లావణ్య ఎవరో కూడా తెలియదు.. తనవన్నీ అబద్ధాలే: రాజ్ తరుణ్ హీరోయిన్ | Heroine Malvi Malhotra Responds On lavanya Allegations | Sakshi
Sakshi News home page

Malvi Malhotra: తనెవరో కూడా నాకు తెలియదు.. లావణ్యపై చర్యలు తీసుకుంటా: మాల్వీ మల్హోత్రా

Published Sun, Jul 7 2024 4:08 PM | Last Updated on Sun, Jul 7 2024 6:25 PM

Heroine Malvi Malhotra Responds On lavanya Allegations

రాజ్ తరుణ్- లావణ్య టాపిక్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఇప్పటికే వీరిద్దరు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. రాజ్ తరుణ్ హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో రిలేషన్‌లో ఉన్నాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేస్తోంది. అంతే కాకుండా తనను చంపేస్తానని బెదిరిస్తోందంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

అయితే లావణ్య చేస్తున్న ఆరోపణలపై తిరగబడరా స్వామి మూవీ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా రియాక్ట్ అయింది. తనపై వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని మాల్వీ కొట్టిపారేసింది. నా కుటుంబం గురించి ఆమె చేసిన కామెంట్స్‌ నిజం కాదని తెలిపింది. ఆమెపై తప్పకుండా ఫిర్యాదు చేస్తానని.. పరువునష్టం దావా వేస్తానని వెల్లడించింది. 

మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ..'ఆమె నా కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్స్‌ తీసుకుంది. అవీ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎలా సేకరించిందో తెలియాలి. లావణ్యను నేను ఇప్పటివరకు కలవలేదు. ఆమె ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అంతే కాదు.. తన గురించి నాకేలాంటి వివరాలు తెలియదు. నేను కేవలం సినిమా గురించి మాత్రమే రాజ్‌ తరుణ్‌తో మాట్లాడతా. సెప్టెంబర్‌ నుంచి నాకు, రాజ్ తరుణ్‌కు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. నాపై లావణ్య చేస్తున్నవన్నీ అవాస్తవాలే. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. దీనివల్ల నా రిప్యూటేషన్ దెబ్బతింటుంది. తప్పకుండా ఆమెపై పరువునష్టం దావా వేస్తా.' అని హెచ్చరించారు. కాగా.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా తిరగబడరా స్వామి చిత్రంలో నటిస్తున్నారు. 
 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement