా తప్ప మరేమీ తెలియదు. నన్ను నటుణ్ని చేయాలన్నది ఆయన కోరిక. అయితే ఓ సారి ‘సంసారం’ సినిమా షూటింగ్లో అంత సేపు స్టూడియోలో కూర్చోవడం ఇష్టం లేక ఆయన్ని విసిగించాను. అప్పటి నుంచి నాకు యాక్టింగ్ మీద పెద్దగా ఆసక్తిలేదు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వచ్చాను’’ అన్నారు. ‘‘ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్... ఇద్దరూ మహావృక్షాలు. తాము సంపాదించినదాన్ని సినిమా రంగంలోనే పెట్టుబడి పెట్టారు. వారి వారసత్వాన్ని వారి పిల్లలు కొనసాగిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయన తనయుడు రమేష్ ప్రసాద్‌గారు ఓ మంచి బయోపిక్ తీయాలి’’ అని దర్శక–నిర్మాత వైవీఎస్ చౌదరి అన్నారు. -
‘ఆయన ఎంతో మందికి స్ఫూర్తి’
అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ 111వ జయంతి ఉత్సవం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ లో గురువారం ఉదయం ఘనంగా జరిగింది. ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వైవీయస్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఎల్వీ ప్రసాద్, ఎన్టీఆర్ ఇద్దరూ మహావృక్షాలు. సినిమా రంగం పట్ల వ్యామోహాన్ని పెంచుకున్నారు. సినిమా రంగంలోనే తాము సంపాదించినదాన్ని ఇన్వెస్ట్ చేశారు. వారి వారసత్వాన్ని వారి పిల్లలు కొనసాగిస్తున్నారు. నా లాహిరిలాహిరి లాహిరిలో సినిమా సమయంలో నేను ప్రసాద్ ల్యాబ్స్ కు 8.75లక్షలు కట్టాల్సి ఉన్నప్పటికీ నాకు రమేష్ ప్రసాద్‌గారు సాయం చేశారు. అలాగే `రేయ్` కూడా ఆయన ఆశీస్సులతోనే విడుదలైంది. ఇక.. నందమూరి బాలకృష్ణ తండ్రి మీద బయోపిక్ తీసి అందరి మెప్పు పొందారు. అదేవిధంగా ఎల్వీ ప్రసాద్‌గారి మీద ఆయన తనయుడు ఓ మంచి బయోపిక్ తీయాల’న్నారు. ప్రసాద్ క్రియేటివ్ మెంటార్స్ ఫిలిం అండ్ మీడియా స్కూల్ ప్రతినిధి సురేష్ కొవ్వూరి మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం. త్వరలోనే ప్రొడక్షన్లోకి రావాలనుకుంటున్నాం. ఎల్వీ ప్రసాద్‌గారి జీవితంలోని విషయాలను ప్రతి ఒక్కరూ తలా రెండు పేజీలు చదివి ఆచరించినా చాలు’ అని చెప్పారు. రమేష్ ప్రసాద్ తనయ రాధాప్రసాద్ మాట్లాడుతూ ‘మా తాతగారి గురించి ఏవీ చూసి థ్రిల్ అయ్యాను. మా పూర్వీకుల విలువలని, వాళ్ల ఆలోచనలని గౌరవించి, కొనసాగిస్తాం. మా నాన్నగారు ముందుండి తాతగారి బయోపిక్ తీయాలని ఆలోచిస్తున్నాం’ అని అన్నారు. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ ‘మా నాన్న సినిమా వ్యక్తి. ఆయనకు సినిమా తప్ప మరేమీ తెలియదు. ఇంట్లో వాళ్లని కూడా ఎక్కువగా కలిసేవారు కాదు. ఒక స్టూడియో నుంచి మరో స్టూడియోకి వెళ్లే దారిలో ఆయన రెస్ట్ తీసుకునేవారు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఈ రంగంలోకి వచ్చాను. మా ప్రసాద్ ప్రాసెసింగ్ ల్యాబ్‌కి 17 సార్లు జాతీయ పురస్కారం దక్కింది. మా నాన్నకు పృథ్విరాజ్‌కపూర్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్లలాగా మా కుటుంబం కూడా సినిమాల్లోనే ఉండాలని కోరుకునేవార’ని తెలిపారు. నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘భారత సినీ రంగంలో ఎల్వీ ప్రసాద్‌గారి గురించి చెప్పడం అంటే సూరీడికి వెలుగు చూపించడమే. ఆయన ఒక వ్యవస్థ. నటుడు కావాలనుకున్నారు. అలాగే నటించారు. దర్శకుడిగా మారారు. ఆయన సినిమా రంగంలో తనకు ఇష్టమైన అన్ని శాఖల్లోనూ కృషి చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ అనే గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఐ ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేశారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎల్వీ ప్రసాద్‌గారి కలల్ని ఆయన తనయుడు సాకారం చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
నాన్న జర్నీ నుంచి ఆ నాలుగు విషయాలు నేర్చుకోవాలి
తెలుగు సినిమా బుడి బుడి అడుగులు వేస్తున్న సమయంలో తెలుగు సినిమా స్థాయి పెరగడానికి కృషి చేసిన దర్శక– నిర్మాతల్లో ఎల్వీప్రసాద్ ప్రముఖులు. తెలుగు, హిందీ, తమిళ తొలి టాకీ సినిమాల్లో నటించిన అరుదైన రికార్డ్ ఆయనదే. దర్శకుడిగా ‘మన దేశం, సంసారం మిస్సమ్మ’ వంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హిందీలో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. నిర్మాతగా ‘ఇలవేలుపు, ఇల్లాలు’ వంటి చిత్రాలు నిర్మించారు. నేడు ఎల్వీ ప్రసాద్ 111వ జయంతి. ఈ సందర్భంగా తండ్రికి ఎల్వీ ప్రసాద్ ప్రయాణాన్ని పంచుకున్నారు ఆయన తనయుడు, ప్రసాద్ ల్యాబ్స్ అధినేత, నిర్మాత రమేశ్ ప్రసాద్. ‘‘మా నాన్నగారి ప్రయాణాన్ని తలచుకున్నప్పుడుల్లా నాకు గుర్తొచ్చేది నాలుగు విషయాలు. ప్రిసర్వెన్స్(పట్టుదల), ప్యూరిటీ ఆఫ్ థాట్స్ (కల్మషం లేని ఆలోచనలు), ప్యాషన్ (తపన), పేషన్స్ (ఓపిక). చదువు లేకపోయినా ఆయన అనుకున్నది సాధించారు. చిన్నప్పటి నుంచి నాన్నగారికి నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. వ్యవసాయంలో మా తాతగారికి ఊహించలేనంత నష్టం వాటిల్లింది. దాంతో మా నాన్నగారు ఎవరికీ చెప్పకుండా కేవలం 100 రూపాయిలతో ముంబై వెళ్లిపోయారు. అప్పు తీర్చలేక పారిపోయారని అందరూ అనుకున్నారట. కానీ సినిమాల మీద ఆసక్తితో ముంబై చేరుకొని అక్కడ వాచ్‌మెన్‌గా ఉద్యోగం సంపాదించారు. హిందీ రాకపోయినా కేవలం సైగలతో సంభాషించేవారని తర్వాతి రోజుల్లో నాన్నగారు చెబితే మాకు తెలిసింది. ఓ టైలర్ షాప్‌ను శుభ్రం చేసే పని కూడా చేశారాయన. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విషయానికి మా నాన్నగారు ఓ చక్కని ఉదాహరణ. నాన్నగారి తపనను గమనించిన టైలర్ ఆయన సినిమాల్లోకి వెళ్లడానికి తన వంతు సహాయం చేశారు. ఇంటి నుంచి వెళ్లిపోయాక 16 నెలలకు ‘నేను బావున్నాను. సినిమాల్లో పని చేస్తున్నాను’ అంటూ ఇంటికి ఉత్తరం రాశారు. వాచ్‌మేన్‌గా పనిచేసిన థియేటర్ మరమత్తులు జరిగి, మళ్లీ నాన్నగారి సినిమాతోనే ప్రారంభం అయింది. ఆ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కమల్ హాసన్‌తో ఈ విషయాన్ని పంచుకున్నారు నాన్నగారు. మా నాన్నగారు తీసిన సినిమాల్లో ‘బిదాయి’ అనే సినిమా అంటే నాకు ఇష్టం. వాస్తవానికి నాన్నగారి గురించి వినడం తప్పితే ఎక్కువగా ఆయనతో గడిపింది లేదు. ఆయన షూటింగ్స్‌తో అంత బిజీగా ఉండేవారు. తనను ఇంతవాణ్ని చేసిన ప్రేక్షకులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ స్థాపించారు. సినిమాకు తిరిగివ్వాలని ప్రసాద్ ల్యాబ్స్ స్థాపించారు. కెమెరా అంటే నాకు కొంచెం ఇబ్బంది. అందుకే సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. ‘సంసారం’లో చిన్న పాత్రను పోషించాను. ‘మీ నాన్నగారి బయోపిక్ తీస్తారా?’ అని చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఏమీ అనుకోలేదు. మా ప్రొడక్షన్లో రెండు సినిమాలు తీశాం. అవి అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రేక్షకుల అభిరుచి మారుతోంది. మరో సినిమా తీయాడానికి చర్చలు నడుస్తున్నాయి’’ అన్నారు. -
‘సయ్యారే’ విడుదల
బంజారాహిల్స్: సిక్స్ స్టింగ్ ఆడియో పతాకంపై నటుడు, వైద్యుడు డాక్టర్ సంజయ్‌పాల్ స్వయంగా పాటలు పాడి, నటించిన ‘సయ్యారే ’ ప్రైవేటు ఆల్బమ్ బుధవారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ ఆడిటోరియంలో విడుదల చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ చక్కటి బాణీలతో, కొత్త తరహా చిత్రీకరణతో ఆకట్టుకునేలా ఉన్న ఆల్బమ్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆల్బమ్‌లో హీరోయిన్లుగా నటించిన అన్నే, పూజశ్రీ, దర్శకుడు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. -
వారి కోసం 'బాహుబలి' స్పెషల్ షో
హైదరాబాద్ : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'బాహుబలి' చిత్రాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు తిలకించారు. దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శుక్రవారం సాయంత్రం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ఫిలిం ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ సినిమాను గవర్నర్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్‌తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. కాగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న బాహుబలి సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. -
చెత్త మూటలు కట్టిపెట్టోయ్..
1995.. ప్రసాద్ ల్యాబ్‌లో డబ్బింగ్ థియేటర్. నాలుగేళ్ల ఓ చైల్డ్ ఆర్టిస్ట్ చాక్లెట్ ఇస్తే తినేసి ర్యాపర్ పట్టుకుని ల్యాబ్ అంతా తిరిగింది. అది పడేసే చోటు కోసం.. అంటే చెత్తబుట్ట కోసం ! ఓ పక్కన పడవేయమని ఎంతమందన్నా.. పట్టుబట్టి తనే స్వయంగా చెత్తబుట్టలో వేసింది. ఆ చిన్నారి బేబీ కావ్య. లిటిల్ సోల్జర్స్ చిత్రంతో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్న కావ్యకు ఉత్తమ సిటిజన్ సత్కారం ఇవ్వాలి. 2014 జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్. ఓ స్కూల్ బస్సు ఆగింది. లోపల పిల్లలకు చాక్లెట్లు పంచినట్టున్నారు. 3 నిమిషాల వ్యవధిలో కిటికీ నుంచి 4 చాక్లెట్ ర్యాపర్లు బయటకు వచ్చిపడ్డాయి. నేను ఓ వైపే చూశాను. మరోవైపు ఎన్ని పడ్డాయో తెలియదు. వాళ్లంతా కార్పొరేట్ విద్యార్థులు. వాళ్లకి రోడ్డే ఓ చెత్తబుట్ట. ఇది దేనికి సంకేతం..? ఒకప్పుడు పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తకుండీలు అరుదుగా కనిపించేవి. కానీ, వ్యవస్థలో మార్పు కోసం మున్సిపాలిటీలు ఆకర్షణీయమైన చెత్తకుండీలు ఏర్పాటు చేశాయి. మార్పు రానిదల్లా మనలోనే. మనకు రోడ్లే చెత్తకుండీలు. ఇందుగలదు.. అందులేదన్న.. సందేహం వలదు.. అన్న చందాన చెత్త కనిపించనిదెక్కడ? ముందు మనం ‘చెత్త’డిసిప్లిన్ అలవాటు చేసుకుందాం. టైప్స్ ఆఫ్ వేస్ట్ చెత్త గురించి చెప్పాలంటే వంటింట్లో తయారయ్యే చెత్త.. కూరగాయ తొక్కలు, వండిన ఆహారం, పండ్లు, మాంసం.. ఇవి డీ కంపోజ్ అయ్యే చెత్త. ఇది కుళ్లి భూమిలో కలసిపోతుంది. ఇక డ్రై వేస్ట్.. పేపర్లు, గాజు, చెక్క వీటిలో చాలా వరకు రీసైకిల్ చేసేందుకు అనువుగా ఉంటాయి. పాలిథిన్ మహమ్మారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మన ఇంట్లో ఉత్పత్తయ్యే మరో రకం చెత్త ‘ఈ-వేస్ట్’. ఎలక్ట్రానిక్ విడిభాగాలు, బ్యాటరీలు, బల్బులు, కంప్యూటర్ సంబంధిత వేస్టేజ్. వీటిని ఎలా మేనేజ్ చేయాలో చాలామందికి తెలియదు. అందుకే ఈ-వేస్ట్‌ను కూడా సాధారణ చెత్తకుండీల్లో వేస్తున్నాం. ఇక ఇళ్లల్లో తక్కువగా, హాస్పిటల్స్‌లో ఎక్కువగా ఉత్పత్తయ్యే చెత్త మెడికల్ వేస్ట్. ఆస్పత్రుల్లో ఈ రకం చెత్తను రంగుల్లో విభజించి తరలిస్తారు. కానీ మన ఇళ్లలో సిరంజీలు, మాత్రలు వంటివి సాధారణ చెత్తలో కలసిపోతాయి. వీటిని వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపడం ఎంత తలనొప్పి వ్యవహారమో ఒక్కసారి ఆలోచించండి. కలివిడిగా నడుద్దాం.. గోవాలో పాంజిమ్, మహారాష్ట్రలోని పుణే నగరాల్లో మున్సిపాలిటీలు తడి, పొడి చెత్తను విడివిడి రోజుల్లో కలెక్ట్ చేస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించడంతో అవి క్లీన్‌సిటీలుగా మెరిసిపోతున్నాయి. మన మున్సిపాలిటీలోనూ దాన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు గానీ.. ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దాని సంగతి అటుంచితే.. మన నుంచి కొందరైనా చెత్తను విభజించి పంపిద్దాం. మన డంపింగ్ సమస్యల మేనేజ్మెంట్ గురించి గళమెత్తుతున్న సుకుకి ఎక్స్‌నోరా అనే స్వచ్ఛంద సంస్థ రెండు చెత్తల విధానాన్ని ప్రోత్సహించమని ప్రభుత్వాన్ని, సమాజాన్ని కదిలిస్తోంది. మనం కూడా ఈ రెండు చెత్తబుట్టల ఉద్యమంలో కలుద్దాం. తడిపి మోపెడు చేయొద్దు.. ఇప్పటికే చాలామంది వంటింటి వేస్టేజ్‌కు సపరేట్ చెత్తబుట్ట వాడుతున్నారు. పొడిచెత్త కలపకుండా డీకంపోజ్ అయ్యే చెత్తను మాత్రమే అందులో వేయండి. ఇంకో చెత్తబుట్టలో డ్రై వేస్ట్ అంటే రీసైకిల్ చేయగలిగిన పేపర్, గాజు, ప్లాస్టిక్, చెక్క వంటి వస్తువులు వేయండి. ఇందులో తడి చెత్త వేయకండి. పొడి చెత్తబుట్టకు న్యూస్ పేపర్ గానీ, పేపర్‌తో తయారు చేసిన బ్యాగులో గానీ ఇవి వేయండి. పారిశుధ్య కార్మికులకు న్యూస్‌పేపర్ బ్యాగ్ కానీ, పొట్లం కానీ రీసైకిల్‌కు సంకేతమని అర్థం అవుతుంది. ఇక మెడికల్ వేస్ట్‌ను వీటిలో కలపకుండా వీలు చూసుకుని దగ్గర్లోని హాస్పిటల్స్ ట్రాష్‌లో వేయండి. ‘ఈ-వేస్ట్’ సాధారణ చెత్తలో వేయకుండా...పాతసామాన్లు కొనే వారికి ఇవ్వండి. కనీసం అప్పుడైనా అది చేరాల్సిన చోటికి చేరుతుందేమో ! కంపౌండ్‌లో కంపోస్ట్.. తడి చెత్తను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి పారేస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు. కుదిరితే నల్లని రీసైకిల్డ్ బ్యాగ్‌లను వాడండి. మా ఇంట్లో పేపర్ సంచులు మేమే తయారు చేసుకుంటున్నాం. వీటి తయారీ పిల్లలూ ఇష్టపడతారు. పైగా ‘చెత్త’పాఠాలు నేర్చుకుంటారు. మరో అడుగు ముందుకు వేయగల్గితే.. ఇళ్లలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో తడి చెత్తను మనమే కంపోస్ట్‌గా మార్చుకోవచ్చు. కంపోస్ట్ గుంటను గానీ, రెడీమెడ్ మట్టి కంపోస్ట్ కుండీలో గానీ వాడితే చెత్తను ఎరువుగా తయారు చే యొచ్చు. అదీ పెద్ద శ్రమ, ఖర్చు లేకుండానే. మూడేళ్లుగా మా ఇంటి చెత్తను మేం కంపోస్ట్ చేస్తున్నాం. ఇక అమల అక్కినేని గారైతే స్వయంగా కంపోస్ట్ చేయడమే కాక, అది తనకు స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ అని మరీ చెప్తారు. ఈ కంపోస్ట్ తయారీ గురించి మరిన్ని వివరాలు హైదరాబాద్ గోస్ గ్రీన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందు ఏ చెత్తను ఏ బుట్టలో వేయాలో అందులోనే వేద్దాం. అంతకంటే ముందు చెత్తను చెత్త బుట్టలో వేసే ‘చెత్త డిసిప్లిన్’ అలవాటు చేసుకుందాం. లెట్స్ గ్రో క్లీన్. -
నిర్మాత దర్శకుడినెప్పుడూ మెచ్చుకోడు
చిత్ర నిర్మాత ఎప్పుడూ మెచ్చుకోరని యువ దర్శకుడు జయం రాజా వ్యాఖ్యానించారు. టాలీవుడ్ యువ నటుడు నిఖిల్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేస్తున్న చిత్రం కార్తికేయన్. కలర్ స్వాతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకట్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఎం.చందు దర్శకత్వం వహించగా శేఖర్ చంద్ర సంగీత బాణీలందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శకుడు జయం రాజా మాట్లాడుతూ నిర్మాత తండ్రి అయినా ఆ చిత్ర దర్శకుడిని మెచ్చుకునే ప్రశ్నే ఉండదన్నారు. చిత్ర బడ్జెట్ పెంచావ్, నిర్మాణంలో జాప్యం అయ్యింది వంటి విమర్శలు దర్శకుడు భరించాల్సిందేనని చెప్పారు. అలాంటిది ఈ కార్తికేయన్ చిత్ర నిర్మాత, దర్శకుడిని అభినందించడం నిజంగా సంతోషంగా ఉందన్నారు. చిత్ర హీరో నిఖిల్ తెలుగులో పది చిత్రాలకు పైగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారని, హీరోయిన్ స్వాతి తమిళ పరిశ్రమకు సుపరిచితురాలని పేర్కొన్నారు. తన తొలి చిత్రం జయంలో కార్తికేయన్ వేలాయుధం ముఖ్య పాత్ర పోషించారన్నారు. ఇప్పుడీ చిత్రమే కార్తికేయన్ పేరుతో రూపొందుతోందని మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నట్లు జయంరాజా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ మోహన్, నటి తులసి, స్వాతి, నిఖిల్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.