Dhruva Kerosene Movie Pre Release Event In Hyderabad: బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మాతలుగా ధృవ హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'కిరోసిన్'. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ మిస్టరీ కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హీరో, దర్శకుడు ధృవ మాట్లాడుతూ.. 'నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. కథ మీద ఎంతో నమ్మకం, నాపై అపారమైన నమ్మకంతోనే ఈ అవకాశం ఇచ్చారు. నేను హీరోగా నటిస్తాను అన్నప్పుడు వారు చేసిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. మిస్టరీ సినిమానే అయినా అన్ని రకాల అంశాలు చిత్రంలో ఉంటాయి.' అని తెలిపాడు.
చదవండి: ఆ పాత్ర కోసం 15 రోజులు ఇంట్లో వాళ్లతో మాట్లాడలేదు: నటుడు
హైదరాబాద్ ఆస్పత్రిలో చేరిన దీపికా పదుకొణె..
'నాకు సపోర్ట్ చేసిన కుటుంబ సభ్యులందరికి థాంక్స్. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ధృవ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ సినిమా తప్పకుండా చేయాలని భావించాను. దానికి తగిన అవుట్ ఫుట్ వచ్చింది. సినిమా కోసం ఆయన చాలా బాగా కష్టపడ్డాడు. సినిమా ఇండస్ట్రీకి ధృవ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడని చెప్పవచ్చు.' అని నిర్మాత దీప్తి కొండవీటి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment